Virat vs Gambhir, IPL 2023: 



విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన మాటల యుద్ధం క్రికెట్ ప్రపంచంలో ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వచ్చి చేరారు...... ఇండియా టీవీ ఛైర్మన్, ఎడిటర్ ఇన్ చీఫ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రజత్ శర్మ. 




విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్ మధ్య జరిగిన మాటల యుద్ధం క్రికెట్ ప్రపంచంలో ఇంకా ప్రకంపనలు రేపుతూనే ఉంది. చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వచ్చి చేరారు...... ఇండియా టీవీ ఛైర్మన్, ఎడిటర్ ఇన్ చీఫ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రజత్ శర్మ. ఇండియా టీవీలో జరిగిన ఓ న్యూస్ షోలో మాట్లాడిన రజత్.... గంభీర్ పై తీవ్ర ఆరోపణలు చేశాడు. విరాట్ కు జనాల్లో ఉన్న అభిమానంపై, అతని విజయాలపై గంభీర్ కు అసూయ ఉందని, అది మొన్న మ్యాచ్ లో మళ్లీ తెలిసిందన్నాడు. గౌతం గంభీర్ చేసింది.... స్పిరిట్ ఆఫ్ క్రికెట్ కు వ్యతిరేకమని, ఓ మాజీ క్రికెటర్ , ప్రస్తుత ఎంపీ ఇలా చేయడం సరికాదన్నాడు. అయితే ఈ న్యూస్ టెలికాస్ట్ అయిన కాసేపటికే గంభీర్ ట్వీట్ ద్వారా రియాక్ట్ అయ్యాడు. ప్రెషర్ అనే కారణం చెప్తూ దిల్లీ క్రికెట్ వదిలేసి పారిపోయిన వ్యక్తి.... పెయిడ్ పీఆర్, పెయిడ్ వార్తలను క్రికెట్ పై అభిమానం పేరిట వ్యాప్తి చేస్తున్నారని గంభీర్ మండిపడ్డాడు. ఈ కలియుగంలో పారిపోయిన వాళ్లే కోర్టులు నడిపిస్తారని గంభీర్ సెటైర్ వేశాడు. ఇందులో చాలా విషయాలను గంభీర్ కవర్ చేశాడు. రజత్ శర్మ.... అప్పట్లో దిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశాడు. కానీ నెల తిరిగేసరికి ప్రెషర్ తట్టుకోలేనని చెప్తూ రాజీనామా చేశాడు. అందుకే పారిపోయిన వ్యక్తిగా గంభీర్ వర్ణించాడు. ఇక కోర్టులు అంటే..... ఇదే రజత్ శర్మ....ఆప్ కీ అదాలత్ పేరిట ఓ షోలో సెలెబ్రెటీలను ఇంటర్వ్యూ చేస్తాడు. కోర్టు రూంలాంటి సెట్ వేసి అందులో ఈ షో షూట్ చేస్తారు. సో రజత్ శర్మ.... గంభీర్ ను విమర్శించడం, గంభీర్ వెంటనే రియాక్ట్ అవడం ఇష్యూను మరింత హీట్ ఎక్కించింది.