Chennai Super Kings opt to bowl: ఐపీఎల్‌(IPL)లో  ఈరోజు  మహా సమరం జరగనుంది. ఐపీఎల్‌లో మిగిలి ఉన్న ఏకైక ప్లే ఆఫ్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు చెన్నై సూపర్‌కింగ్స్‌(CSK)-రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు హోరాహోరీ పోరాదనున్నాయి. తలపడనున్నాయి. ప్లే ఆఫ్‌ చేరాలని గంపెడు ఆశలు పెట్టుకున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్  బౌలింగ్‌ ఎంచుకున్నాడు.  ఈ సంగ్రామానికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక కానుంది. 


బెంగళూరు గెలుపు ఎలా ఉండాలంటే ..

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. బెంగళూరు జట్టుకు మాత్రం నెట్ రన్‌ రేట్‌ కీలకంగా మారనుంది. చెన్నైపై బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి, అదే రెండోసారి బ్యాటింగ్ చేస్తే 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించాలి. అంటే 18.1 ఓవర్లలోనే చెన్నైను బెంగళూరు ఆలౌట్ చేయాలి. 18 పరుగుల లోపు తేడాతో ఓడిపోయినా చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే గనుక ఇరు జట్ల ఖాతాలో చెరో పాయింట్ చేరుతుంది. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ముందుకెళ్తుంది. బెంగళూరు మరోసారి లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. మ్యాచ్‌ పూర్తిగా 20 ఓవర్లపాటు జరిగితే చెన్నై ముందు బెంగళూరు 200 పరుగుల లక్ష్యం పెట్టి... రుతురాజ్‌ సేనను 182కే కట్టడి చేయాలి. 5 ఓవర్ల గేమ్‌ జరిగినప్పుడు బెంగళూరు 80 పరుగులు చేస్తే.. చెన్నైను 62కే పరిమితం చేయాలి. బెంగళూరు రెండోసారి బ్యాటింగ్‌ చేస్తే చెన్నై నిర్దేశించిన లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే పూర్తి చేయాలి. 19 ఓవర్ల మ్యాచ్‌ అయితే 17.1 ఓవర్లలోనే ఛేదన జరగాలి. 

 

కోహ్లీ కొడితే పండగే .. 

ప్రస్తుతం ప్లేఆఫ్‌లకు కేవలం ఒక స్థానం మాత్రమే మిగిలి ఉంది. అధికారికంగా మూడు జట్లు ప్లే ఆఫ్‌ రేసులో ఉన్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీలో ఉన్నాయి.  కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో నెట్ రన్ రేట్‌ దారుణంగా ఉండడంతో ప్లే ఆఫ్‌ చేరడం దాదాపు అసాధ్యం. ఇక చెన్నై-బెంగళూరు మధ్యే పోరు జరగనుంది. ప్రస్తుతం చెన్నై ఖాతాలో 14 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.528గా ఉంది. అదే ఆర్సీబీ విషయానికి వస్తే.. ఆ జట్టు ఖాతాలో 12 పాయింట్లు ఉండగా.. నెట్ రన్ రేట్ + 0.387గా ఉంది. ఈ డూ-ఆర్-డై మ్యాచ్‌లో ఈ రెండు జట్లు ఏం చేస్తాయన్నది కీలకంగా మారింది. మ్యాచ్‌లో ఎవరు గెలిచినా అభిమానులకు మాత్రం ఇది పూర్తి వినోదాన్నిపంచనుంది.

 

చెన్నై సూపర్‌ కింగ్స్‌ తుది జట్టు

రచిన్ రవీంద్ర, రుతురాజ్‌ గైక్వాడ్ (కెప్టెన్), డారిల్ మిచెల్, అజింక్య రహానె, రవీంద్ర జడేజా, ధోనీ (వికెట్ కీపర్), మిచెల్ శాంట్నర్‌, శార్దూల్ ఠాకూర్, తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జిత్ సింగ్, మహీశ్ తీక్షణ. 

 

బెంగళూరు తుది జట్టు 

ఫాఫ్‌ డుప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటిదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లామ్రోర్, దినేశ్‌ కార్తిక్‌ (వికెట్ కీపర్), కర్ణ్‌ శర్మ, యశ్‌ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్‌ సిరాజ్.