SRH vs RR  IPL 2024 Rajasthan Royals target 202 : రెండు వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా మారిన వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) కు ప్రతి మ్యాచ్ కీలకమే.  అందుకే స్వంత మైదానంలో రాజస్థాన్‌(RR) తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ కమిన్స్.  అయితే రాజస్థాన్‌ బౌలర్ల ధాటికి ముందుగా తడబడినప్పటికీ.. తర్వాత హైదరాబాద్‌ బ్యాటర్లు దూకుడు చూపించారు.  నిర్ణీత 20 ఓవర్లలో హైదరాబాద్‌ 3 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది హైదరాబాద్ జట్టు.  హెడ్‌, నితీశ్‌రెడ్డి  హాఫ్‌ సెంచరీలకు కాస్తంత  క్లాసెన్‌జోరు  తోడవ్వడంతో హైదరాబాద్‌  స్కోర్‌ 200  దాటింది. 


తడబడినా తట్టుకొని ..


రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ లో ఓపెనర్ లుగా దిగిన  ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మలు ఫోర్ తో తమ ఆట మొదలు పెట్టారు. జోరు మీదున్న ఓపెనర్లు ప్రతి ఓవర్ లోనూ ఒక బౌండరీ కొడుతూ దుకుడు మీద ఉండగా నాలుగో ఓవర్ లో హెడ్‌ ఎల్‌బీడబ్ల్యూగా భావించి రాజస్థాన్‌ రివ్యూ తీసుకుంది. అయితే ఫలితం వ్యతిరేకంగా రావడంతో రాజస్థాన్‌ ఒక రివ్యూ కోల్పోయింది.  తరువాత అవేశ్‌ ఖాన్‌ వేసిన ఐదో ఓవర్లో హైదరాబాద్‌ తొలి వికెట్‌ పడింది. మొదటి బంతిని షాట్‌ ఆడేందుకు ప్రయత్నించిన అభిషేక్‌12 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జురెల్‌ చేతికి చిక్కాడు. తరువాత ఓవర్లో హైదరాబాద్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. సందీప్‌ శర్మ వేసిన తొలి బంతిని ఎదుర్కొని అన్‌మోల్‌ప్రీత్‌  జైస్వాల్‌కి క్యాచ్‌ ఇచ్చాడు. రాజస్థాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తుండటంతో 8 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 48/2.    ట్రావీస్ హెడ్  37 బంతుల్లో  హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తరువాత మరో 8 పరుగులు చేసి హెడ్ పెవిలియన్ చేరాడు.  అవేశ్‌ ఖాన్‌ వేసిన 15వ ఓవర్‌లో మూడో బంతికి స్టంపౌట్‌ నుంచి తప్పించుకున్నప్పటికీ.. నాలుగో బంతికి హెడ్‌ క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. హెడ్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన క్లాసెస్‌ కూడా హాఫ్  సెంచరీ పూర్తి చేయలేకపోయినప్పటికీ బాగానే రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోర్‌ను ఎట్టకేలకు 200 దాటించారు. రాజస్థాన్‌ ముందు 202 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. రాజస్థాన్‌ బౌలర్లలో అవేశ్‌ 2, సందీప్‌ 1 వికెట్‌ తీశారు 


ఆత్మ విశ్వాసంతో రాజస్థాన్‌  
రాజస్థాన్ రాయల్స్ చాలా బలంగా కనిపిస్తోంది. ఎలా అయినా ఈ మ్యాచ్ ల్ప  హైదరాబాద్‌పై కూడా విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ప్లే ఆఫ్‌కు చేరాలని చూస్తోంది. 16 పాయింట్లతో పట్టికలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్‌లతో రాజస్థాన్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. హెట్‌మెయిర్‌, రోవ్‌మాన్ పావెల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మలతో బౌలింగ్‌ కూడా బలంగా ఉంది.