RCB Coach On Siraj: గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ సందర్భంగా గాయపడిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ప్రస్తుత తన పరిస్థితిని గురించి ఆర్సీబీ కోచ్ ఆండీ ఫ్ల‌వ‌ర్ వివ‌రించాడు. విరాట్ కి అయిన వేలి గాయం పెద్ద‌దేమీ కాద‌ని, ప్ర‌స్తుతం తాను ఫైన్ గానే ఉన్నాడ‌ని వ్యాఖ్యానించాడు. ఇక చిన్న‌స్వామి స్టేడియంలో జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌క 169 ప‌రుగులు చేసింది. ఆల్ రౌండ‌ర్ లియామ్ లివింగ్ స్ట‌న్ (40 బంతుల్లో 54, 1 ఫోర్, 5 సిక్స‌ర్లు) టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. అనంత‌రం గుజరాత్ ఛేద‌న‌ను 17.5 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 170 ప‌రుగులు చేసి, పూర్తి చేసింది. బ్యాట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ (39 బంతుల్లో 73 నాటౌట్, 5 ఫోర్లు, 6 సిక్సర్లు) విధ్వంస‌క ఫిఫ్టీతో చెల‌రేగాడు. తాజా విజ‌యంతో గుజ‌రాత్ పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్-4కి  ఎగ‌బాకింది. 

సిరాజ్ ను రిటైన్ చేసుకోనందుకు బాధ లేదు..నిజానికి ఆర్సీబీ త‌ర‌పునే సిరాజ్ కు గుర్తింపు వ‌చ్చింది. ఐపీఎల్లో ఆడిన త‌ర‌వాత కోహ్లీ ప్రోత్సాహంతో జాతీయ జ‌ట్టు వ‌ర‌కు చేరుకున్నాడు. ఇక గ‌తేదాడి వేలంలో సిరాజ్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. దీంతో గుజ‌రాత్ టైటాన్స్ త‌న‌ను వేలంలో ద‌క్కించుకుంది. ఇక బెంగ‌ళూరులో ఆడిన అనుభ‌వం ఉన్న సిరాజ్.. ప‌రిస్థితుల‌ను బాగా ఉప‌యోగించుకుని మూడు వికెట్లు సాధించాడు. దీంతో గుజ‌రాత్ ఈ మ్యాచ్ లో పై చేయి సాధించింది. సిరాజ్ ను రిటైన్ చేసుకోనందుకు బాధేమీ లేద‌ని, ప్ర‌స్తుత‌మున్న బౌలింగ్ లైన‌ప్ తో హేపీగానే ఉన్నామ‌ని ఫ్ల‌వ‌ర్ తెలిపాడు. 

అక్క‌డే బ్యాక్ ఫైర‌యింది.. ప‌వ‌ర్ ప్లేలో దూకుడుగా ఆడ‌బోయి, ఆర్సీబీ బొక్కాబోర్లా ప‌డింది. వేగంగా ప‌రుగులు సాధించాల‌ని చూసి, నాలుగు వికెట్ల‌న ప‌వ‌ర్ ప్లేలో కోల్పోయామని, అదే దెబ్బ‌కొచ్చింద‌ని ఫ్ల‌వ‌ర్ తెలిపాడు. ఇక జీటీ మాత్రం.. ఛేద‌న‌లో నింపాదిగా ఆడి, వికెట్ల‌ను కాపాడుకుని, చివ‌ర్లో విజృంభించింద‌ని ప్ర‌శంసించాడు. ఇక ఈ మ్యాచ్ లో ఫ‌లితం ద్వారా టోర్నీలో ఆర్సీబీ తొలి ప‌రాజ‌యాన్ని ఎదుర్కొంది. మ‌రోవైపు జీటీ మాత్రం రెండో విజ‌యాన్ని సాధించింది.  ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే తాజా ఫలితంతో ఆర్సీబీ టాప్ ప్లేస్ నుంచి మూడో స్థానానికి దిగజారింది. గుజారత్ టైటాన్స్ నాలుగో ప్లేస్ ను దక్కించుకుంది. ఇక గురువారం మాజీ చాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్, డిఫెండింగ్ చాంపియన్స్ కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడుుతుది. గతేడాది ఆడిన మూడు మ్యాచ్ ల్లో కోల్ కతానే నెగ్గింది.  లీగ్ మ్యాచ్ లో నాలుగు పరుగులతో నెగ్గిన కేకేఆర్.. ఆ తర్వాత జరిగిన క్వాలిఫయర్ 1, ఫైనల్లో ఎనిమిదేసి వికెట్లతో విజయం సాధించింది. దీంతో ఈ సారి కేకేఆర్ పై విజయం సాధించాలని సన్ పట్టుదలగా ఉంది.