Shikhar Dhawan News: భారత మాజీ విధ్వంసక ఓపెనర్ శిఖర్ ధావన్ తన ప్రేయసిని లోకానికి పరిచయం చేశాడు. ఐర్లాండ్ కు చెందిన సోఫీ షైన్ తన గర్ల్ ఫ్రెండ్ అని తాజాగా ఒక పోస్టులో ఆమెతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. దాని కింద మైలవ్ అని రాశాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న ఊహాగానాలకు చెక్ పడింది. గత చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సోఫీతో కలిసి ధావన్ చమక్కుమన్నాడు. దీంతో ఆమె ఒక్క సారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. ఆమె ఎవరా..? అని చాలామంది సెర్చ్ చేశారు. ఐర్లాండ్ కు చెందిన వ్యక్తి అని అప్పట్లోనే చాలామంది కనిపెట్టేశారు. అయితే దీనిపై ఇప్పటివరకు ధావన్ ఎలాంటి సమాధానం చెప్పలేదు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయంపై ఒక ప్రశ్న ఎదురుకాగా, తెలివిగా ఆన్సర్ చెప్పిన ధావన్ సోఫీ గురించి వెల్లడించలేదు. తన రూంలో ఉన్న అత్యంత అందమైన వ్యక్తి తన గర్ల్ ఫ్రెండేనని చెప్పాడు. అయితే ఆమె పేరును వెల్లడించలేదు. అయితే తాజాగా తన గర్ల్ ఫ్రెండ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రపంచానికి చాటేలా చేశాడు.
మిస్టరి వుమెన్..గత చాంపియన్స్ ట్రోఫీకి ఐసీసీ తరపున అంబాసిడర్ గా నియామకమైన ధావన్.. దుబాయ్ లో ఉన్న భారత జట్టును కలుసుకునేందుకు వచ్చాడు. అప్పట్లో సోఫీ తళుక్కుమనగా, మిస్టరీ వుమెన్ అని ఆమె గురించి చాలా చర్చ జరిగింది. అప్పటి నుంచి దీనిపై ధావన్ సైలెంట్ గానే ఉన్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో పోస్టుతో దీనిపై ధావన్ క్లారిటీ ఇచ్చాడు. దీనిపై అటు సోఫీతోపాటు ఇటు క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ కూడా లైకిచ్చాడు. ఇక సోఫీ షైన్ కు ఇన్‌స్టాగ్రామ్‌లో 134K ఫాలోవర్లు ఉండగా, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమె 2018 నుండి నార్తర్న్ ట్రస్ట్ కార్పొరేషన్‌లో పని చేస్తోంది. ప్రస్తుతం ప్రొడక్ట్ కన్సల్టేషన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆమె ఐర్లాండ్‌లోని లిమెరిక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీని పూర్తి చేసింది. కాజిల్‌రాయ్ కాలేజీలో కూడా విద్యాభ్యాసం చేసింది.
ఆస్ట్రేలియన్ యువతితో విడాకులు..శిఖర్ ధావన్ 2012లో ఆస్ట్రేలియాలో నివసిస్తున్న ఆయేషాను వివాహం జరిగింది. 2023 అక్టోబర్‌లో ఢిల్లీ హైకోర్టు ధావన్- ఆయేషాకు విడాకులు మంజూరు చేసింది. ఈ జంటకు 2024లో కుమారుడు జోరావర్ పుట్టాడు. ధావన్ ఆగస్టు 2024లో అన్ని రకాల ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. అతను చివరిసారిగా 2024లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో బరిలోకి దిగాడు. ఇండియా తరపున చివరిగా డిసెంబర్ 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో ప్రాతినిథ్యం వహించాడు. తాజా పోస్టుతో ధావన్ ఫ్యూచర్ పై అతని అభిమానులు అల్ ది బెస్టు చెబుతున్నారు.