RCB vs CSK IPL 2023 RCB Innings : ప్లే ఆఫ్‌ చేరాలంటే తప్పక భారీ విజయం సాధించాల్సిన దశలో బెంగళూరు బ్యాటర్లు(RCB) జూలు విదిల్చారు. వరుణుడు కరుణించిన వేళ చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)పై బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరాలంటే చెన్నైను 200 పరుగులకే పరిమితం చేయాల్సి ఉంది. ఈ దశలో భారమంతా బెంగళూరు బౌలర్లపైనే ఉంది. ఈ దశలో చెన్నై ప్లే ఆఫ్‌కు చేరుతుందా.. లేక చెన్నైను కట్టడి చేసి బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరుతుందో చూడాలి.


రాణించిన బ్యాటర్లు

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌... బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కీలకమైన మ్యాచ్‌లో బెంగళూరు టాపార్డర్‌లోని బ్యాటర్లు అందరూ రాణించారు. తొలి వికెట్‌కు బెంగళూరు ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ-ఫాఫ్‌ డుప్లెసిస్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ మంచి టచ్‌లో కనిపించాడు. ఆరంభం నుంచే కోహ్లీ ధాటిగా బ్యాటింగ్‌ చేసి చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. శార్దూల్‌ ఠాకూర్‌ వేసిన రెండో ఓవర్‌లో 16 పరుగులు పరుగులు వచ్చాయి. దేశ్‌పాండే బౌలింగ్‌లో మంచి సిక్స్‌ కొట్టిన కోహ్లీ భారీ స్కోరుకు బాటలు వేశాడు. బెంగళూరు ఇన్నింగ్స్‌లో స్కోరు మూడు ఓవర్లకు 31 పరుగులు చేసిన దశలో వర్షం పడడంతో కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత వరుణుడు కరుణించడంతో ఆట మళ్లీ ప్రారంభమైంది. పవర్‌ ప్లే ముగిసే సరికి బెంగళూరు ఒక్క వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. తొమ్మిది ఓవర్లకు 71 పరుగులు చేసింది. పది ఓవర్లకు 78 పరుగులు ఉన్నప్పుడు బెంగళూరు తొలి వికెట్‌ కోల్పోయింది. 29 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సులతో 47 పరుగులు చేసి విరాట్‌ కోహ్లీ అవుటయ్యాడు. శాంట్నర్‌ బౌలింగ్‌లో కోహ్లీ అవుటయ్యాడు. కోహ్లీ అవుటైన తర్వాత డుప్లెసిస్‌తో జత కలిసిన రజత్‌ పాటిదార్‌ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. 39 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 54 పరుగులు చేసిన డుప్లెసిస్‌... దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. రజత్‌ పాటిదార్‌ కొట్టిన బంతి బౌలర్‌ చేతికి తగిలి వికెట్లకు తగలడంతో డుప్లెసిస్‌ పెవిలియన్‌ చేరాడు. 15 ఓవర్లకు బెంగళూరు 138 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయి పటిష్టంగా కనిపించింది.

 

పాటిదార్‌-గ్రీన్‌ భాగస్వామ్యం

కోహ్లీ-డుప్లెసిస్‌ అవుటైన తర్వాత రజత్‌ పాటిదార్‌-కామెరూన్‌ గ్రీన్‌ బెంగళూరు స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. 23 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి రజత్‌ పాటిదార్‌ అవుటయ్యాడు. రజత్‌ పాటిదార్‌... శార్దూల్‌ ఠాకూర్ అవుట్‌ చేశాడు.  రజత్‌ పాటిదార్‌ అవుటైనా కామెరూన్‌ గ్రీన్‌ ధాటిగా ఆడాడు. 17  బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో గ్రీన్ 38  పరుగులు చేశాడు. దినేశ్‌ కార్తిక్‌ ఆరు బంతుల్లో 14 పరుగులు చేశాడు. బెంగళూరు టాపార్డర్‌ రాణించడంతోబెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ప్లే ఆఫ్‌కు చేరాలంటే చెన్నైను 200 పరుగులకే పరిమితం చేయాల్సి ఉంది.