అందరికీ షాకిస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 కెప్టెన్సీని వదిలేస్తున్నట్లు ప్రకటించారు. టీ20ల్లో కెప్టెన్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటింగ్ మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు. ముఖ్యంగా టీ20ల్లో ప్రధానంగా చూసే స్ట్రైక్ రేట్ అయితే మరింత మెరుగుపడింది. కెప్టెన్ కాకముందు 135.48 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసిన విరాట్.. కెప్టెన్‌గా ఉన్నప్పుడు 143.18 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. SENA(సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల గెలుపుతో అక్కడ కూడా దేశం మీసం తిప్పాడు.

ఒక్కసారి టీ20ల్లో కోహ్లీ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. 

1. మొత్తం 45 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా.. అందులో 27 విజయాలు, 14 ఓటములు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. కోహ్లీ విజయాల శాతం 65.11గా ఉంది.

2.అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 1502 పరుగులు సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ కోహ్లీనే.

3. టీ20ల్లో భారత జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల జాబితాలో కోహ్లి రెండో స్థానంలో ఉన్నాడు. మహేంద్ర సింగ్ ధోని 42 విజయాలతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు.

4. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా 1000 పరుగులు చేసిన వేగవంతమైన ఆటగాడు కోహ్లీనే. 30 ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఈ ఘనత సాధించడం విశేషం.

5. SENA(సౌత్ ఆఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు గెలిచిన మొదటి/ఏకైన భారతీయ కెప్టెన్ కోహ్లీనే. 2020లో న్యూజిలాండ్‌ను 5-0తో, ఆస్ట్రేలియాను 2-1తో, 2018లో ఇంగ్లండ్‌ను 2-1తో, దక్షిణాఫ్రికాను 2-1తో ఆయాదేశాల్లోనే ఓడించి రికార్డు సృష్టించాడు.

6. మొత్తం 27 విజయాలతో ప్రపంచంలో అత్యధిక అంతర్జాతీయ టీ20 విజయాలు సాధించిన కెప్టెన్లలో నాలుగో స్థానంలో విరాట్ ఉన్నాడు. ఈ జాబితాలో అస్గర్ ఆఫ్ఘన్(ఆఫ్ఘనిస్తాన్) మొదటిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని, మూడో స్థానంలో ఇయాన్ మోర్గాన్(ఇంగ్లండ్) ఉన్నారు.

విరాట్ కోహ్లి వ్యక్తిగత బ్యాటింగ్ రికార్డులు(కెప్టెన్‌గా)ఆడిన మ్యాచ్‌లు: 45ఇన్నింగ్స్: 43నాటౌట్లు: 12పరుగులు: 1502అత్యధిక స్కోరు: 94 నాటౌట్సగటు: 48.45ఎదుర్కొన్న బంతులు: 1049స్ట్రైక్ రేట్: 143.18100లు: 050లు: 124లు: 1096లు: 58

విరాట్ కోహ్లి వ్యక్తిగత బ్యాటింగ్ రికార్డులు(కెప్టెన్ కాకముందు)ఆడిన మ్యాచ్‌లు: 45ఇన్నింగ్స్: 41నాటౌట్లు: 12పరుగులు: 1657అత్యధిక స్కోరు: 90 నాటౌట్సగటు: 57.13ఎదుర్కొన్న బంతులు: 1223స్ట్రైక్ రేట్: 135.48100లు: 050లు: 164లు: 1766లు: 32

Also Read: Kohli Leaves T20 Captaincy: షాక్‌.. షాక్‌.. షాక్‌! టీ20 కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్‌ కోహ్లీ