RCB Postpone Title Celebrations In Bengaluru: ఐపీఎల్ లో వరుసగా రెండోసారి ట్రోఫీ గెలిచి హిస్టరీ క్రియేట్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్యాన్స్ కు ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. అహ్మదాబాద్ లో టైటిల్ గెలిచిన తర్వాత టీమ్ మొత్తం సెలబ్రేషన్స్ కోసం బెంగళూరు సిటీకి రావడం లేదు. ప్లేయర్స్, సపోర్ట్ స్టాఫ్ అంతా అహ్మదాబాద్ నుంచి డైరెక్ట్ గా తమ సొంత ఇళ్లకు, హాలిడే ట్రిప్స్ కు వెళ్తున్నట్లు ఆర్‌సీబీ డైరెక్టర్ మో బోబాట్ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించాడు. తను యూకే వెళ్తున్నానని, హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ హాలిడే ప్లాన్ చేసుకున్నాడని, కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా ఇంటికి వెళ్తున్నాడని తెలిపాడు. అందువల్ల బెంగళూరు ఫ్యాన్స్ తో కలిసి సక్సెస్ ఎంజాయ్ చేయడానికి మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని అతడు స్పష్టం చేశాడు.
అండర్‌అచీవర్స్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఛాంపియన్స్
ఒకప్పుడు స్టార్ ప్లేయర్స్ ఉన్నా కప్ గెలవలేక ‘అండర్‌అచీవర్స్’ గా ముద్రపడిన ఆర్‌సీబీ, 2025 నుంచి కంప్లీట్ గా మారిపోయింది. ఐపీఎల్ హిస్టరీ లో వరుసగా రెండుసార్లు టైటిల్ గెలిచిన మూడో టీమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సడన్ చేంజ్ వెనుక ఎలాంటి క్రేజీ సైనింగ్స్ లేవు, కేవలం డేటా, ఎవిడెన్స్ ఆధారంగా తీసుకున్న డెసిషన్స్ మాత్రమే ఉన్నాయి. లీడ్ అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ అందించిన డేటా అనలిటిక్స్ ఈ సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశాయి. కేవలం నంబర్స్ మాత్రమే కాకుండా నిపుణుల అంచనాలు, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్ల గట్ ఫీలింగ్, టాక్టికల్ మైండ్ ను బ్యాలెన్స్ చేస్తూ టీమ్ ను నడిపినట్లు మో బోబాట్ వివరించాడు.
డేటా మ్యాజిక్ తో పేస్ బౌలింగ్ ను ఉతికేసిన కెప్టెన్ రజత్
ఈ సీజన్ లో ఆర్‌సీబీ సక్సెస్ కు కెప్టెన్ రజత్ పాటిదార్ బ్యాటింగ్ లో తెచ్చిన బిగ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఒక మెయిన్ రీజన్. గతంలో కేవలం స్పిన్ బాషర్ గా గుర్తింపు తెచ్చుకున్న పాటిదార్, ఈ ఏడాది పేస్ బౌలింగ్ పై సూపర్బ్ అటాక్ చేశాడు. 2025 లో పేసర్లపై కేవలం 190 రన్స్ చేసిన రజత్, 2026 లో ఏకంగా 62.8 యావరేజ్, 189 స్ట్రైక్ రేట్ తో 377 రన్స్ బాదాడు. ఇందులో 28 సిక్సర్లు ఉన్నాయి. అనలిస్ట్ ఫ్రెడ్డీ వైల్డ్ ఇచ్చిన వీడియోలు, బౌలర్ల హ్యాండ్ మూవ్‌మెంట్స్ అనాలసిస్ తనకు ఎంతగానో హెల్ప్ అయ్యాయని, ఆ క్రెడిట్ అంతా ఫ్రెడ్డీకే ఇస్తున్నానని పాటిదార్ స్పష్టం చేశాడు.
రషీద్, నరైన్ లపై కన్ను..
రషీద్ ఖాన్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి లాంటి డేంజరస్ స్పిన్నర్లు చేతి నుంచి బాల్ ను ఎలా రిలీజ్ చేస్తున్నారో రీడ్ చేయడంలో తనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయని పాటిదార్ చెప్పాడు. ఆ టైమ్ లో తాను ఫ్రెడ్డీ వైల్డ్ కు కాల్ చేసి హెల్ప్ అడిగానని, అతడు బౌలర్ల వేరియేషన్స్ ను క్లియర్ గా ఎక్స్ ప్లేన్ చేశాడని తెలిపాడు. ఈ విధంగా హ్యూమన్ జడ్జ్‌మెంట్, మెషిన్ డేటా రెండింటినీ పర్ఫెక్ట్ గా వాడుకోవడం వల్లే ఆర్‌సీబీ ఈరోజు బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ ట్రోఫీలను ముద్దాడగలిగింది.
