Dale Steyn Prediction 17 April: ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 17 సీజన్స్ జరిగాయి. ఇప్పుడు 18వ సీజన్ నడుస్తోంది. మూడు మ్యాచ్‌లు అయ్యాయి. ఇందులోనే రెండో అత్యధిక స్కోర్ వచ్చేసింది. ఐపీఎల్ 2025 రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 286 పరుగులు చేసింది.
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చాలా జట్లు 250 కంటే ఎక్కువ పరుగులు సాధించాయి. కానీ ఎవరూ 300 మార్కును దాటలేదు. ఈ మెగా ఫీట్‌ను మాత్రం ఏప్రిల్ 17న చూడబోతున్నామని ఇప్పుడు డేల్ స్టెయిన్ అంచనా వేస్తున్నాడు. ఐపీఎల్ స్కోర్‌బోర్డుపై తొలిసారిగా 300 పరుగులు వస్తాయని చెబుతున్నాడు.
డేల్ స్టెయిన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఇలా చెప్పుకొచ్చాడు. "నా దగ్గర ఒక చిన్న ప్రెడిక్షన్ ఉంది. ఏప్రిల్ 17న, ఐపీఎల్ చరిత్రలో తొలిసారిగా 300 పరుగులు నమోదు అవుతాయి. ఎవరికి తెలుసు, మ్యాచ్ జరిగినప్పుడు నేను కూడా అక్కడ ఉండొచ్చు." సన్‌రైజర్స్ హైదరాబాద్ సీజన్‌లో దూకుడుగా ఆడటం చూసి డేల్ స్టెయిన్ ఈ స్టెట్మెంట్ ఇచ్చాడు. స్టెయిన్ స్వయంగా 2013-2015 వరకు SRH తరపున ఆడాడు.
ఏప్రిల్ 17న ఎవరితో మ్యాచ్ డేల్ స్టెయిన్ ప్రత్యేకంగా ఈ రికార్డు కోసం 17వ తేదీని ఎంచుకోవడం వెనుక కారణం ఉంది. ఆ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. గత సీజన్‌లో హైదరాబాద్, ముంబై తలపడినప్పుడు హైదరాబాద్ జట్టు 277 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై టీం 246 పరుగులు మాత్రమే చేసింది. ఆ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.
IPL చరిత్రలో అతిపెద్ద స్కోరు కూడా SRHదే. IPL 2025లో RCBపై హైదరాబాద్ 287 పరుగులు చేసింది. ఇది ఇప్పటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అతిపెద్ద స్కోరుగా మిగిలిపోయింది. అత్యధిక స్కోర్లు ఒక్కసారి చూస్తే
ఐపీఎల్ చరిత్రలో టాప్ 10 రికార్డు స్కోర్లు ఇవే1) హైదరాబాద్ 287/3 ఆర్సీబీపై 2024లో చేసింది. 2) హైదరాబాద్ 286/6 రాజస్థాన్ రాయల్స్‌పై 2025లో చేసింది. 3) హైదరాబాద్ 277/3 ముంబైపై 2024లో చేసింది. 4) కోల్‌కతా నైట్‌రైడర్స్ 272/7 ఢిల్లీ క్యాపిటల్స్‌పై 2024లో చేసింది. 5) హైదరాబాద్ 266/7 ఢిల్లీపై 2024లో చేసింది. 6) బెంగళూరు 263/5 పంజాబ్‌పై 2013లో చేసింది. 7) పంజాబ్ 262/2 కోల్‌కతాపై 2024లో చేసింది. 8) బెంగళూరు 262/7 హైదరాబాద్‌పై 2024లో చేసింది. 9) కోల్‌కతా 261/6 పంజాబ్‌పై 2024లో చేసింది. 10)ఢిల్లీ 257/4 ముంబైపై 2024లో చేసింది. లక్నో 257/5 పంజాబ్పై 2023లో చేసింది.