RR vs PBKS Rajasthan Royals opt to bat:  ప్లే ఆఫ్‌ రేసుకు దూరమైన పంజాబ్‌(PBKS).. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలుపుకోవాలని చూస్తుండగా...ఈ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్‌కు చేరాలన్న పట్టుదలతో ఉన్న  రాజస్థాన్‌(RR) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.  అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తున్న రాజస్థాన్‌ను... ఆత్మవిశ్వాసం లోపించిన పంజాబ్‌ ఎంతవరకూ అడ్డుకోగలదో చూడాలి. ఈ మ్యాచ్‌లో సొంత మైదానంలో బరిలోకి దిగనున్న రియాన్‌ పరాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. 


పరాగ్ పైనే దృష్టాంతా.. 


ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలోకి దిగనున్న రియాన్ పరాగ్... ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు. ఇప్పటివరకూ 12 మ్యాచులు ఆడి ఎనిమిది విజయాలతో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌కు... అస్సాంలోని గౌహతీలో జరిగే  ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్‌కు చేరాలని పట్టుదలగా ఉంది. పరాగ్ ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సీజన్‌లోనే 153 స్ట్రైక్ రేట్‌తో 483 పరుగులు చేసిన పరాగ్‌.... మరోసారి సత్తా చాటాలని చూస్తున్నాడు. సంజూ శాంసన్, శశాంక్ సింగ్, అశుతోష్ శర్మలు కూడా రాణిస్తే రాజస్థాన్‌ గెలుపునకు అడ్డే ఉండదు. యశస్వి జైస్వాల్ 344 పరుగులు, జోస్ బట్లర్ 359 పరుగులతో మంచి టచ్‌లో ఉన్నారు. పరాగ్, శాంసన్ మరోసారి రాణిస్తే పంజాబ్‌ గెలుపు కష్టమే. రాజస్థాన్‌ జట్టు అన్ని విభాగాల్లో చాలా పటిష్టంగా ఉంది. రియాన్, కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్‌, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్‌మెయర్, ధృవ్ జురెల్‌లతో రాజస్తాన్‌ బ్యాటింగ్‌ బలంగా ఉంది. ఈ మ్యాచ్‌కు రాజస్థాన్‌ ఓపెనర్ జోస్ బట్లర్ అందుబాటులో లేడు. టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్‌  ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేస్తున్నాడు.


పంజాబ్‌ పరువు దక్కేనా 

పంజాబ్‌ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఇప్పటికే ప్లే ఆఫ్‌ నుంచి దూరమైన పంజాబ్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. పంజాబ్‌ బ్యాటర్లు మరోసారి మంచి ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌, జానీ బెయిర్‌స్టోపై పంజాబ్‌ బ్యాటింగ్‌ భారం ఉంది. జితేష్ శర్మ నుంచి పంజాబ్‌ భారీ స్కోరు ఆశిస్తోంది. కగిసో రబడా, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, శామ్ కరణ్‌లు ఉన్నా పంజాబ్‌ బౌలింగ్‌ బలహీనంగా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. శిఖర్ ధావన్ గాయం కారణంగా ఈ సీజన్‌లో కెప్టెన్సీ చేపట్టిన శామ్‌ కరణ్‌ ఆకట్టుకోలేక పోయాడు. 

గత స్లోర్లు ఎలా ఉన్నాయంటే.. 
ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ అత్యల్ప స్కోరు 124కాగా... రాజస్థాన్‌ అత్యల్ప స్కోరు 112. ఈ రెండు జట్లు జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్‌ అత్యధిక పరుగులు సాధించాడు. వ్యక్తిగత అత్యధిక స్కోరు కూడా సంజు శాంసన్‌ పేరు మీదే ఉంది. శాంసన్‌ పంజాబ్‌పై 119 పరుగులు చేశాడు. చాహల్‌ నాలుగు వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్నాడు.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు : జానీ బెయిర్‌స్టో , ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ,రిలీ రోసౌ, శశాంక్ సింగ్, జితేష్ శర్మ, శామ్ కరణ్‌ (కెప్టెన్‌), హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, నాథన్ ఎల్లిస్, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్, 
 


రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు : యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లెర్ కాడ్‌మోర్, సంజు శాంసన్ (కెప్టెన్), రియాన్‌ పరాగ్, ధ్రువ్ జురెల్, రొవ్‌మన్ పావెల్, అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, అవేశ్‌ ఖాన్‌, యుజ్వేంద్ర చాహల్.