SRH vs RR  IPL 2024 Sunrisers Hyderabad opt to bat: రెండు వరుస పరాజయాలతో ప్లే ఆఫ్‌ ఆశలు సంక్లిష్టంగా మారిన వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌(SRH) కు ప్రతి మ్యాచ్ కీలకమే.  అందుకే స్వంత మైదానంలో రాజస్థాన్‌(RR) తో జరుగుతున్న మ్యాచ్‌లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ కమిన్స్.  ఎప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న రాజస్థాన్‌ ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయమవుతుంది. వరుస విజయాలతో వెనుకబడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కు ఆడే ప్రతి మ్యాచ్ కీలకమే. అయితే ఈ ఐపీఎల్‌లో ఇప్పటికే మూడుసార్లు 250కుపైగా పరుగులు చేసిన హైదరాబాద్‌ బ్యాటర్లు.. ఈ మ్యాచ్‌లో జూలు విదిల్చారని చూస్తున్నారు.  అందుకే కమిన్స్ బ్యాటింగ్ వైపే మొగ్గు చూపాడు. సాధారణంగానే  ఈ పిచ్‌ బ్యాటర్లకు స్వర్గధామం . బెంగళూరుతో జరిగిన గత మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇక్కడ భారీ విజయం నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేయడం మంచి ఎంపిక. బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది.  రెండో ఇన్నింగ్స్‌లో పిచ్‌ నెమ్మదిస్తూ బౌలింగ్‌కు అనుకూలిస్తుంది. 


ఒత్తిడిఅంతా  సన్‌రైజర్స్‌ పైనే 


ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌  కీలక పోరుకు సిద్ధమైంది.  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అద్భుతంగా ఆడుతున్న రాజస్థాన్‌పై ఎలా ఆడుతుందో చూడాలి. పాట్ కమ్మిన్స్ నేతృత్వంలోని హైదరాబాద్‌ టాప్‌, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు లక్ష్య ఛేదనలో వరుసగా విఫలమవుతున్నారు. ఈ సీజన్‌లో SRH 250 పరుగుల మార్క్‌ను మూడుసార్లు అధిగమించింది, అయితే ఈ మూడు సార్లు కూడా హైదరాబాద్‌ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడే ఈ స్కోరు నమోదు చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడంతో మరోసారి రికార్డు పరుగులు చేసే అవకాశం ఉంది.  ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మరోసారి ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడితే రాజస్థాన్‌పై గెలుపు అంత కష్టం కాదు. ఐడెన్ మార్క్రామ్ మరింత మెరుగ్గా రాణించాలని హైదరాబాద్‌ జట్టు కోరుకుంటోంది. 


ఆత్మ విశ్వాసంతో రాజస్థాన్‌  
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చాలా బలంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌పై కూడా విజయం సాధించి ఆత్మ విశ్వాసంతో ప్లే ఆఫ్‌కు చేరాలని చూస్తోంది. 16 పాయింట్లతో పట్టికలో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉంది. జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, కెప్టెన్ సంజూ శాంసన్‌లతో రాజస్థాన్‌కు బలమైన బ్యాటింగ్ లైనప్‌ ఉంది. హెట్‌మెయిర్‌, రోవ్‌మాన్ పావెల్, రియాన్ పరాగ్, ధృవ్ జురెల్ కూడా మంచి టచ్‌లో కనిపిస్తున్నారు. యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మలతో బౌలింగ్‌ కూడా బలంగా ఉంది.


హైదరాబాద్‌ జట్టు: ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, అన్‌మోల్‌ప్రీత్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్‌రెడ్డి, అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, మార్కో జాన్సెన్‌, పాట్‌ కమిన్స్‌(కెప్టెన్‌), భువనేశ్వర్‌కుమార్‌, టి. నటరాజన్‌


రాజస్థాన్‌ జట్టు: యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్‌(కెప్టెన్‌), రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, రోమాన్‌ పోవెల్‌, షిమ్రాన్‌ హెట్‌మెయర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అవేశ్‌ ఖాన్‌, యుజ్వేంద్ర చాహల్‌, సందీప్‌ శర్మ