Ballon d'Or Nominations: బాలోన్‌డోర్‌.. అత్యుత్తమ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడికి అందించే అవార్డు. బాలోన్‌డోర్ 2022 అవార్డును మరోసారి అందుకునేందుకు అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సీ పోటీ పడుతున్నాడు. ఈ స్టార్ ఫుట్ బాలర్ ఈ అత్యుత్తమ అవార్డును ఇప్పటికే 7 సార్లు అందుకున్నాడు. మరోసారి ఈ అవార్డు గెలిచేందుకు అత్యధిక అవకాశాలతో ముందు వరుసలో నిలిచి ఉన్నాడు. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఫుట్ బాల్ ప్రపంచకప్ ను అర్జెంటీనా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ చరిత్రాత్మక కప్ ను అర్జెంటీనాకు సాధించి పెట్టి లియోనల్ మెస్సీ తిరుగులేని ఫామ్ లో ఉన్నాడు. అత్యుత్తమ ఫుట్‌బాల్ క్రీడాకారుడి అవార్డు (బాలోన్‌డోర్)- 2022 అవార్డు రేసులో ఉన్న 30 మంది ఆటగాళ్ల జాబితాను గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో లేకపోవడం గమనార్హం. 5 సార్లు బాలోన్‌డోర్ అవార్డు అందుకున్న రొనాల్డో.. 2003 తర్వాత ఈ అవార్డుకు నామినేట్ కాకపోవడం ఇదే తొలిసారి. 


గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ లో ఈ స్టార్ క్రీడాకారుడు సరైన ప్రదర్శన చేయకపోవడం, సౌదీలోని అల్ నాసర్ క్లబ్ కు మారి తక్కువ మ్యాచ్ లే ఆడటం లాంటి అంశాల వల్ల క్రిస్టియానో రొనాల్డో బాలోన్‌డోర్‌ అవార్డుకు నామినేట్ కాలేకపోయాడు. ఈ అవార్డుకు నామినేట్ అయిన వారిలో లియోనల్ మెస్సీతో పాటు ఫ్రాన్స్ స్టార్ కైల్ ఎంబాపె, నార్వే ప్లేయర్ ఎర్లింగ్ హాలాండ్, ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ కేన్, ఫ్రాన్స్ ప్లేయర్ కరీమ్ బెంజిమా ఉన్నారు. మహిళల అవార్డు కోసం స్పెయిన్ క్రీడాకారిణి ఐటానా బొన్‌మాటి రేసులో ముందున్నారు. గత నెలలో ప్రపంచ కప్ గెలిచిన స్పెయిన్ జట్టుకు ఐటానా బొన్‌మాటి కెప్టెన్ గా వ్యవహరించారు. అక్టోబర్ 30వ తేదీన విజేతలను ప్రకటించనున్నారు. 1956 నుంచి పురుషుల్లో ఈ అవార్డును అందజేస్తున్న ఫ్రాన్స్ ఫుట్‌బాల్‌ మ్యాగజైన్.. 2018 నుంచి మహిళా క్రీడాకారులకు కూడా అందజేస్తోంది.


బాలన్‌ డోర్‌ అవార్డు


బాలన్‌డోర్ అనేది ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్ మ్యాగజైన్. 1956 నుంచి ప్రతి సంవత్సరం పురుషుల కేటగిరీలో ఈ అవార్డును ఇస్తూ వస్తోంది. మహిళల కేటగిరీలో 2018 నుంచి ఈ అవార్డు ఇస్తున్నారు. 2020లో మాత్రం కరోనా కారణంగా బాలన్‌ డోర్‌ అవార్డు ఇవ్వలేదు. బాలోన్‌డోర్ 2022 అవార్డు కోసం పోటీ పడుతున్న క్రీడాకారుల్లో అత్యధిక నామినేషన్స్ మాంచెస్టర్ సిటీ క్లబ్ నుంచే వచ్చాయి. ఏడుగురు ప్లేయర్స్ బాలోన్‌డోర్‌ అవార్డు కోసం నామినేట్ అయ్యారు. 


బాలోన్‌ డోర్ అవార్డు కోసం నామినేట్ అయిన క్రీడాకారులు



  • ఆండ్రే ఓనానా 

  • జోస్కో గ్వార్డియోల్ 

  • కరీమ్ బెంజెమా 

  • జమాల్ ముసియాలా 

  • మొహమ్మద్ సలా 

  • జూడ్ బెల్లింగ్‌హామ్ 

  • బుకాయో సాకా 

  • రాండల్ కోలో మువానీ 

  • కెవిన్ డి బ్రుయ్నే 

  • బెర్నార్డో సిల్వా 

  • ఎమిలియానో ​​మార్టినెజ్ 

  • ఖ్విచా క్వారత్స్ఖెలియా 

  • రూబెన్ డయాస్ 

  • నికోలో బారెల్లా 

  • ఎర్లింగ్ హాలాండ్ 

  • యాస్సిన్ బౌనౌ 

  • మార్టిన్ ఒడెగార్డ్ 

  • జూలియన్ అల్వారెజ్ 

  • ఇల్కే గుండోగన్ 

  • వినిసియస్ జూనియర్ 

  • లియోనెల్ మెస్సీ 

  • రోడ్రి 

  • లౌటరో మార్టినెజ్ 

  • ఆంటోయిన్ గ్రీజ్‌మాన్ 

  • రాబర్ట్ లెవాండోస్కీ 

  • కైలియన్ ఎంబాపే

  • కిమ్ మిన్-జే - 

  • విక్టర్ ఒసిమ్హెన్ 

  • లూకా మోడ్రిక్ 

  • హ్యారీ కేన్