Sanjay Manjrekar squad for T20 World Cup 2024: జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్(T 20 World Cup) కోసం భారత జట్టును ఎంపిక చేసే పనిలో సెలక్టర్లు నిమగ్నమయ్యారు. ఈ నెలాఖరులో జట్టును ప్రకటించే అవకాశం ఉన్నట్టు బీసీసీఐ(BCCI) వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు మాజీ ఆటగాళ్లు తమ అంచనాలతో కూడిన జట్లను ప్రకటిస్తున్నారు. రకరకాల అంచనాలు, విశ్లేషణలు చేస్తున్నారు. వేర్వేరు ఆటగాళ్ల పేర్లను సూచిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్, మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్, హర్భజన్ సింగ్ ఇలా పలువురు తమ డ్రీం టీంలను ప్రకటించారు. ఇక ఇప్పుడు తాజాగా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌(Sanjay Manjrekar) తన టీ 20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించాడు. అయితే ఇందులో టీమిండియా స్టార్ విరాట్‌కోహ్లీ,  హార్దిక్‌ పాండ్యాలకు మంజ్రేకర్‌ స్థానం ఇవ్వలేదు. 


 క్రికెట్‌ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్‌ 2024 (T 20 World Cup 2024)  జూన్‌ 1 నుంచి  ప్రారంభం కానుంది. ఈ వరల్డ్‌ కప్‌కు యూఎస్‌, వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దాదాపు అన్ని దేశాలు తమ వరల్డ్‌ కప్‌ టీమ్‌ల ఎంపికలో బిజీగా ఉన్నాయి.  2007లో టీ 20 ప్రపంచకప్‌ గెలుచుకున్న టీమిండియా మరోసారి ఆ టైటిల్‌ను ఒడిసి పట్టాలని పట్టుదలగా ఉంది. ఈ నేపధ్యంలో టీం లోకి  ఈ ఐపీఎల్‌లో ముంబైపై సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చిన యశస్వి జైస్వాల్‌తో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ... టీమిండియా బ్యాటింగ్‌ను ప్రారంభించాలని మంజ్రేకర్‌ ప్రతిపాదించాడు.  అలాగే మిడిల్‌ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, KL రాహుల్, రవీంద్ర జడేజాలు ఉండాలని  సలహా ఇచ్చాడు . అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌ను పేసర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అవేశ్ ఖాన్‌లకు చోటు కల్పించారు. స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా కృనాల్‌ పాండ్యా.. పేసర్‌గా హర్షిత్ రాణాను కూడా   చోటు ఇచ్చాడు.  హార్దిక్ పాండ్యాకు... కింగ్‌ కోహ్లీకి మంజ్రేకర్‌ తన జట్టులో స్థానం ఇవ్వలేదు.  


మంజ్రేకర్‌ జట్టు: రోహిత్ శర్మ( కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, KL రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌, ఆవేశ్‌ఖాన్, హర్షిత్‌ రాణా, మయాంక్ యాదవ్‌, కృనాల్ పాండ్యా


ఇక హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన భారత జట్టు లో సీనియర్ ప్లేయర్లు హార్ధిక్ పాండ్యా, శుబ్‌మ‌న్ గిల్‌, మ‌హ్మ‌ద్ సిరాజ్‌ల‌తో పాటు కేఎల్ రాహుల్‌ ల‌కు అవకాశం ఇవ్వ‌లేదు.  టీమిండియా మాజీ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ ఎంపిక చేసిన జట్టులో సైతం  హార్ధిక్ పాండ్యాకి చోటు దక్కలేదు.  


హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్‌, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్.


సెహ్వాగ్  భారత జట్టు  ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివమ్ దూబే/రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సందీప్ శర్మ.


ఇర్ఫాన్ పఠాన్ యొక్క భారత జట్టు:


రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ , సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా (అతను క్రమం తప్పకుండా బౌలింగ్ చేస్తేనే), రింకు సింగ్, రవీంద్ర జడేజా , కుల్దీప్ యాదవ్ , జస్ప్రీత్ బుమ్రా , అర్ష్దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, రవి బిష్ణోయ్/యుజీ చాహల్, శుభమాన్ గిల్ / సంజు శాంసన్