Rohit Sharma Set for Television Debut: ఇండియ‌న్ క్రికెట్ దిగ్గజం, సిక్సర్ల మెషిన్ రోహిత్ శర్మ ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. కేవలం క్రికెట్ పిచ్‌కే పరిమితం కాకుండా టెలివిజన్ ప్రపంచంలోకి తన అరంగేట్రం ఖరారు చేశాడు. దీనికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టీజర్‌ను సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ (Sony TV) రిలీజ్ చేసింది. ఈ టీజర్ చూస్తుంటే రోహిత్ ఒక స్పెషల్ షోతో రాబోతున్నట్లు అర్థమవుతోంది. త్వరలోనే ఈ షో టైటిల్, కాన్సెప్ట్ గురించి మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు.

Continues below advertisement

Continues below advertisement

ఐపీఎల్ లో రోహిత్ జోరు..ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (MI) తరపున రోహిత్ శర్మ తన క్లాస్ చూపిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనే 55.25 సగటుతో 221 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 174.01 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తూ పాత రోహిత్ ను గుర్తు చేస్తున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా 7,267 పరుగులతో రికార్డుల్లో ఉన్నాడు. కెప్టెన్‌గా ముంబైకి ఐదు టైటిల్స్ అందించిన ఘనత కూడా అతనికే సొంతం.

రికార్డుల రారాజు..2007లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన రోహిత్, మూడు ఫార్మాట్లలో తిరుగులేని ప్లేయర్ గా ఎదిగాడు. ఓవరాల్ గా 508 మ్యాచ్‌ల్లో 20,109 పరుగులు సాధించాడు. ఇందులో 50 సెంచరీలు, 111 అర్థసెంచరీలు ఉన్నాయి. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలను కెప్టెన్ గా, ప్లేయర్ గా గెలిచిన అరుదైన రికార్డు రోహిత్ ఖాతాలో ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్ లో 4,231 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన రోహిత్, 2024 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

వన్డే వరల్డ్ కప్ పై కన్ను..ప్రస్తుతం రోహిత్ ఫోకస్ అంతా 2027లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే వేదికలుగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ మీద ఉంది. ఇందుకోసం అతను తన ఫిట్‌నెస్ ను భారీగా మెరుగుపరుచుకున్నాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడు రోహిత్. 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. టెస్టుల్లో కూడా 40కి పైగా సగటుతో 4,301 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు.

మీమ్ మెటీరియల్ టు టీవీ స్టార్..రోహిత్ కేవలం బ్యాటింగ్ తోనే కాదు, మైదానంలో తన హావభావాలు, స్టుంప్ మైక్ లో రికార్డ్ అయ్యే సరదా మాటలతో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. అతని కామెడీ టైమింగ్, సెటైర్లు నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. బహుశా ఇదే క్వాలిటీ అతన్ని ఇప్పుడు టీవీ షో వైపు నడిపించి ఉండొచ్చు. క్రికెట్ పిచ్ పై ప్రత్యర్థులను వణికించే హిట్‌మ్యాన్, ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.