యావత్తు భారతవని గర్వించేటట్లు చేసిన టోక్యో ఒలింపిక్ స్వర్ణపతక విజేత, జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా గురించే ఇప్పుడు చర్చ అంతా. అతని గురించే గూగుల్‌లో తెగ వెతికేస్తున్నారు. అతనికి ఏం ఫుడ్ అంటే ఇష్టమని అభిమానులు తెగ సెర్చ్ చేసేస్తున్నారు.
ఇంతకీ నీరజ్ చోప్రాకి ఏ ఫుడ్ అంటే ఇష్టమో తెలుసా? బ్రెడ్ ఆమ్లెట్, పానీ పూరీ అంటే నీరజ్ చోప్రాకి చాలా ఇష్టమట. అంతేకాదు నీరజ్ చోప్రాకి స్వీట్లు అంటే ప్రాణం. ఒలింపిక్స్ పోటీలు ముగియగానే స్వీట్లు లాగించేస్తానని ఇది వరకే చెప్పాడు. ఒలింపిక్స్ కి వెళ్లేముందు నిర్వహించిన మీడియా సమావేశంలో నీరజ్ తనకు ఇష్టమైన ఫుడ్ గురించి షేర్ చేసుకున్నాడు. బ్రెడ్ ఆమ్లెట్ తినడం అంటే ఎంతో ఇష్టమని, రోజులో ఎప్పుడైనా, రోజూ అయినా సరే బ్రెడ్ ఆమ్లెట్ లాగించేస్తానని చెప్పాడు.
ఫిట్‌నెస్ కోసం తనకు తాను సాల్టెడ్ రైస్ వండుకుంటాట. టోర్నమెంట్లు ఉన్న సమయాల్లో సలాడ్లు, పండ్లు తింటాడు. ప్రాక్టీస్ చేసేప్పుడు మాత్రం పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటాడు. ఏ దేశంలో పోటీలకు హాజరైతే.. ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ అక్కడ దొరికే ఫుడ్‌తో సరిపెట్టుకుంటాడు. ఇటీవల తన డైట్‌లో సాల్మన్ ఫిష్‌ని యాడ్ చేసుకున్నాడట. అంతేకాదండోయ్ గోల్ గప్పాలు అదేనండీ పానీ పూరీ తినడం అంటే అమితమైన ఇష్టమంట. గోల్ గప్పాలో ఎక్కువగా నీరే ఉంటుందని, దీని వల్ల క్రీడాకారులకు ఎలాంటి హానీ ఉండదని చెప్పాడు.
నీరజ్ చోప్రాకి ప్రధాని మోదీ ఫోన్
టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రాకి ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
పంజాబ్ సీఎం రూ.2కోట్ల నజరానా
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన నీరజ్ చోప్రాకి పంజాబ్ ప్రభుత్వం రూ.2కోట్ల నజరానా ప్రకటించింది. దేశం గర్వించేలా చేసిన సైనికుడు నీరజ్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ, రూ.2కోట్ల నజరానా ప్రకటిస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు.