SRH Vs GT Match Called Off: ప్లే ఆఫ్స్‌కు అడుగుదూరంలో నిలిచిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad) , -గుజరాత్ టైటాన్స్(GT) తో  కీల‌క పోరుకు వరుణుడు అవకాశం ఇవ్వలేదు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. 


మధ్యాహ్నం  హైదరాబాద్ లో దాదాపు రెండు గంటలపాటు భారీ వర్షం దంచికొట్టింది.  ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో వర్షం భారీగానే పడింది. దీంతో.. స్టేడియం సిబ్బంది పిచ్ తో పాటు గ్రౌండ్ మొత్తం కవర్లతో కప్పి కవర్ చేశారు. 7 గంటల సమయానికి ఇరు జట్లు స్టేడియం కు చేరుకున్నప్పటికీ టాస్ వేయలేకపోయారు. అయితే మ్యాచ్‌ నిర్వహణకు రాత్రి 10.30 వరకు సమయం ఉంది. ఎందుకంటే ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఐదు ఓవర్ల ఆటను నిర్వహించడానికి కట్ ఆఫ్‌ టైమ్ 10: 56 . అయితే 7. 30 నిమిషాల సమయంలో  వర్షం తగ్గింది అని కవర్లను తీసేశారు.  గ్రౌండ్ లో ఉన్న నీటిని తీసేయడానికి సిబ్బంది  నానా కష్టాలు పడ్డారు.  అభిమానుల రాక కూడా మొదలైంది. కనీసం 8 గంటలకైనా టాస్ వేద్దామని నిర్ణయించుకున్నారు. 


కానీ సరిగ్గా 7.56 నిమిషాల తరువాత మరోసారి వర్షం మొదలయ్యింది. దీంతో మైదాన సిబ్బంది వెంటనే పిచ్‌పై కవర్లు కప్పారు. అప్పటికీ వర్షం ఆగకపోవడంతో మ్యాచ్‌ను రద్దుచేశారు. దీంతో 15 పాయింట్లతో హైదరాబాద్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.