Rohit Sharma Brutal Knock Vs LSG: ఐపీఎల్ (IPL 2026)లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన పోరులో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన క్లాస్ పవర్ ఏంటో చూపించాడు. గత కొన్ని మ్యాచులకు దూరంగా ఉన్న హిట్ మ్యాన్.. ప్లేయింగ్ ఎలెవన్ లోకి తిరిగి వచ్చిన వెంటనే విధ్వంసం సృష్టించాడు. అతని మెరుపు బ్యాటింగ్ ధాటికి లక్నో నిర్దేశించిన భారీ లక్ష్యం ముంబై ముందు చిన్నబోయింది.
రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్..ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు బ్యాటింగ్‌లోనే కాకుండా ఒక ప్లేయర్‌గా కూడా చాలా స్పెషల్. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ (276 మ్యాచులు)ని అధిగమించి, 277వ మ్యాచ్‌తో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం ఎంఎస్ ధోనీ 278 మ్యాచులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ ఈ సీజన్‌లో ఇంకా బరిలోకి దిగకపోవడంతో రోహిత్, కోహ్లీ ఇద్దరూ త్వరలోనే అతన్ని దాటే అవకాశం ఉంది.
ధోనినే ఇన్సిపిరేషన్..ముంబై ఇండియన్స్ స్పిన్నర్ రఘు శర్మ ప్రస్తుతం ఐపీఎల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అక్షత్ రఘువంశీని అవుట్ చేసిన తర్వాత అతను చూపించిన ఎమోషనల్ నోట్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు కారణాన్ని, తన కష్టతరమైన జర్నీని రఘు శర్మ తాజాగా వివరించాడు. తన లైఫ్ మారడానికి ఎంఎస్ ధోనీనే కారణమని అతను చెప్పుకొచ్చాడు.
Also Read: MI ప్లేయర్ రఘు శర్మ ఎమోషనల్ సెలబ్రేషన్.. వికెట్ తీశాక జేబులోంచి నోట్ తీసి ఏం చూపించాడంటే! LSGతో మ్యాచ్‌లో మిస్టరీ నోట్ వైరల్
ధోనీ సిక్సర్ - ఒక టర్నింగ్ పాయింట్.."ఇదంతా 2011 సమయంలో మొదలైంది. మా ఇంట్లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు ఉండటంతో నేను కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. కానీ అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడిని. సుమారు 102 కిలోల బరువు ఉండేవాడిని. 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో శ్రీలంకపై ధోనీ కొట్టిన ఆ విన్నింగ్ సిక్సర్ చూశాక నాకు క్రికెట్ పై విపరీతమైన ఆసక్తి కలిగింది. ఆ ఒక్క షాట్ నా ఆలోచనలను మార్చేసింది" అని రఘు తెలిపాడు.
తండ్రి హెచ్చరికలు - 21 ఏళ్ల వయసులో కెరీర్ ప్రారంభం..తను క్రికెట్ ఆడతానన్నప్పుడు తండ్రి కూడా సపోర్ట్ చేయలేదని రఘు గుర్తు చేసుకున్నాడు. "నువ్వు చాలా లావుగా ఉన్నావు, క్రికెట్ లో చాలా పరిగెత్తాల్సి ఉంటుంది, ఇది నీవల్ల కాదు అని మా నాన్న చెప్పారు. నేను క్రికెట్ నేర్చుకోవడం మొదలుపెట్టినప్పుడు నా వయస్సు 21 ఏళ్లు. అప్పటికే ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడే అవకాశాలన్నీ అయిపోయాయి. కానీ నా లక్ష్యంపై నాకు గురి ఉంది. దేవుడిపై నమ్మకం ఉంచి ప్రాక్టీస్ మొదలుపెట్టాను" అని రఘు ఎమోషనల్ అయ్యాడు.
Also Read: ముంబై రికార్డు ఛేజింగ్.. LSGపై ఘనవిజయం, సత్తా చాటిన రోహిత్, రికెల్టన్
రోజుకు 10 ఓవర్ల ప్రాక్టీస్..లెగ్ స్పిన్ బౌలింగ్ లో పట్టు సాధించడానికి రఘు శర్మ ఎంతో కష్టపడ్డాడు. వారంలో ఆరు రోజులు కేవలం బౌలింగ్ పైనే ఫోకస్ పెట్టేవాడు. ఇప్పటికీ అతను ప్రతిరోజూ కనీసం 10 ఓవర్ల పాటు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. నిరంతరం బౌలింగ్ చేయడం వల్లే మణికట్టు (Wrist) సహజంగా పని చేయడం మొదలవుతుందని అతను నమ్ముతాడు. ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ నుంచి కష్టపడే క్రికెటర్ గా మారడం వెనుక రఘు పడ్డ శ్రమ సామాన్యమైనది కాదు.
ముంబై ఇండియన్స్ తో ప్రయాణం..ముంబై ఇండియన్స్ టీమ్ రఘు శర్మను 2025లో రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఆ ఏడాది అతను కేవలం నెట్ బౌలర్‌గా మాత్రమే సేవలు అందించాడు. విఘ్నేష్ పుత్తూర్ గాయపడటంతో రిప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా మెయిన్ టీమ్ లోకి వచ్చాడు. 2025లో ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాకపోయినా, మేనేజ్మెంట్ అతనిపై నమ్మకంతో రిటైన్ చేసుకుంది. చివరకు 2026లో చెన్నై సూపర్ కింగ్స్ పై రఘు తన ఐపీఎల్ డెబ్యూ చేశాడు. రఘు శర్మ స్టోరీ చూస్తుంటే ఏ వయసులోనైనా కష్టపడితే అనుకున్నది సాధించవచ్చు అని అర్థమవుతోంది.
