RCB Vs SRH, IPL 2022 LIVE: ఎనిమిది ఓవర్లలోనే ఖేల్ ఖతం - తొమ్మిది వికెట్లతో గెలిచిన రైజర్స్

ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABP Desam Last Updated: 23 Apr 2022 10:02 PM

Background

ఐపీఎల్ 2022లో శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. పాయింట్ల పట్టికలో బెంగళూరు మూడో స్థానంలో ఉండగా... రైజర్స్ ఐదో స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే సన్‌రైజర్స్ తిరిగి టాప్-4లోకి అడుగుపెట్టనుంది....More

RCB Vs SRH Live Updates: ఎనిమిది ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 72-1, తొమ్మిది వికెట్లతో విజయం

హర్షల్ పటేల్ వేసిన ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. అభిషేక్ శర్మ అవుటయ్యాడు. ఎనిమిది ఓవర్లలో హైదరాబాద్ స్కోరు 72-1 స్కోరును సాధించింది. తొమ్మిది వికెట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది.


కేన్ విలియమ్సన్ 16(17)
రాహుల్ త్రిపాఠి 7(3)
హర్షల్ పటేల్ 2-0-18-1
అభిషేక్ శర్మ (సి) అనూజ్ రావత్ (బి) హర్షల్ పటేల్ (47: 28 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, ఒక సిక్సర్)