Viral Video: జహీర్ తో తీవ్రంగా చర్చిస్తున్న రోహిత్.. ఇంతలో వెనకనుంచి హగ్ చేసుకున్న భారత స్టార్.. వీడియో వైరల్
అగ్రెషన్ కు మారు పేరుగా నిలిచిన రోహిత్.. ఈ సీజన్ లో ఇప్పటివరకు రాణించలేదు. 3 మ్యాచ్ లాడి కేవలం 21 పరుగులు మాత్రమే సాధించాడు. శుక్రవారం లక్నై సత్తా చాటాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు.
IPL 2025 Rohit Sharma Vs Rishabh Pant: రోహిత్ శర్మ కి కోపం వచ్చింది. మెంటార్ జహీర్ ఖాన్ తో చాలా తీవ్రంగా మాట్లాడుతుండగా, రిషభ్ పంత్ అతడిని హగ్ చేసుకున్న వీడియో వైరలైంది. అటు రోహిత్, ఇటు పంత్ అభిమానులు దీనిపై కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ వీడియలో ఏముందంటే.. నేనింత వరకు ఏం చేయాలో అది చేశానని, ఇకపై చేయడానికి ఏమీ లేదని జహీర్ తో రోహిత్ పేర్కొన్నాడు. ఇలా సీరియస్ గా మాట్లాడుతున్నప్పుడు, పంత్ వెళ్లి వెనకగా రోహిత్ ను హగ్ చేసుకున్నాడు. అంత కోపంలోనూ రిషబ్ ను చూసి రోహిత్ కూలయ్యాడు. అతనితో చిన్నగా చూపులు కలిపాడు. ఇక ఈ సీజన్ లో రోహిత్ ప్రాతినిథ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్, పంత్ ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇరుజట్లు చెరో మూడు మ్యాచ్ లాడి ఒక విజయం, రెండు పరాజయాలతో ఉన్నాయి. ఇక అటు పంత్, ఇటు రోహిత్ కూడా ఘోరంగా విఫలమయ్యారు.
21 రన్స్..
ఈ సీజన్ లో 3 మ్యాచ్ లాడి కేవలం 21 రన్స్ మాత్రమే రోహిత్ చేశాడు. అత్యధిక స్కోరు కేవలం 13 మాత్రమే కావడం విశేషం. ఇక గత కొంతకాలంగా ఐపీఎల్లో రోహిత్ అంత గొప్పగా ఏమీ రాణించడం లేదు. 2017 నుంచి చూసుకున్నట్లయితే కేవలం 2019, 2024లలో మాత్రమే తను 400+ పరుగుల మార్కును దాటాడు. 2019లో 15 మ్యాచ్ లాడి రెండు ఫిఫ్టీలతో405 రన్స్, గత సీజన్ లో 14 మ్యాచ్ లాడి ఒక సెంచరీ, ఒక ఫిఫ్టీతో 417 పరుగులు సాధించాడు. ఇక 2017 నుంచి 15 మంది ప్లేయర్లు 2500 పరుగులను సాధిస్తే,అందులో రోహిత్ ఒకరు. అయితే వీరందరిలో హిట్ మ్యాన్ రోహిత్ దే అత్యల్ప స్ట్రైక్ రేట్ 130 కావడం గమనార్హం.
నేడు లక్నోతో పోరు..
ఇక ఈ సీజన్ లోరెండు మ్యాచ్ ల తర్వాత ఆర్సీబీపై విజయం సాధించి, గెలుపుబాట పట్టిన ముంబై ఇండియన్స్..శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ లో గెలుపు ఇరుజట్లకు తప్పనిసరి. ముఖ్యంగా వరుసగా ఓడిపోతున్న లక్నో.. ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తోంది. అలాగే ముంబై కూడా తన గెలుపుమంత్రాన్ని అలాగే కొనసాగించాలని పట్టుదలగా ఉంది. ఇక రోహిత్, పంత్ లకు ఈ మ్యాచ్ లో రాణించడం తప్పనిసరి అని, కచ్చితంగా వీరిద్దరూ సత్తా చాటుతారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.