SRH vs RR IPL 2024 Sunrisers Hyderabad won by 1 run: సొంత స్టేడియంలో  హైదరాబాద్‌ అదరగొట్టేసింది.  హోరాహోరీగా  రాజస్థాన్‌తో జరిగిన పోరులో  ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్  ఇచ్చిన  202 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. రియాన్‌ పరాగ్‌ ,  యశస్వి జైస్వాల్‌  లు చెలరేగి అర్ధశతకాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది . హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌ 3, నటరాజన్‌ 2, కమిన్స్‌ 2 వికెట్లు తీశారు.


మొదట  బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. నితీశ్‌ రెడ్డి  ,హెడ్‌, క్లాసెన్‌ చెలరేగారు. అవేశ్‌ ఖాన్‌ 2, సందీప్‌ శర్మ 1 వికెట్‌ తీశారు. లక్ష్యచేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్‌కు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. మొదటి  ఓవర్‌లోనే రెండు వికెట్లను కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో ముందుగా రెండో బంతికి బట్లర్‌,  ఐదో బంతికి  సంజూ శాంసన్‌  అవుట్ అయ్యి పెవిలియన్‌కు చేరారు. రియాన్‌ పరాగ్‌, యశస్వి జైస్వాల్‌తో కలిసి చెలరేగి ఆడటంతో పవర్‌ ప్లే ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేశారు. ఇద్దరు అర్ధ శతకాల తరువాత నటరాజన్‌ బౌలింగ్‌లో జైస్వాల్‌ అవుట్అయ్యాడు. 16 వ ఓవర్ లో పరాగ్ కూడా అవుట్ అయిన తారువాత బ్యాటర్లు చివరి ఓవర్‌లో రాజస్థాన్‌ లక్ష్యం 13 పరుగులు. పొవెల్‌ రాజస్థాన్‌ను  ముందుకు తీసుకువెళ్ళే  ప్రయత్నం చేసినప్పటికీ.. చివరి బంతికి అతను ఎల్బీడబ్ల్యూ కావడంతో ఓటమి తప్పలేదు.


సన్‌రైజర్స్‌ ఆట సాగిందిలా.. 


రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ లో ఓపెనర్ లుగా దిగిన  ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మలు ఫోర్ తో తమ ఆట మొదలు పెట్టారు. జోరు మీదున్న ఓపెనర్లు ప్రతి ఓవర్ లోనూ ఒక బౌండరీ కొడుతూ దుకుడు మీద ఉండగా నాలుగో ఓవర్ లో హెడ్‌ ఎల్‌బీడబ్ల్యూగా భావించి రాజస్థాన్‌ రివ్యూ తీసుకుంది. అయితే ఫలితం వ్యతిరేకంగా రావడంతో రాజస్థాన్‌ ఒక రివ్యూ కోల్పోయింది.  తరువాత అవేశ్‌ ఖాన్‌ వేసిన ఐదో ఓవర్లో హైదరాబాద్‌ తొలి వికెట్‌ పడింది. మొదటి బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన అభిషేక్‌12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జురెల్‌ చేతికి చిక్కాడు. తరువాత ఓవర్లో హైదరాబాద్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. సందీప్‌ శర్మ వేసిన తొలి బంతిని ఎదుర్కొని అన్‌మోల్‌ప్రీత్‌  జైస్వాల్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నప్పటికీ  ట్రావీస్ హెడ్  37 బంతుల్లో  హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తరువాత మరో 8 పరుగులు చేసి హెడ్ పెవిలియన్ చేరాడు.  అవేశ్‌ ఖాన్‌ వేసిన 15వ ఓవర్‌లో మూడో బంతికి స్టంపౌట్‌ నుంచి తప్పించుకున్నప్పటికీ.. నాలుగో బంతికి హెడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హెడ్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్‌ కూడా హాఫ్  సెంచరీ పూర్తి చేయలేకపోయినప్పటికీ బాగానే రాణించాడు. మరోవైపు నితీశ్  కుమార్ రెడ్డి 42 బంతుల్లో మూడు ఫోర్స్, ఎనిమిది సిక్సర్ల సహాయంతో 76 పరుగులను రాబట్టి అజేయంగా నిలిచాడు. ఇక చివర్లో కెప్టెన్ క్లాసన్ 19 బంతుల్లో 42 పరుగులను జోడించడంతో స్కోరుబోర్డు 200 దాటింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్‌ను ఎట్టకేలకు 200 దాటించారు. రాజస్థాన్‌ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ 2, సందీప్‌ 1 వికెట్‌ తీశారు.