RCB vs DC  Delhi Capitals opt to bowl: ఐపీఎల్‌( IPL)ఇది మరో ఆసక్తికర సమరం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో ఢిల్లీ క్యాపిటల్స్(DC) తలపడనుంది. టాస్ గెలిచిన అక్షర్‌ పటేల్‌ సారధ్యంలోని  ఢిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. పంత్‌ లేకపోవడం... బెంగళూరుకు తప్పకుండా అడ్వాంటేజ్‌ కానుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి మంచి టచ్‌లో కనిపిస్తున్న బెంగళూరును... పంత్‌లేని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎంతవరకు అడ్డుకోగలదో చూడాలి. 


రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ప్రస్తుతం 12 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. చివరి నాలుగు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించిన బెంగళూరు... ప్లే ఆఫ్‌కు చేరే ఏ అవకాశాన్ని వదులుకోకూడదని పట్టుదలగా ఉంది. వరుస విజయాలతో బెంగళూరు ఆత్మవిశ్వాసం పెరిగింది. విరాట్ కోహ్లీ నేతృత్వంలో బెంగళూరు బ్యాటంగ్‌ ఇప్పుడు బలంగా కనిపిస్తోంది. అయితే  బౌలింగ్ విభాగంలో మాత్రం బెంగళూరు కంటే ఢిల్లీ కాస్త బలంగా ఉంది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్‌ చేస్తున్నారు. పేసర్లు ఖలీల్ అహ్మద్  14 వికెట్లు, ముఖేష్ కుమార్ 15 వికెట్లతో పర్వాలేదనిపిస్తున్నారు. అందుకే చిన్నస్వామి స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌కు స్వర్గధామంగా ఉంటుందని తెలిసినా ధైర్యంగా బ్యాటింగ్ ఎంచుకున్నాది ఢిల్లీ. ఈ సీజన్‌లో మెరుపురు మెరిపిస్తున్న ఢిల్లీ ఓపెనర్‌ మెక్‌గర్క్‌ పవర్‌ ప్లే వరకూ క్రీజులో నిలిచినా బెంగళూరు బౌలర్లకు తిప్పలు తప్పవు. మెక్‌గర్క్ 235.87 స్ట్రైక్ రేట్‌తో ఏడు మ్యాచ్‌ల్లో 309 పరుగులు చేశాడు. డేవిడ్ వార్నర్ 7 మ్యాచ్‌ల్లో 135 స్ట్రైక్ రేట్‌తో 167 పరుగులు చేశాడు. అభిషేక్ పోరెల్ కూడా 157 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేస్తున్నాడు. పంత్, ట్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి టచ్‌లో ఉన్నారు. అయితే పంత్‌ ఈ మ్యాచ్‌కు దూరం కావడం ఢిల్లీని దెబ్బ తీసింది.


గత రికార్డులు
ఢిల్లీ క్యాపిటల్స్‌-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకూ 30 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో  బెంగళూరు 19 మ్యాచుల్లో విజయం సాధించింది. ఢిల్లీ 10 మ్యాచుల్లో గెలిచింది. ఇందులో ఓ సూపర్‌ ఓవర్‌ విజయం కూడా ఉంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన సూపర్‌ ఓవర్‌ మ్యాచ్‌లో బెంగళూరు గెలిచింది. ఒక్క మ్యాచుల్లో ఫలితం రాలేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కోహ్లీ 1030 పరుగులు చేశాడు. కింగ్‌ కోహ్లీ తర్వాత ఏబీ డివిలియర్స్ (690), రిషబ్ పంత్ (421) ఉన్నారు. బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ అత్యధిక వికెట్లు (15), కగిసో రబడ (13), హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్ 12 వికెట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.