ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో భారత్‌కు తొలి ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేశాడు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో ధీరజ్ డబుల్ ధమాకా సృష్టించాడు. రజత పతకం నెగ్గడంతో పాటు ఆర్చరీ రికర్వ్ కేటగిరీలో భారత్‌కు ఒలింపిక్ బెర్త్ అందించాడు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్‌కు ఆర్చరీలో భారత్‌కు లభించిన తొలి స్థానం ఇదే కావడం విశేషం. ఆసియన్ కాంటినెంటల్ అర్హత టోర్నీ ఫైనల్లో ధీరజ్ 5-6 తేడాతో చైనీస్ తైపీ ఆర్చర్ జిహ్ సియాంగ్ లింగ్ చేతిలో ఓడి రజతంతో సంతృప్తి చెందాడు. అంతకుముందు ధీరజ్ క్వార్టర్‌ఫైనల్లో ఇరాన్‌కు చెందిన సదేగ్ అష్రఫ్ బావిలిపై 6-0తో, సెమీస్‌లో మరో ఇరానియన్ ఆర్చర్ మొహ్మదొసీన్ గోల్షానిపై 6-0తో గెలుపొందాడు. క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 6–0తో ఇరాన్‌కు చెందిన సాదిగ్ అష్రాఫి బవిలి, సెమీ ఫైనల్లో 6–0తో ఇరాన్‌కే చెందిన మొహమ్మద్ హొస్సేన్ గొల్షానిపై విజయం సాధించాడు. ఈ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన ఇద్దరికి మాత్రమే ఒలింపిక్స్ కోటా బెర్తు లభిస్తుంది. మహిళల విభాగంలో అంకిత భకత్ క్వార్టర్ ఫైనల్లోనే ఓడిపోవడంతో బెర్తు దక్కలేదు.
ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీలో భారత్‌కు తొలి ఒలింపిక్ బెర్త్‌ను ఖాయం చేయడంపై క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈసారి జరిపే పారిల్ ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాలు ఖాయమనుకుంటున్న విభాగాల్లో ఆర్చరీ ముందు విభాగంలో ఉంది. ఇటీవల చైనాలో జరిగిన ఆసియా గేమ్స్‌లోనూ భారత ఆర్చర్లు సత్తా చాటారు.
బొమ్మదేవర ధీరాజ్ జననం 3 సెప్టెంబర్ 2001న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించాడు. 22 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించి సత్తా చాటాడు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత, రికర్వ్ టీం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రికర్వ్ పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15వ స్థానంలో ఉన్నాడు. చైనాలోని హాంగ్‌జౌలో జరిగే 2022 ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అతాను దాస్ , ధీరజ్ బొమ్మదేవర, తుషార్ షెల్కేలతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు 2022 ఆసియా క్రీడల్లో రజత పతకాన్ని గెలుచుకుంది . ఫైనల్లో ఈ జట్టు రిపబ్లిక్ ఆఫ్ కొరియా చేతిలో ఫైనల్లో ఓడిపోయింది. 2023లో జర్మనీలోని బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జట్టు, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌తో పాటు వ్యక్తిగత ఈవెంట్‌లలోనూ ధీరజ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించాడు.
2023లో టర్కీలోని అంటాల్యలో జరిగిన ప్రపంచ కప్‌లో పురుషుల వ్యక్తిగత ఈవెంట్, టీం ఈవెంట్‌లలో పాల్గొన్నాడు. 2023లో పారిస్, ఫ్రాన్స్, చైనాలోని షాంఘైలో జరిగిన ప్రపంచ కప్‌లలో ఆర్చరీ రికర్వ్, టీం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో పాల్గొన్నాడు . 2023లో కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన ప్రపంచ కప్ స్టేజ్ 3లో పురుషుల టీం ఈవెంట్, పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లలో రెండు కాంస్య పతకాలను గెలుచుకున్నాడు . 2023 సెప్టెంబర్‌లో హెర్మోసిల్లోలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2022 జనవరిలో హైదరాబాద్‌లో జరిగిన ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో టోక్యో ఒలింపియన్ తరుణ్‌దీప్ రాయ్‌ని ఓడించాడు . 2021లో అతను గ్వాటెమాల సిటీ, గ్వాటెమాల, ఫ్రాన్స్‌లోని పారిస్‌లలో జరిగిన ప్రపంచ కప్‌లలో పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు .