Mike Tyson vs Jake Paul Live Updates | బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ 19 ఏళ్ల తరువాత బాక్సింగ్ ఫైట్ కు దిగితే నిరాశే ఎదురైంది. అమెరికాకు చెందిన యువ బాక్సర్ జేక్ పాల్ చేతిలో మైక్ టైసన్ 78-74 తేడాతో ఓటమి చెందాడు. టెక్సాస్ లోని ఆర్లింగ్టన్‌లోని ఏటీ&టీ స్టేడియంలో నవంబర్ 16న ఈ బాక్సింగ్ మ్యాచ్ నిర్వహించారు.


తొలి రెండు రౌండ్లలో వెటరన్ బాక్సర్ మైక్ టైసన్ తన పంచ్ పవర్ చూపించాడు. తొలి 2 రౌండ్లలో 27 ఏళ్ల యువ బాక్సర్ జేక్ పాల్ పై టైసన్ ఆధిపత్యం చెలాయించాడు. కానీ మూడో రౌండ్ నుంచి జేక్ పాల్ తన అత్యుత్తమ బాక్సింగ్ బయటకు తీశాడు. ప్రత్యర్థి వయసు మళ్లిన మైక్ టైసన్ కావడంతో ఆచితూచి పంచుల వర్షం కురిపించాడు.  58 ఏళ్ల వయసులో బాక్సింగ్ రింగ్ లోకి దిగుతున్నాడంటే ప్రాణాలపై ఆశలు లేవా అన్న వారే టైసన్ గేమ్ చూసి ఫిదా అవుతున్నారు. కానీ వయసు పెద్దది కావడం, మరోవైపు తన కంటే వయసులో సగం కూడా యువకుడితో బాక్సింగ్ అంటే అంత ఈజీ కాదు. ఆకట్టుకునేలా ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టినా 3 నుంచి 8 రౌండ్ల వరకు జేక్ పాల్ ఆధిక్యం ప్రదర్శించి 78-74 పాయింట్ల తేడాతో మైక్ టైసన్ పై విజేతగా నిలిచాడు. మ్యాచ్ గెలిచిన వెంటనే బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కు గౌరవపూర్వకంగా తల వంచాడు జేక్ పాల్.


ప్రైజ్ మనీ ఎంతంటే..


అమెరికా యూట్యూబర్ బాక్సర్ జేక్ పాల్ కు 40 మిలియన్ అమెరికా డాలర్లు ప్రైజ్ మనీగా లభించింది. ఒకవేళ టైసన్ కనుక ఈ బౌట్ లో విజయం సాధిస్తే 20 మిలియన్ అమెరికన్ డాలర్లు వెటరన్ బాక్సర్ సొంతమయ్యేవి. అయితే మైక్ టైసన్ డబ్బు కోసమే బాక్సింగ్ రింగ్ లోకి దిగారన్న వాదనను టైసన్ కొట్టిపారేశాడు. తన ఇష్టంతో, మెదడులో కలిగిన ఆలోచనతో రెండు దశాబ్దాల తరువాత బాక్సింగ్ రింగ్ లోకి దిగినట్లు తెలిపాడు.



హెవీవెయిట్ అత్యుత్తమ బాక్సర్లలో అమెరికా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ ఒకడు. 1987 నుంచి 1990 వరకు వరల్డ్ హెవీవెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ టైసన్. సింహబలుడుగా పేరు తెచ్చుకున్న మైక్ టైసన్ 58 సంవత్సరాల వయస్సులో బాక్సింగ్ రింగ్ లోకి దిగాడు. అమెరికాకే చెందిన ప్రత్యర్థి, 27 ఏళ్ల బాక్సర్ జేక్ పాల్ రికార్డు 10-1గా ఉన్న‌ది. యూట్యూబర్ ప్రొఫెషనల్ బాక్సర్ గా మారి అద్భుతాలు చేస్తున్నాడు జేక్ పాల్. తాను తలపడిన 11 బాక్సింగ్ బౌట్లలో 10 నెగ్గిన జేక్ పాల్ ఓ మ్యాచ్‌లో ఓటమిపాలయ్యాడు. తాజా విజయాన్ని లెక్కించగా టైసన్ 59 బౌట్లలో 50 మ్యాచ్‌లు నెగ్గి, ఏడింట్లో ఓడిపోగా, రెండు డ్రా చేసుకున్నాడు. జేక్ పాట్ ఓవరాల్ గా 12 బాక్సింగ్ మ్యాచ్ లలో 11 విజయాలు, ఒక్క ఓటమి ఉన్నాయి.


మైక్ టైసన్ బరువు 103.6 కిలోలు కాగా, జేక్‌ పాల్‌ బరువు 102.9 కిలోలు అని శుక్రవారం బాక్సింగ్ మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు వెయిట్ చేశారు. టైసన్ కెరీర్‌లో 44 నాకౌట్‌ విజయాలు ఉండగా, జేక్ పాల్ గెలిచిన పది మ్యాచ్ లలో ఏడు నాకౌట్ విజయాలు ఉన్నాయి. 


 






టైసన్ మ్యాచ్‌ల రికార్డులు..
అమెరికా దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ హెవీవెయిట్ అత్యుత్తమ బాక్సర్లలో ఒకడు. 1987 నుంచి 1990 వరకు వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ గా టైసన్ నిలిచాడు. మొత్తం 59 ప్రొఫెషనల్ బాక్సింగ్ బౌట్లలో తలపడిన సింహబలుడు మైక్ టైసన్ 50 మ్యాచ్‌లలో విజయం సాధించగా, 7 ఓడిపోగా, మరో 2 బాక్సింగ్ బౌట్స్ డ్రా అయ్యాయి.


జేక్ పాల్ సూప‌ర్‌ రికార్డు
జేక్ పాల్ రికార్డు సూప‌ర్‌గా ఉంది. 2018 నుంచి రింగ్‌లో  అత‌ని రికార్డు 11-1గా ఉన్న‌ది. గ‌త ఏడాది 2023లో ముగ్గురిపై జేక్ పాల్ ఈజీగా విక్ట‌రీ సాధించగా, తొలి రౌండ్ల‌లోనే ప్ర‌త్య‌ర్థుల‌ను మ‌ట్టిక‌రిపించాడు. 7 నాకౌట్‌ విజయాలు ఉండటం విశేషం. తాజాగా టైసన్ ను ఓడించి దిగ్గజాన్ని ఓడించిన ఆరవ బాక్సర్ గా నిలిచాడు జేక్ పాల్.  గతంలో మైక్ టైసన్ పై జేమ్స్ డగ్లస్, ఈవాండర్ హోలీఫీల్డ్, లెనాక్స్ లూయిస్, డానీ విలియమ్స్, కెవిన్ బెక్ బ్రైడ్ లు మాత్రమే విజయం సాధించగా.. తాజాగా ఈ జాబితాలో జేక్ పాల్ చేరాడు. కానీ ఈ వయసులో టైసన్ ను యువ బాక్సర్ ఓడించడం ఈజీ అని తెలిసిందే.