Kavya Maran Reaction During Srh Loss Vs Rcb : ఐపీఎల్‌-2024(IPL) సీజన్‌లో  విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులను హడలిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH)  తాజాగా జరిగిన మ్యాచ్ లో  మూడో ఓట‌మి చవిచూసింది.  ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 35 పరుగుల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో  అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్ పరంగా ఎస్‌హెర్‌హెచ్ ఘరంగా  విఫ‌ల‌మైంది.


తొలుత బౌలింగ్‌లో 206 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్న స‌న్‌రైజ‌ర్స్‌.. అనంత‌రం బ్యాటింగ్‌లోనూ చేతులెత్తేసింది.  అదికూడా సొంత గడ్డపై వరుస విజయాల తర్వాత టేబుల్స్ పట్టికలో చివరి స్థానంలో ఉన్న ఆర్సీబీపై ఓడిపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. 207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వ‌చ్చిన స‌న్‌రైజ‌ర్స్ ఓన‌ర్‌ కావ్య మార‌న్ చాలా హర్ట్ అయ్యింది.  మ‌రోసారి త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. 


తొలుత బౌలింగ్‌లో ఆర్సీబీ వికెట్లు ప‌డిన‌ప్పుడు ఎగిరి గెంతులేసిన కావ్యా.. త‌మ బ్యాటింగ్ వ‌చ్చేస‌రికి సీన్ రివ‌ర్స్ అయింది. అతి బీకర ఫామ్ లో ఉన్న బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ కు క్యూ కడుతుండడంతో   కావ్య మారన్ మోహం చిన్నబోయింది. ముఖ్యంగా అబ్దుల్ స‌మ‌ద్ ఔటైన త‌ర్వాత కావ్య పాప షాకింగ్ రియాక్ష‌న్ ఇచ్చింది. ఏంటి రా ఏ బ్యాటింగ్ అన్న‌ట్లు కావ్య  ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. 


అసలు ఇప్పుడే కాదు ప్రతి మ్యాచ్ లోనూ కావ్య మారన్ హావభావాలు పదే పదే వైరల్ అవుతుంటాయి. అందంగా ఉండే ఆమె ప్రతివిషయానికి అంతలా,   స్పందించే  తీరు ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. గత మ్యాచుల్లో హైదరాబాద్ సన్‌రైజర్స్ బ్యాటర్లపై కూడా మీమ్స్ వచ్చాయి. ఇదెక్కడి వీరబాదుడు , ఉతికేస్తున్నారు , నెక్స్ట్ 300 పరుగులు దా టేస్తారు  అంటూ నెటిజన్లు మీమ్స్ సృష్టించారు. హడావిడి చేశారు. కానీ హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో హైదరాబాద్ జట్టు మరింత రెచ్చిపోతుందని అనుకుంటే ఓటమిని మూటగట్టకుంది. 


 


లక్ష్య ఛేదనలో డీలా

207 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. తొలి ఓవర్‌లోనే ట్రానిస్‌ హెడ్‌ వెనుదిరగడంతో హైదరాబాద్‌కు గట్టి దెబ్బ తగిలింది. ఒక్క పరుగే చేసిన హెడ్‌...జాక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. మా‌ర్‌క్రమ్‌ ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. నితీశ్‌కుమార్‌ రెడ్డి 13, క్లాసెన్‌ ఏడు, పరుగులకు వెనుదిరగడంతో 56 పరుగులకే హైదరాబాద్‌ నాలుగు వికెట్లు కోల్పోయింది. అభిషేక్‌ శర్మ కాసేపు బెంగళూరు బౌలర్లను అడ్డుకున్నాడు. 13 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు చేసి అవుటయ్యాడు. పాట్‌ కమిన్స్‌ కూడా 31 పరుగులే చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లు సమష్టిగా రాణించడంతో  హైదరాబాద్ జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో 35 పరుగుల తేడాతో బెంగళూరు విజయం సాధించింది.