T20 World Cup : సంజూ శాంసన్...! మోస్ట్ అండర్ రేటేడ్ ప్లేయర్ ఫ్రమ్ టీం ఇండియా అని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు కొడుతున్నా..టీం ఇండియాలో మాత్రం అవకాశాలు రావట్లేదు. ఈ సారి ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నాడు. కెప్టెన్ గా 8 విజయాలతో రాజస్థాన్ లో ప్లే ఆఫ్స్ లోకి తీసుకెళ్లాడు. అంతేకాదు..బ్యాటర్ గా కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నాడు. 385 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో 2వ ప్లేసులో ఉన్నాడు. 9 మ్యాచుల్లో ఇతడి స్ట్రైక్ రేట్ 161గా ఉంది.


గత 2-3 సీజన్స్‌లో స్పీడ్ గా ఆడేందుకు ప్రయత్నించే క్రమంలో పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయలేకపోతున్నాడు అనే పేరు సంజూపై ఉండేది. ఈసారి అలా కాదు.. స్లో గా స్టార్ట్ చేస్తూ.. అవసరమైనప్పుడు ఇన్నింగ్స్ స్పీడ్ పెంచుతున్నాడు. కెప్టెన్ గా మిగతా బ్యాటర్లతో కలిసి మంచి పార్ట్ నర్ షిప్‌లు నమోదు చేస్తున్నాడు. నిన్న లక్నో మ్యాచులో ధృవ్ జురెల్ తో కలిసి 100కుపైగా పార్ట్ నర్ షిప్ నమోదు చేశాడు.


ఇలా..అన్ని విభాగాల్లో రాణిస్తున్న సంజూ శాంసన్ ను టీ20 వరల్డ్ కప్ కు సెలెక్ట్ చేయాల్సిందేనని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మెచ్యూర్ ఇన్నింగ్స్ లు ఆడుతున్న సంజూ శాంసన్ టీం ఇండియాలో కచ్చితంగా ఉండాల్సిదేనని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మ్యాథ్యు హెడెన్ బల్లగుద్ది మరి చెబుతున్నారు.