Kohli Stunning Six: భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియా 317 పరుగులతో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ తన వన్డే కెరీర్‌లో 46వ సెంచరీని నమోదు చేశాడు.


తిరువనంతపురంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లి 166 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో మొత్తం 13 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు ఉన్నాయి. అతని స్ట్రైక్ రేట్ 150.91గా ఉంది. 44వ ఓవర్లో విరాట్ కొట్టిన సిక్సర్ ఇప్పుడు వైరల్‌గా మారింది.


అద్భుతమైన షాట్, వీడియో వైరల్
సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అతను ఈ అద్భుతమైన షాట్ చేశాడు. ఇన్నింగ్స్ 44వ ఓవర్లో అతని బ్యాట్ నుంచి ఈ షాట్ వెళ్లింది. ఆ సమయంలో కసున్ రజిత తన స్పెల్ 8వ ఓవర్ వేస్తున్నాడు. ఆ ఓవర్‌లో ఇది మూడో బంతి.


ఈ షాట్ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ షాట్ కోసం విరాట్ క్రీజు నుంచి ముందుకెళ్లాడు. బంతి దూరంగా వెళ్లడం చూసి, లాంగ్ ఆన్‌లో బ్యాట్‌ని బలంగా స్వింగ్ చేయడంతో బంతి అతని బ్యాట్‌కు తగిలి 97 మీటర్ల దూరంలో పడినట్లు ఈ వీడియోలో చూడవచ్చు.


మహేంద్ర సింగ్ ధోని హెలికాప్టర్ షాట్‌ను ఇది తలపించింది. అయితే ఇది అలాంటి షాట్ కాదు. హెలికాఫ్టర్ షాట్‌ను గుర్తు చేసేలా విరాట్ కోహ్లీ రెండు షాట్లు కొట్టాడు. అతను 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఈ షాట్ ఆడాడు. ఈ షాట్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.


ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా
శ్రీలంకతో జరిగిన ఈ మూడు వన్డేల సిరీస్‌లో కింగ్ కోహ్లీ 'ప్లేయర్ ఆఫ్ ద సిరీస్'గా ఎంపికయ్యాడు. దీంతో పాటు మూడో మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా కూడా ఎంపికయ్యాడు. గౌహతిలో జరిగిన తొలి వన్డేలో 113 పరుగుల ఇన్నింగ్స్‌ను కూడా సాధించాడు. ఆ మ్యాచ్‌లోనూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.