Virat Kohli Vs BCCI: దిగ్గజ క్రికెటర్లు విరాట కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడం వెనకాల చాలా పెద్ద కథే నడిచిందని తాజాగా కొన్ని కథనాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా కోహ్లీ సడెన్ రిటైర్మెంట్ నిర్ణయం వెనకాల ఒక ఉద్దేశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రిటైర్మెంట్ కు దగ్గర పడిన స్థితిలో జట్టు సంధి కాలంలో కెప్టెన్ గా ఉండాలని కోహ్లీ భావించాడని తెలుస్తోంది. అందుకే ఇంగ్లాండ్ పర్యటనకు తనను సారథిగా ఎంపిక చేయాలని బోర్డును కోరాడని సమాచారం. అయితే ఈ నిర్ణయాన్ని బోర్డు సున్నితంగా తిరస్కరించి, యువ ఆటగాడికి ఇవ్వనున్నామని చెప్పడంతో కోహ్లీ ఇలా సడెన్ గా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు గత రెండేళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కోహ్లీ.. తన వీడ్కోలు సిరీస్ లాగా ఇంగ్లాండ్ సిరీస్ ఆడాలని, అందులో సత్తా చాటి, తనకెంతో ఇష్టమైన రెడ్ బాల్ ఫార్మాట్ కు టాటా చెప్పాలని భావించినట్లు తెలుస్తోంది.
మాజీ కోచ్ తో మంతనాలు..బీసీసీఐ నిర్ణయంతో అసంతృప్తికి లోనయిన కోహ్లీ.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రితో పంచుకున్నాడని సమచారం. అలాగే తన డియరెస్ట్ ఫ్రెండ్ తోపాటు బోర్డులోనే చాలా ఇన్ల్పూయెన్స్ ఉన్న రాజీవ్ శుక్లాతో పలు దఫాలుగా ఈ నిర్ణయంపై చర్చలు జరిగాయని తెలుస్తోంది. అయితే ఇవేమీ కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని మార్చలేక పోయాయని, దీంతో ఆటకు అల్విదా పలికినట్లు సమాచారం. అలాగే నిర్ణయాన్ని ప్రకటించేముందు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తోనూ రెండుసార్లు మాట్లాడాడని, ఐపీఎల్ కు స్మాల్ బ్రేక్ రావడంతో, ఈ చర్చలు ముమ్మరంగా సాగినట్లు తెలుస్తోంది.
మునుపటి లాగా లేకనే..గతంలో ఉన్నట్లుగా డ్రెస్సింగ్ రూం.. ప్రస్తుతం లేదని, తనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదని కోహ్లీ కంప్లయింట్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే మునుపటిలాగా సీనియర్లకు ఉన్న సౌకర్యాలు కరువైనట్లు తెలుస్తోంది. ఈ విషయమై బోర్డు పెద్దలతో మాట్లాడినా పెద్దగా ఫలితం లేదని సమాచారం. నిజానికి ఇంగ్లాండ్ టూర్ తర్వాత రోహిత్, కోహ్లీ రెడ్ బాల్ కు దూరమవ్వాలని భావించారని, అయితే పరిస్థితులు అనుకూలించక అంతకుముందు గానే అల్విదా చెప్పినట్లు తెలుస్తోంది. ఇక రెడ్ బాల్ క్రికెట్లో పది వేల పరుగులను సాధించాలని కోహ్లీ ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఆ కోరిక తీరకుండానే తను టెస్టు ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. అలాగే కేవలం వన్డేలకే పరిమితమవడంతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అంతర్ జాతీయ వంద సెంచరీల రికార్డును కూడా విరాట్ కోహ్లీ చేరే అవకాశం లేదని తెలుస్తోంది.