Comments on Royal Challengers Bengaluru : ఈ ఐపీఎల్(IPL) బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్(SRH) సునామీల విరుచుకుపడడంతో.. బెంగళూరు(RCB) మరోసారి పరాజయం పాలైంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... ఒకే మ్యాచులో గెలిచి... ఆరు మ్యాచుల్లో ఓడిపోయింది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం తర్వాత బెంగళూరుపై విమర్శల జడివాన కురుస్తోంది.
మహేష్ భూపతి ఏమన్నాడంటే..?
అభిమానులు, ఆటగాళ్ల కోసమైనా బెంగళూరును బీసీసీఐ కొత్త యజమానికి విక్రయించాలని టెన్నిస్ స్టార్ హేశ్ భూపతి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేశాడు. ఇతర జట్ల వలే స్పోర్ట్స్ ఫ్రాంచైజీని నిర్మించడానికి శ్రద్ధ వహించే యజమానికి అవకాశం ఇవ్వాలని కూడా సూచించాడు. సచిన్ టెండూల్కర్ కూడా ఈ మ్యాచ్‌పై స్పందించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ పవర్ హిట్టింగ్‌తో అద్భుతమైన ఆటతీరు కనబర్చాయని అన్నాడు. 40 ఓవర్లలో 549 పరుగులు వచ్చాయని కానీ దీన్ని ఏ బౌలర్ కోరుకోడని అన్నాడు.
సన్‌రైజర్స్ రికార్డు స్థాయి స్కోరు నమోదు చేసిన తర్వాత ఆర్సీబీ బౌలర్లపై నెటిజన్లు సెటైర్లు గుప్పిస్తున్నారు. చివరకు విరాట్ కోహ్లి సైతం ఈ బౌలింగ్ చూసి నిస్సహాయంగా బాధపడటం తప్పించి ఏమీ చేయలేకపోయాడని అంటున్నారు. కొందరైతే ఇంకో అడుగు ముందుకేసి ఆర్సీబీ టీమ్ మొత్తాన్ని ట్రోల్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో ఓడినా బెంగళూరు ఓ రికార్డును తన పేరిట లిఖించుకుంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సరికొత్త రికార్డు నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలోనే చేజింగ్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సృష్టించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 287 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులే చేసి ఓటమిపాలైంది. దినేశ్ కార్తీక్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 83, ఫాఫ్ డుప్లెసిస్ 62 పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఛేజింగ్‌లో 250 ప్లస్ రన్స్ చేసిన తొలి జట్టుగా బెంగళూరు నిలిచింది.