LLC 2023: లెజెండ్స్ లీగ్ క్రికెట్ గ్లోబల్ టోర్నమెంట్ ఖతార్‌లో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు జరగనుంది. ఈ టోర్నీ నిర్వాహకులు అభిమానులకు మరో శుభవార్త చెప్పారు. లెజెండ్స్ లీగ్ లేటెస్ట్ ఎడిషన్‌లో మరికొందరు స్టార్ వెటరన్ ప్లేయర్లు చేరనున్నారు. ప్రస్తుతానికి షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్, శ్రీశాంత్ వంటి అనుభవజ్ఞులు ఈ టోర్నీలో ఉన్నారు. ఇప్పుడు క్రిస్ గేల్‌తో సహా మరో ఐదుగురు అనుభవజ్ఞులు లీగ్‌లో ఆడటం గురించి టోర్నీ నిర్వాహకులు మాట్లాడారు.


ఈ టోర్నమెంట్‌ను ఎల్ఎల్‌సీ మాస్టర్స్ అని పిలవనున్నారు. ఇందులో మూడు జట్లు పాల్గొంటున్నారు. మొదటి జట్టు ఇండియా మహరాజాస్, కాగా ఆసియా లయన్స్, వరల్డ్ జెయింట్స్ జట్లు కూడా పోటీ పడనున్నాయి. మూడు జట్లలో కలిపి క్రిస్ గేల్, ఇయాన్ మోర్గాన్, గౌతం గంభీర్, హర్భజన్, షేన్ వాట్సన్, ఇర్పాన్ పఠాన్ వంటి 60 మంది టాప్ వెటరన్ ప్లేయర్స్ ఉన్నారు.


దక్షిణాఫ్రికా విధ్వంసక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌తో పాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీలంకకు చెందిన దిల్హారా ఫెర్నాండెజ్, ఇంగ్లండ్‌కు చెందిన మాంటీ పనేసర్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అస్గర్ ఆఫ్ఘన్ లీగ్‌లో ఆడటం ఖాయమన్నారు.


దోహాలో క్రికెట్ పండుగ
లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సీఈవో రామన్ రహేజా మాట్లాడుతూ ‘గతంలో ఖతార్ ఫిఫా ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిందని, ఇప్పుడు దోహాలో క్రికెట్ పండుగను జరుపుకోనున్నట్లు తెలిపారు. లెజెండ్స్ లీగ్ రాబోయే సీజన్‌ను ప్రపంచవ్యాప్తంగా, అద్భుతమైనదిగా రూపొందించడానికి మేం నిరంతరం కృషి చేస్తున్నామని అతను చెప్పాడు. లీగ్‌లో పెద్ద ఆటగాళ్లను బరిలోకి దింపాలనేదే మా ప్రయత్నం. అలాగే, క్రికెట్‌ను ప్రోత్సహించడానికి మనం ఏమి చేయవచ్చో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.’ అన్నారు


ఈ పెద్ద దిగ్గజాలు లీగ్‌లో భాగం కానున్నారు
క్రిస్ గేల్‌తో పాటు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, శ్రీలంకకు చెందిన దిల్హారా ఫెర్నాండెజ్, ఇంగ్లండ్‌కు చెందిన మాంటీ పనేసర్, ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన అస్గర్ ఆఫ్ఘన్ ఈ టోర్నీలో ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నామని చెప్పారు. గత సీజన్‌ భారత్‌లో జరిగిందని క్రిస్ గేల్ తెలిపాడు. ఆ సమయంలో అభిమానుల అత్యుత్సాహం చూస్తుంటే సరదాగా అనిపించిందన్నాడు. ఇప్పుడు దోహా వంతు వచ్చింది, లీగ్‌ అనుభవం అద్భుతంగా ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ అన్నాడు. ఈ లీగ్‌లో లెజెండ్స్‌తో ఆడడం చాలా సరదాగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు..


ఇటీవల, పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్ మాత్రమే కాకుండా, శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్, భారతదేశానికి చెందిన రాబిన్ ఉతప్ప, వెస్టిండీస్‌కు చెందిన లెండిల్ సిమన్స్ , శ్రీశాంత్ ప్లేయర్లు లెజెండ్స్ లీగ్ లేటెస్ట్ సీజన్‌లో ఆడుతున్నట్లు ధృవీకరించారు.


భారత్‌లో 2022లో జరిగిన లెజెండ్స్ లీగ్ సీజన్‌లో గౌతం గంభీర్ సారథ్యంలోని ఇండియా క్యాపిటల్స్ జట్టు ఛాంపియన్స్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో ఇర్ఫాన్ పఠాన్ నాయకత్వంలోని బిల్వారా కింగ్స్‌పై ఇండియా క్యాపిటల్స్ 104 పరుగులతో విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది.