RCB vs SRH Highlights: 17 సీజన్ల ఐపీఎల్ జరిగింది ఇప్పటిదాకా. ప్రతి ఏడాదీ ఆక్షన్ పూర్తయ్యాక... ఎక్కువ విమర్శలు ఎదుర్కొనే జట్లలో తొలిస్థానంలో ఉంటుంది... ఆర్సీబీ. ఎందుకంటే ఇన్నేళ్లుగా వాళ్ల ఆక్షన్ స్ట్రాటజీ అలా ఉంది కాబట్టి. ఎప్పుడూ కూడా బ్యాటింగ్ హెవీ స్ట్రాటజీ. అంటే స్టార్, విధ్వంసక బ్యాటర్లతో లైనప్‌ను నింపేస్తారే తప్ప, బౌలర్ల కోసం ఓ పక్కా ప్లానింగ్‌తో వెళ్లినట్టు కనిపించదు.
ఆర్సీబీ స్ట్రాటజీలన్నీ అలానే ఉంటాయి. ప్రస్తుతం ఐపీఎల్‌లోనే అత్యధిక వికెట్ టేకర్ అయిన యుజ్వేంద్ర చాహల్... ఎన్నో సీజన్లపాటు ఆర్సీబీకి ఆడాక కూడా... చెప్పా పెట్టకుండా అతణ్ని వదిలేసుకున్నారు. అతని రీప్లేస్మెంట్ గా తీసుకున్న శ్రీలంక స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగను రెండు సీజన్లకే వదిలేశారు. అలా ఉంటాయి ఆ స్ట్రాటజీలు.
నిన్న సన్ రైజర్స్‌తో మ్యాచ్ సంగతి చూద్దాం. జట్టులో భారీ మార్పులతో బరిలోకి దిగారు. క్యామెరూన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మహ్మద్ సిరాజ్ జట్టులో లేరు. వీళ్ల నలుగురి గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలంటే... వీళ్ల ధరల వల్ల. 17.5 కోట్లు, 11.5 కోట్లు, 11 కోట్లు, 7 కోట్లు.... ఇందులో మ్యాక్స్ వెల్, సిరాజ్ ను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది.
క్యామెరూన్ గ్రీన్.. ట్రేడ్ లో వచ్చాడు. జోసెఫ్ ను వేలంలో కొనుక్కున్నారు. ఈ సీజన్ లో వీరంతా దారుణమైన ఫాంలో ఉన్నారు కాబట్టే పక్కన పెట్టారు. సమంజసమే. కానీ అసలైన ప్రశ్న ఎక్కడ వస్తుందంటే.... వేలం సమయంలోనే సరైన స్ట్రాటజీతో మంచి ఆటగాళ్లను ఇంకా బెటర్ ప్రైస్ కు కొనుక్కోవచ్చు కదా అనే దగ్గర. 7 మ్యాచుల్లో 6 ఓటములతో ఈ సీజన్ కూడా ఆర్సీబీ హోప్స్ వదిలేసుకునే స్టేజ్ కు వచ్చేసింది.