RCB vs GT IPL 2024 Royal Challengers Bengaluru opt to bowl:  ఐపీఎల్(IPL) 2024లో 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌(GT)తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తలపడనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ   మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది. ఐపీఎల్‌ లీగ్‌ దశలో పుంజుకున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు... గుజరాత్‌ టైటాన్స్‌పై గెలిచి హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేయాలని పట్టుదలగా ఉంది.


ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని బెంగళూరు జట్టు.. చివరి రెండు మ్యాచ్‌లలో విజయాలు నమోదు చేసి ఆత్మవిశ్వాసంతో ఉంది. బ్యాటింగ్ లో  అందరూ రాణిస్తుండటంతో ఉత్సాహంగా ఉంది. అయినా కానీ రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ల నిలకడ లేమీ ఆ జట్టును వేధిస్తోంది. గత రెండు మ్యాచుల్లో బెంగళూరు బౌలర్లు రాణించినా ఈ సీజన్‌లోని గత మ్యాచుల్లో దారుణంగా విఫలమయ్యారు.  టీ 20ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించికున్న మహ్మద్ సిరాజ్ తన ఫామ్‌ను చాటుకోవల్సి ఉంది. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో యష్ దయాల్, స్వప్నిల్ సింగ్‌ మెరుగ్గా రాణించారు. లెగ్ స్పిన్నర్ కర్ణ్ శర్మ, పార్ట్ టైమ్ పేసర్ గ్రీన్ కూడా రాణించండం బెంగళూరుకు కాస్త ధైర్యంగా ఉంది. 


గుజరాత్ కి గెలుపు అవసరమే..


చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు బౌలర్లపై ఎదురుదాడికి దిగాలని గుజరాత్‌ టైటాన్స్‌ భావిస్తోంది. గుజరాత్‌ పద్ధతిగా అన్ని విభాగాల్లో సమష్టిగా విఫలమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ వరుసగా రెండు పరాజయాలను మూటగట్టుకుంది. శుభమన్ గిల్, భరద్వాజ్ సాయి సుదర్శన్ మాత్రమే మెరుగ్గా రాణిస్తున్నారు. ఒకవేళ  వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, విజయ్ శంకర్, షారుక్ ఖాన్ రాణిస్తే మాత్రం గుజరాత్‌కు తిరుగుండదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ గుజరాత్‌ 200 పరుగులు చేయకపోవడం వారి బ్యాటింగ్‌ బలహీనతలను బహిర్గతం చేస్తోంది. అయితే ఈ సారి అలా జరగకుండా చూడాలనే భావిస్తోంది గుజరాత్ర. బౌలింగ్ లో రషీద్ ఖాన్ పర్వాలేదనిపిస్తున్నాడు.  . మహ్మద్ షమీ లేకపోవడం టైటాన్స్‌ బౌలింగ్‌ను బలహీనపర్చింది.   అనుభవజ్ఞులైన ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ కూడా  అంచనాలను అందుకోలేకపోతున్నారు.


గత  రికార్డ్స్‌ ఏం చెబుతున్నాయి అంటే.. 
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఐపీఎల్‌లో ఇప్పటివరకూ 4 సార్లు మాత్రమే తలపడ్డాయి. ఈ 4 మ్యాచ్‌లలో గుజరాత్ 2 మ్యాచ్‌లు గెలవగా, బెంగళూరు రెండు మ్యాచుల్లో గెలిచి సమఉజ్జీలుగా ఉన్నాయి. 


గుజరాత్ తుది జట్టు:


శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్‌ ఖాన్‌, మానవ్‌ సుతార్‌, నూర్ అహ్మద్‌, మోహిత్ శర్మ, జోష్‌ లిటిల్.


 బెంగళూరు తుది జట్టు:


విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్‌ కార్తీక్, స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్‌ సిరాజ్, యశ్ దయాల్‌, విజయ్‌కుమార్ వైశాఖ్.