RR vs RCB, IPL 2022 LIVE: RR vs RCB, IPL 2022 Live score updates: డీకే అటాక్‌కు రాజస్థాన్ విలవిల! బెంగళూరుకు రెండో విక్టరీ
IPL 2022 RR vs RCB Live Updates: రాజస్థాన్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. చివరి మ్యాచ్ గెలిచిన బెంగళూరు ఐదు రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతోంది. మరి వీరిద్దరిలో (RR vs RCB) ఎవరిది పై చేయి?
యశస్వీ జైశ్వాల్ వేసిన తొలి బంతిని హర్షల్ సిక్సర్‌గా బాదేసి బెంగళూరుకు 4 వికెట్ల తేడాతో విక్టరీ అందించాడు. డీకే (44) సూపర్బ్ ఇన్సింగ్స్ ఆడాడు.
ప్రసిద్ధ్ 12 పరుగులు ఇచ్చాడు. డీకే (44) వరుసగా రెండు బౌండరీలు కొట్టాడు. హర్షల్ (3) అతడికి తోడుగా ఉన్నాడు.
ట్రెంట్ బౌల్ట్ 13 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఒక బౌండరీ, ఒక సిక్సర్ బాదేసిన షాబాజ్ (45)ను ఔట్ చేశాడు. హర్షల్ పటేల్ (1), డీకే (35) ఆడుతున్నారు.
యూజీ చాహల్ 4 పరుగులే ఇచ్చాడు. దినేశ్ కార్తీక్ (35), షాబాజ్ (33) రిస్క్ తీసుకోలేదు.
ప్రసిద్ధ్ 13 పరుగులు ఇచ్చాడు. షాబాజ్ అహ్మద్ ( 31) ఒక బౌండరీ, ఒక సిక్సర్ కొట్టేశాడు. డీకే (33) అతడికి తోడుగా ఉన్నాడు.
నవదీప్ సైని 16 పరుగులు ఇచ్చాడు. దినేశ్ కార్తీక్ (31) రెండు బౌండరీలు, షాబాజ్ (20) ఒక బౌండరీ బాదేశారు.
అశ్విన్ 21 పరుగులు ఇచ్చాడు. దినేశ్ కార్తీక్ (20) వరుసగా 4, 4, 6, 4, 0, 4 బాదేశాడు. షాబాజ్ (15) నిలకడగా ఆడుతున్నాడు.
ట్రెంట్ బౌల్ట్ మరో బ్రేక్ ఇచ్చాడు. కేవలం 2 పరుగులిచ్చి వికెట్ తీశాడు. మూడో బంతికి రూథర్‌ఫర్డ్ (5)ను ఔట్ చేశాడు. అతడిచ్చిన క్యాచ్‌ను నవదీప్ సైని అద్భుతంగా పట్టాడు. దినేశ్ కార్తీక్ (1), షాబాజ్ (14) ఆడుతున్నాడు.
నవదీప్ 15 పరుగులు ఇచ్చాడు. షాబాజ్ (13) ఒక బౌండరీ, ఒక సిక్సర్ కొట్టాడు. రూథర్‌ఫర్డ్ (5) అతడికి తోడుగా ఉన్నాడు.
చాహల్ 3 పరుగులిచ్చాడు. షాబాజ్ (1), రూథర్‌ఫర్డ్ (4) నిలకడగా ఆడుతున్నారు.
మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. అశ్విన్ వచ్చాడు. 6 పరుగులు ఇచ్చాడు. ఇందులో మూడు వైడ్లే! రూథర్‌ఫర్డ్ (2), షాబాజ్ అహ్మద్ (1) ఆచితూచి ఆడుతున్నారు.
యూజీ వేసిన ఈ ఓవర్లో మ్యాజిక్ జరిగింది. నాలుగో బంతికి నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లోంచి పరుగెత్తిన విరాట్ కోహ్లీ (5) వెనక్కి వచ్చే క్రమంలో రనౌట్ అయ్యాడు. సంజు శాంసన్ సూపర్ మ్యాన్ ఫీల్డింగ్ చేశాడు. ఆ తర్వాతి బంతికే డేవిడ్ విలే (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రూథర్‌ఫర్డ్ (0), షాబాజ్ అహ్మద్ (0) క్రీజులో ఉన్నారు.
నవదీప్ సైని మరో బ్రేక్ ఇచ్చాడు. 6 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఆఖరి బంతికి ఓపెనర్ అనుజ్ రావత్ (26)ను ఔట్ చేశాడు. విరాట్ కోహ్లీ (4) క్రీజులో ఉన్నాడు.
యుజువేంద్ర చాహల్ వచ్చాడు. 7 పరుగులిచ్చి కీలకమైన వికెట్ తీశాడు. రెండో బంతికి సిక్సర్ కొట్టిన డుప్లెసిస్ (24) ఆఖరి బంతికి బౌల్ట్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనుజ్ (24) నిలకడగా ఆడుతున్నాడు.
పవర్‌ప్లే ముగిసింది. బెంగళూరుకు మంచి ఆరంభం లభించింది. అశ్విన్ 8 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్ (24) ఒక బౌండరీ బాదాడు. అనుజ్ (22) అతడికి తోడుగా ఉన్నాడు.
ప్రసిద్ధ్ 7 పరుగులు ఇచ్చాడు. అనుజ్ రావత్ (20) ఒక బౌండరీ బాదాడు. డుప్లెసిస్ (18) అతడికి తోడుగా ఉన్నాడు.
అశ్విన్ బౌలింగ్‌కు వచ్చాడు. 5 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని డుప్లెసిస్ (18) బౌండరీకి పంపించాడు. అనుజ్ (15) అతడికి తోడుగా ఉన్నాడు.
బౌల్ట్ ఈ ఓవర్లో 16 పరుగులు ఇచ్చాడు. డుప్లెసిస్ (14) రెండు బౌండరీలు, అనుజ్ రావత్ (14) ఒక బౌండరీ బాదేశారు.
ప్రసిద్ధ్ కృష్ణ 9 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని అనుజ్ (9) బౌండరీకి పంపించాడు. డుప్లెసిస్ (3) అతడికి తోడుగా ఉన్నాడు.
ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ ఆరంభించాడు. 3 రన్స్ ఇచ్చాడు. అనుజ్ రావత్ (1), డుప్లెసిస్ (2) ఓపెనింగ్‌కు వచ్చారు.
కఠినమైన పిచ్‌పై రాజస్థాన్ డీసెంట్ స్కోరు చేసింది. వాంఖడేలో ఈ సీజన్లో తొలి ఇన్నింగ్స్ సగటు 142. కానీ ఆర్‌ఆర్ ఎక్కువే చేసింది. ఆఖరి 12 బంతుల్లో బట్లర్, హెట్‌మైయిర్ 42 పరుగులు చేశారు.
ఆకాశ్ 23 పరుగులు ఇచ్చాడు. బట్లర్ (70; 47 బంతుల్లో)వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు. ఆఖరి బంతిని హెట్‌మైయిర్ (42; 31 బంతుల్లో) కూర్చొని స్టాండ్స్‌లోకి పంపించాడు.
సిరాజ్ 19 పరుగులు ఇచ్చాడు. ఆఖరి రెండు బంతుల్ని బట్లర్ (55) వరుసగా రెండు సిక్సర్లు బాదేశాడు. అర్ధశతకం చేశాడు. హెట్‌మైయిర్ (35) నిలకడగా ఆడుతున్నాడు.
హర్షల్ 9 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతిని హెట్‌మైయిర్ (28) గట్టిగా కొట్టి బౌండరీకి పంపించాడు. బట్లర్ (43) నిలకడగా ఆడుతున్నాడు.
సిరాజ్ 11 పరుగులు ఇచ్చాడు. డ్యూ ఇప్పుడిప్పుడే వస్తోంది. మూడో బంతిని హెట్‌మైయిర్ (21) భారీ సిక్సర్ బాదేశాడు. బట్లర్ (41) షాట్లు ఆడలేకపోతున్నాడు.
హసరంగ 4 పరుగులే ఇచ్చాడు. హెట్‌మైయిర్ (13), బట్లర్ (39) బౌండరీల కొట్టలేకపోతున్నారు. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తోంది.
హర్షల్ 4 పరుగులే ఇచ్చాడు. హెట్‌మైయిర్ (11), బట్లర్ (37) నిలకడగా ఆడుతున్నారు.
హసరంగ 10 పరుగులు ఇచ్చాడు. హెట్‌మైయిర్ (9) వరుసగా రెండు బౌండరీలు బాదాడు. బట్లర్ (35) నిలకడగా ఆడుతున్నాడు.
హర్షల్ పటేల్ సూపర్బ్‌గా బౌలింగ్ చేస్తున్నాడు. పిచ్‌ను బట్టి వేగంలో వైవిధ్యం చూపిస్తున్నాడు. హెట్‌మైయిర్ (1), బట్లర్ (34) ఆచితూచి ఆడుతున్నారు.
హసరంగ 6 పరుగులిచ్చి కీలకమైన సంజు శాంసన్ (8)ని ఔట్ చేశాడు. రెండో బంతికి సిక్స్ కొట్టిన సంజూ నాలుగో బంతికి బౌలర్‌కే సులభ క్యాచ్ ఇచ్చాడు. హెట్‌మైయిర్ (0), బట్లర్ (33) నిలకడగా ఆడుతున్నారు.
ఆకాశ్ 4 పరుగులే ఇచ్చాడు. సంజు శాంసన్ (2), బట్లర్ (33) నిలకడగా ఆడుతున్నారు.
హర్షల్ పటేల్ 3 పరుగులే ఇచ్చి కీలకమైన వికెట్ తీశాడు. ఆఖరి బంతికి సిక్సర్ బాదబోయిన పడిక్కల్ 37(29) [4s-2 6s-2] క్యాచ్‌ను విరాట్ అద్భుతంగా పట్టాడు. జోస్ బట్లర్ (31) నిలకడగా ఆడుతున్నాడు.
హసరంగ 12 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని బట్లర్ (30) సిక్సర్ కొట్టాడు. అంతకు ముందు దేవదత్ (36)తో కలిసి చకచకా డబుల్స్ తీశాడు.
డేవిడ్ విలే 14 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో దేవదత్ పడిక్కల్ (31) ఒక బౌండరీ, ఒక సిక్సర్ కొట్టాడు. బట్లర్ (23) నిలకడగా ఆడుతున్నాడు. మూడో బంతికి పడిక్కల్ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ వదిలేశాడు. అయితే కష్టమైన క్యాచే!
ఆకాశ్ 12 పరుగులు ఇచ్చాడు. ఐదో బంతికి బట్లర్ (21) ఇచ్చిన క్యాచ్‌ను విలే జారవిడిచాడు. ఆ తర్వాత బంతికే అతడు సిక్స్ కొట్టాడు. పడిక్కల్ (20) నిలకడగా ఆడుతున్నాడు.
డేవిడ్ విలే 5 పరుగులే ఇచ్చాడు. దేవదత్ (19) నిలకడగా ఆడుతున్నాడు. బట్లర్ (10) ఇంకా బౌండరీలు బాదలేదు.
ఆకాశ్‌దీప్ చక్కగా బౌలింగ్ చేశాడు. 5 పరుగులు ఇచ్చాడు. పడిక్కల్ (17)ను ఔట్ చేసేందుకు ఔట్‌సైడ్ ఆఫ్ బంతులు వేశారు. బట్లర్ (7) ఇబ్బంది పడుతున్నారు.
డేవిడ్ విల్లే 8 పరుగులు ఇచ్చాడు. ఆఖరి బంతిని పడిక్కల్ (13) కట్‌షాట్‌తో థర్డ్‌మ్యన్ దిశగా బౌండరీకి పంపించాడు. బట్లర్ (6) కాస్త ఇబ్బంది పడుతున్నాడు.
సిరాజ్ 11 పరుగులు ఇచ్చాడు. మూడో బంతిని దేవదత్ పడిక్కల్ (9) బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో సూపర్ సిక్సర్ బాదేశాడు. బట్లర్ (3) మరో ఎండ్‌లో ఉన్నాడు.
డేవిడ్ విల్లే ఈ ఓవర్లో 4 పరుగులిచ్చి వికెట్ తీశాడు. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (4)ను ఐదో బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. దేవదత్ పడిక్కల్ (0) క్రీజులోకి వచ్చాడు. జోస్ బట్లర్ (2) నిలకడగా ఆడుతున్నాడు.
రాజస్థాన్ బ్యాటింగ్ ఆరంభించింది. సిరాజ్ బౌలింగ్ చేశాడు. 2 పరుగులే ఇచ్చాడు. యశస్వీ జైస్వాల్ (1), జోస్ బట్లర్ (1) నిలకడగా ఆడారు.
డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, డేవిడ్ విల్లే, హర్షల్ పటేల్, ఆకాశ్‌దీప్, మహ్మద్ సిరాజ్
జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, దేవదత్ పట్నాయక్, సంజు శాంసన్, షిమ్రన్ హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైని, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచింది. వెంటనే ఆ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Background
Royals vs Royal Challengers bangalore playing xi head to head records in ipl : ఐపీఎల్ 2022 సీజన్ 13వ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తలపడుతున్నాయి. వాంఖడే (Wankhede Stadium) ఇందుకు వేదిక. వరుసగా రెండు మ్యాచులు గెలిచిన రాజస్థాన్ భీకరమైన ఫామ్‌లో కనిపిస్తోంది. చివరి మ్యాచ్ గెలిచిన బెంగళూరు ఐదు రోజుల తర్వాత మ్యాచ్ ఆడుతోంది. మరి వీరిద్దరిలో (RR vs RCB) ఎవరిది పై చేయి? వాంఖడేలో గెలిచేదెవరు? తుది జట్టులో ఎవరెవరు ఉంటారు?
Rajasthan Royals ఫైర్!
గతేడాది పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన రాజస్థాన్ రాయల్స్ ఈ సారి దుమ్మురేపుతోంది. వేలంలో సరైన ఆటగాళ్లను తీసుకోవడంతో జట్టు పరిస్థితి మారిపోయింది. భీకరమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌తో ట్రోఫీ రేసులో ఉందనిపిస్తోంది. ఈ సీజన్లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ రెండుసార్లు తమ స్కోర్లను డిఫెండ్ చేసుకుంది సంజు శామ్సన్ (Sanju Samson) సేన. మరోవైపు డుప్లెసిస్ (Faf Du Plessis) నాయకత్వంలో జోష్‌లో కనిపిస్తున్న బెంగళూరు బ్యాటింగ్ లైనప్‌లో కాస్త ఒత్తిడి ఎదుర్కొంటోంది. మాక్స్‌వెల్ (Glenn Maxwell) వస్తే మరింత మెరుగ్గా మారుతుంది. విరాట్ కోహ్లీ (Virat Kohli) స్వేచ్ఛగా ఆడుతుండటం ఊరట కలిగించే అంశం.
RR vs RCB, అప్పర్ హ్యాండ్ ఎవరిదంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL 2022) రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డాయి. ఈ రెండు జట్లు సమవుజ్జీలుగానే ఉన్నాయి. అయితే రాజస్థాన్‌దే కాస్త అప్పర్ హ్యాండ్! ఆ జట్టు 12 గెలిస్తే బెంగళూరు 10 గెలిచింది. అయితే చివరగా తలపడ్డ ఐదు మ్యాచుల్లో బెంగళూరు 4-0 ఆధిపత్యం చెలాయించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
* రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ ఒక్కదగ్గరకు చేరడంతో రాజస్థాన్ స్పిన్ బౌలింగ్ భయంకరంగా మారింది. ట్రెంట్‌బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ పేస్ భీకరంగా ఉంది.
* బెంగళూరు ఎక్కువగా స్పిన్నర్ వనిందు హసరంగ, పేసర్ హర్షల్ పటేల్ మీద ఆధారపడింది. వీరిద్దరూ బాగా ఆడుతున్నారు. గ్లెన్ మాక్స్‌వెల్ 9 నుంచి వస్తాడు.
* ప్రసిద్ధ్, బౌల్ట్ బౌలింగ్‌లో కోహ్లీ మంచి రికార్డు ఉంది. వీరిద్దరిపై 140 స్ట్రైక్‌రేట్ ఉంది.
* హసరంగ బౌలింగ్‌లో సంజుకు మెరుగైన రికార్డు లేదు. 4 టీ20ల్లో 11 బంతులాడి 3 సార్లు ఔటయ్యాడు. బట్లర్ సైతం ఇలాగే ఉన్నాడు.
* ఐపీఎల్ 2021 నుంచి యుజ్వేంద్ర చాహల్ 17 మ్యాచులో 23 వికెట్లు తీశాడు. ఇలాంటి రికార్డు మరే స్పిన్నర్‌కు లేదు.
RR vs RCB probable xi
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: డుప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్, షాబాజ్ అహ్మద్, వనిందు హసరంగ, హర్షల్ పటేల్, డేవిడ్ విలే, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, యశస్వీ జైశ్వాల్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్, షిమ్రన్ హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైనీ, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్
- - - - - - - - - Advertisement - - - - - - - - -