Mumbai Indians In Qualifier 2: ముంబై ఇండియన్స్ జట్టు క్వాలిఫయర్-2కు చేరుకుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. అయితే అత్యంత విజయవంతమైన IPL జట్టు ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్‌లలో గెలిచి ఫైనల్‌కు చేరుకోగలదా? ముంబై ఇండియన్స్ గణాంకాలు ఏం చెబుతున్నాయి?
క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌కు గొప్ప రికార్డు
క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ ఆటతీరు అద్భుతంగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకు క్వాలిఫయర్-2లో మూడు సార్లు ఆడింది. ఇందులో రోహిత్ శర్మ జట్టు రెండు సార్లు విజయం సాధించగా, ఒకసారి ఓటమి చవిచూసింది.
ఐపీఎల్ 2011 క్వాలిఫయర్-2లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్‌పై 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ జరిగింది ముంబైలోని వాంఖడే స్టేడియంలో అయినప్పటికీ ముంబై ఇండియన్స్ 43 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీని తర్వాత ఐపీఎల్ 2013 క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తలపడింది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది. ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2017లో మూడోసారి క్వాలిఫయర్-2 ఆడింది. ఈసారి బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయం సాధించింది.
ఈ విధంగా క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించడం అంత సులువు కాదని గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇది గుజరాత్ టైటాన్స్‌కు శుభవార్త కాదు. ఎందుకంటే 2011 తర్వాత ముంబై ఇండియన్స్ ఇంతవరకు క్వాలిఫయర్ 2లో ఓడిపోలేదు.
ముంబయి ఇండియన్స్‌ను చూసి గర్విస్తున్నానని కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు. ఆటగాళ్లను ఎంతగానో ప్రశంసించాడు. గతేడాది చివరి ప్లేస్‌తో ముగించిన తాము.. ఇప్పుడు క్వాలిఫయర్-2కు చేరుకోవడం ఆనందంగా ఉందన్నాడు. ఆకాశ్ మధ్వాల్, నేహాల్ వధేరా స్పెషల్ కుర్రాళ్లని మెచ్చుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించాక మీడియాతో మాట్లాడాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగులో (IPL) అత్యంత విజయవంతమైన టీమ్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians). ఏకంగా ఐదు సార్లు ట్రోఫీ గెలిచింది. అయితే సరైన ఆటగాళ్లు లేకపోవడంతో చివరి సీజన్లో ఆఖరి స్థానానికి పరిమితమైంది. ఈ సారీ అలాగే కనిపించింది. జస్ప్రీత్ బుమ్రా కొన్ని నెలలుగా క్రికెట్‌కు దూరమయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వచ్చినా ఆడింది ఐదు మ్యాచులే. మళ్లీ మోచేతి గాయంతో ఇంగ్లాండ్ వెళ్లిపోయాడు. జే రిచర్డ్సన్ సైతం అందుబాటులో లేడు. ఒకట్రెండు మ్యాచులకు తిలక్ వర్మ అందుబాటులో లేడు. అయినప్పటికీ ముంబయి రెండో క్వాలిఫయర్‌కు చేరుకోవడం ప్రత్యేకం.
లీగ్ ఆరంభంలో వరుస మ్యాచుల్లో ఓడిపోయినప్పుడు ప్లేఆఫ్స్ గురించి ఆలోచించామని రోహిత్ శర్మ (Rohit sharma) అంటున్నాడు. 'అవును, ప్లేఆఫ్‌కు చేరుకుంటామో లేదో అనిపించింది. అయితే అన్ని అడ్డంకుల్ని అధిగమించాం. ఆటగాళ్లను చక్కగా మేనేజ్ చేశాం. చివరి సీజన్‌తో పోలిస్తే చాలా మెరుగవ్వాలని అనుకున్నాం. ఇందుకోసం బాగా కష్టపడాల్సి ఉంటుందని తెలుసు. అన్ని అడ్డంకుల్నీ ఎదుర్కొన్నాం. ఒక్కోసారి ప్లాఫ్ అవ్వొచ్చు. దానికీ సిద్ధంగా ఉన్నాను' అని హిట్‌మ్యాన్ చెప్పాడు.