Year Ender 2022: ఈ ఏడాది (2022) ముగింపుకు వచ్చేసింది. ఏటా మాదిరిగానే ఈ ఏడాది ఆయా క్రీడల్లో కొంతమంది ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. మరెందరో క్రీడాకారులు వెలుగులోకి వచ్చారు. 2022లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లోనూ ఎంతోమంది మంచి ప్రదర్శన చేశారు. ఈ ఏడాది టైటిల్ ను కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంది. హార్దిక్ పాండ్య నేతృత్వంలోని గుజరాత్ అరంగేట్రంలోనే అదరగొట్టి కప్పును అందుకుంది. ఐపీఎల్ అంటేనే ధనాధన్ బౌండరీలు, కళ్లు చెదిరి సిక్సులు ఉంటాయి. మరి ఈ ఏడాది ఈ టోర్నీలో అత్యధిక సిక్సులు కొట్టిన టాప్- 5 ఆటగాళ్లు ఎవరో తెలుసుకుందామా...


జోస్ బట్లర్... ఈ ఇంగ్లండ్ ఆటగాడు ఈ ఏడాది మంచి ఫాంలో ఉన్నాడు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహించిన బట్లర్ చెలరేగి ఆడాడు. 2022 ఐపీఎల్ లో 4 సెంచరీలు, 4 అర్ధసెంచరీలతో 863 పరుగులు చేశాడు. ఈ ఏడాది అవే అత్యధిక పరుగులు. ఈ ప్రదర్శనకు బట్లర్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. అలాగే అత్యధిక సిక్సుల రికార్డు ఈ ఆటగాడి పేరు మీదే ఉంది. ఈ సంవత్సరం ఐపీఎల్ లో 17 మ్యాచులు ఆడిన జోస్ బట్లర్ మొత్తం 45 సిక్సులు కొట్టాడు. తన అద్భుత ప్రదర్శనతో జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే ఫైనల్ లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్ రన్నరప్ తో సరిపెట్టుకుంది.


జోస్ బట్లర్ అంతర్జాతీయ కెరీర్ లోనూ ఈ ఏడాది బెస్ట్ ఫెర్మార్ మెన్స్ ఇచ్చాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నకు కెప్టెన్ గా వ్యవహరించిన బట్లర్.. తన జట్టుకు కప్పును అందించాడు. 







ఐపీఎల్ 2022 ఎక్కువ సిక్సులు కొట్టిన టాప్- 5 బ్యాటర్లు


           ఆటగాడు                             మ్యాచులు        సిక్సులు



  1. జోస్ బట్లర్                                 17                     45

  2. లియామ్ లివింగ్ స్టోన్                14                     34 

  3. ఆండ్రీ రస్సెల్                           14                     32

  4. కేఎల్ రాహుల్                            15                     30

  5. సంజూ శాంసన్                          17                     26