Ishan Kishan: ఫీల్టింగ్‌లో ఇషాన్ కిషన్‌కు గాయం!- వీడియో చూసి భయపడుతున్న హైదరాబాద్‌ ఫ్యాన్స్ 

SRH vs RR: మొదటి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ దుమ్మురేగొట్టింది. రాబోయే మ్యాచ్‌లలో తమ ప్రతాపం ఎలా ఉంటుందో శాంపిల్ చూపించింది.

Continues below advertisement

Ishan Kishan Video: ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్‌ బౌలర్ల తుక్కు రేగొట్టింది. అయితే ఈ మ్యాచ్‌కు సంబందించిన ఓ వీడియో మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ను కంగారు పెట్టిస్తోంది. ఈ మ్యాచ్‌లో సెంచరీ చేసి కదంతొక్కిన ఇషాన్ కిషన్ గాయపడి కిందపడి గిలగిల కొట్టుకుంటున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ గాయంతో ఏమైనా చేస్తుందా అని టెన్షన్ పడుతున్నారు. 

Continues below advertisement

సన్‌రైజర్స్ హైదరాబాద్ 44 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో ఇషాన్ కిషన్‌దే కీలక పాత్ర. ఇషాన్ కిషన్ 47 బంతుల్లో నాటౌట్‌గా 106 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. అయితే ఇదే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఇషాన్ కిషన్ బౌండరీ వద్ద గాయపడ్డారు. 

ఇషాన్ కిషన్ రాబోయే మ్యాచ్‌లలో ఆడతాడా?
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్‌లోని 18వ ఓవర్‌లో జరిగిందీ ఘటన. ఇషాన్ కిషన్ బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న టైంలో గాయపడ్డారు. బంతిని ఆపేందుకు యత్నించాడు. బంతి మాత్రం బౌండరీ దాటేసింది. కానీ ఇషాన్ కిషన్ నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించాడు. గాయపడిన తర్వాత, మళ్ళీ ఫీల్డింగ్ కోసం మైదానంలోకి తిరిగి రాలేదు. 

బౌండరీ ఆపేందుకు ట్రై చేసి గాయపడిన ఇషాన్ కిషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బౌండరి ఆపలేకపోయినా మోకాలికి గాయమైన సంగతి అందులో స్పష్టంగా కనిపిస్తోంది. బాధతో కుంటుతూ నడిచే వీడియోను షేర్ చేస్తూ ఏమైందని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇషాన్ కిషన్ గాయం తీవ్రం కాకూడదని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, అభిమానులు ఆశిస్తున్నారు.

రాజస్థాన్ రాయల్స్‌ను సులభంగా ఓడించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 
సన్‌రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 286 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు చేశాడు. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇచ్చిన 286 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 242 పరుగులే చేయగలిగింది. రాజస్థాన్ రాయల్స్ తరపున ధ్రువ్ జురెల్ 35 బంతుల్లో 70 పరుగులు చేశాడు. సంజు సామ్సన్ 37 బంతుల్లో 66 పరుగులు చేశాడు. హెట్‌మైర్ 23 బంతుల్లో 42 పరుగులు చేశాడు.

శనివారం ప్రారంభమైన ఐపీఎల్‌లో మొత్తం ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ముంబై ఇండియన్స్ (MI)ను ఓడించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రాజస్థాన్ రాయల్స్ (RR) ను 44 పరుగుల తేడాతో ఓడించింది. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఆర్సీబీ ఓడించింది. 

ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో పాట్ కమ్మిన్స్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ 2 పాయింట్లు, 2.200 నికర రన్ రేట్‌తో టాప్‌లో ఉంది. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పాయింట్లు, 2.137 నికర రన్ రేట్‌తో రెండో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ రెండు పాయింట్స్‌, నెట్ రన్ రేట్ 0.493తో మూడో స్థానంలో ఉంది. టాప్-3 జట్ల పాయింట్లు సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ఆధారంగా స్థానాలు ఉన్నాయి. 

Continues below advertisement