sad truth behind MS Dhonis success | మహీ, కెప్టెన్ కూల్, తలా, ఎమ్మెస్డీ.. ఇలా ముద్దు పేర్లతో  క్రికెట్ అభిమానుల నోళ్లలో గత రెండు దశాబ్దాలుగా నానుతోన్న క్రికెట్ శిఖరం ఎం. ఎస్ ధోనీ. సచిన్ ని చూశాం, గవాస్కర్ ని చూశాం, గంగూలీని చూశాం, ద్రావిడ్‌ను చూశాం కానీ ఇంత కూల్ గా మ్యాచ్ లను, టోర్లమెంట్లను ఎగరేసుకుపోయే కెప్టెన్ ని మాత్రం ఇతన్నే చూస్తున్నాం అనేంత గోప్ప ప్లానర్ ధోనీ.  ఇండియన్‌ క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు ధోని. అయితే.. ఇంత పేరు ప్రఖ్యాతలొచ్చిన ధోని.. ఇదంతా సాధించేందుకు ఏం ఫణంగా పెట్టాడో తెలుసా..? తన ఆరోగ్యం.  అవునండీ  42 ఏళ్లకే ధోనీ నరకం అనుభవిస్తున్నాడు. ఇంత బాధను ధోని ఎలా దాచాడు? ఎందుకు దాచాడు? ఆ వివరాలు మీకోసం. 


సాధారణ ఆటగాడిలా వచ్చి క్రికెట్ శిఖరంగా మారి..


ఇండియన్‌ క్రికెట్‌ను ఊపేసిన పేరు ధోనీ. ప్రపంచ క్రికెట్‌లో ఇండియాను ఉన్నత శిఖరాలకు చేర్చింది ధోనీ. ఓ సాధారణ ఆటగాడిలా భారత జట్టులోకి అడుగుపెట్టి.. పెను సంచలనంగా మారి అనతి కాలంలోనే టీమిండియా సారధ్య బాధ్యతలను చేజిక్కించుకున్న చాణక్యుడు ధోనీ. ఫీల్డ్‌లో దుర్భేధ్యమైన తన క్రీడా చతరురతతో విజయాలకు ఇండియాను చిరునామాగా మార్చాడు.కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి ఏడాదే.. 2007లో తొలి టీ20 వరల్డ్‌ కప్‌ను కెప్టెన్‌గా ఇండియాకు అందించాడు.  


అప్పుడెప్పుడో కపిల్‌ దేవ్‌ సారథ్యంలో 1983లో వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమిండియా.. మళ్లీ ఆ కప్పును చాలా ఏళ్ల పాటు పొందలేకపోయింది.  అజార్, సచిన్‌, గంగూలీ, ద్రవిడ్‌  వంటి మహా మహులకే సాధ్యం కాని ఈ కలను 28 ఏళ్ల  తరువాత నిజం చేసిన కెప్టెన్ కూల్ మన ధోనీ. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. టీమిండియాకు 2011లో వన్డే వరల్డ్‌ కప్‌ ధోనీ సారధ్యంలో మళ్లీ గెలిచి చరిత్ర సృష్టించింది. 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీలో సైతం  ఇండియాను ఛాంపియన్‌గా నిలిపింది ధోనీయే. ఇలా కెప్టెన్‌ ఇండియన్‌ క్రికెట్‌లో మరే కెప్టెన్‌గా సాధ్యం కాని రికార్డులు, ఘనతలు సాధించాడు ధోనీ. కెప్టెన్‌గానే కాదు.. బ్యాటర్‌గా, వికెట్‌ కీపర్‌గా సైతం ధోనీ భారత క్రికెట్‌కు అత్యుత్తమ సేవలందించాడు. జట్టు కోసం ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు. అందుకే ధోని అంటే.. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ.. క్రికెట్‌ అభిమానులు పడిచచ్చిపోతుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ధోని క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు.


అసలు ధోనీ ఎం చేశాడంటే..  


ఐపీఎల్‌లో కేవలం ధోనీ బ్యాటింగ్‌ చూసేందుకు కొన్ని వేల మంది క్రికెట్‌ స్టేడియానికి వస్తుంటారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తోన్న అభిమానుల కోసం ధోనీ ఏం చేశాడో తెలుసా..? తన జీవితాన్నే అంకితమిచ్చాడు. తన శరీరం ఒక వయసు తరువాత ఆటకు సహకరించదు అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి అభిమానుల్ని అలరించేందుకు గ్రౌండ్‌లోకి దిగడమే ధోనీ ఆరోగ్యం చెడిపోవడానికి కారణం.  ప్రస్తుతం ధోని వయసు 42 ఏళ్లు. ఒక క్రీడాకారుడికి 42 ఏళ్ల వయసు అంటే.. ఎంతో ఫిట్‌గా ఉంటారు. ఆట నుంచి రిటైరయిపోయినా.. అప్పటి వరకు మెయిటేన్‌ చేసిన ఫిట్‌నెస్‌ వల్ల.. దృఢంగా ఉంటారు. కానీ, ధోని మాత్రం ఇప్పుడు చాలా రకాల నొప్పులతో బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నాడు. ఆట నుంచి రిటైర్‌ అయిపోయి.. కుటుంబంతో ఆనందంగా గడపాల్సిన సమయంలో సర్జరీలంటూ ఆస్పత్రుల పాలవుతున్నాడు. తన కెరీర్‌లో 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20 మ్యాచ్‌లు ఆడాడు ధోనీ. దాంతో పాటే ఐపీఎల్‌ కూడా.. ఐపీఎల్‌లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌ ధోనినే.. ఇలా మితి మీరిన క్రికెట్ ఆడి.. ఆట కోసం, దేశం కోసం, అభిమానుల కోసం తన శరీరాన్ని ఫణంగా పెట్టాడు ధోనీ. 


రెస్ట్ లెస్ క్రికెట్


టీమిండియాలోకి అడుగుపెట్టింది మొదలు రిటైర్‌ అయ్యేంత వరకు రెస్ట్‌ లెస్‌ క్రికెట్‌ ఆడిన ధోని ఇప్పుడు దాని ఫలితం అనుభవిస్తున్నాడు. 42 ఏళ్ల వయసులో వెన్ను నొప్పి, మొకాలి నొప్పి, కండరాల నొప్పి..ఇలా శరీరమంతా నొప్పులే. ధోనీ ఇంత నరకం అనుభవించడానికి కారణం దేశం కోసం, తన అభిమానుల కోసం రెస్ట్‌ లెస్‌ క్రికెట్‌ ఆడటమే. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి నాలుగేళ్ల క్రితమే రిటయిరైన ధోనీ.. ఐపీఎల్ లొ మాత్రం నిర్విరామంగా ఆడతూనే ఉన్నాడు. ఈ  సీజన్‌లో ధోని పరిగెత్తలేకపోతున్నాడు, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందు రావడం లేదు అని విమర్శించే వారెవ్వరికీ తన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పుడూ బయటకొచ్చి చెప్పలేదు ధోనీ. కానీ ఏమాత్రం శరీరం సహకరించకపోయినీ.. ఈ సీజన్‌ ఆయన  కేవలం తన అభిమానుల కోసం ఆడాడన్నది మాత్రం నిజం. అయినప్పటికీ ఈ సీజన్లో  కండరాల నొప్పి, వెన్నునొప్పితో బాధపడుతూనే తన పూర్తి స్థాయి ఎఫర్ట్ పెట్టి ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్‌ ముగియడంతో ధోని సర్జరీ కోసం లండన్‌కు వెళ్లాడు. ఇంత కాలం.. తన శరీరం అనుభవిస్తున్న బాధను దాచి.. అభిమానులు కోసం ఇంత నరకం చూసిన ధోనీ నిజంగా గ్రేట్ కదా..?