IPL 2026 Flop Playing XI Announced With Big Namesఫ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన గ్రాండ్ ఫైనల్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐదు వికెట్ల తేడాతో గెలిచి టైటిల్ ను డిఫెండ్ చేసుకుంది. ఈ సీజన్ లో ఎంతో మంది ప్లేయర్స్ సూపర్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నా, కొందరు స్టార్ క్రికెటర్లు మాత్రం భారీ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా ఫెయిలయ్యారు. ఫ్యాన్స్ ను నిరాశపరిచిన అలాంటి ఆటగాళ్లతో ఒక ఫ్లాప్ ప్లేయింగ్ ఎలెవన్ టీమ్ ను రెడీ చేశారు. ఈ లిస్టులో టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా రుతురాజ్ గైక్వాడ్, అజింక్య రహానే, నికోలస్ పూరన్ నిలిచారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ 14 ఇన్నింగ్స్ లో కేవలం 337 రన్స్ చేయగా, కేకేఆర్ ప్లేయర్ రహానే 335 రన్స్ మాత్రమే చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) భారీ ఆశలు పెట్టుకున్న పూరన్ 14 ఇన్నింగ్స్ లో 18 యావరేజ్ తో 234 రన్స్ కే పరిమితమయ్యాడు.

Continues below advertisement

Read Also: RCB IPL victory 2026: ఆర్సీబీ 'రాయల్‌' విక్టరీతో కొత్త బాసులకు కాసుల పంట! అమాంతం పెరిగిన బ్రాండ్ వాల్యూ!

Continues below advertisement

ఫ్లాప్ టీమ్ కు రిషభ్ పంత్ కెప్టెన్..

ఈ చెత్త రికార్డ్ టీమ్ కు లక్నో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. ఈ సీజన్ లో ఘోరమైన ఫెయిల్యూర్ తర్వాత అతడు లక్నో కెప్టెన్సీ కి కూడా రాజీనామా చేశాడు. పంత్ 13 ఇన్నింగ్స్ లో 312 రన్స్ చేయగా, అతడి లీడర్ షిప్ లో లక్నో టీమ్ పాయింట్ల టేబుల్ లో లాస్ట్ ప్లేస్ లో నిలిచింది. ముంబై ఇండియన్స్ (MI) స్టార్స్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా కూడా ఈ లిస్టులో ఉన్నారు. సూర్యకుమార్ 13 ఇన్నింగ్స్ లో కేవలం 270 రన్స్ చేశాడు. హార్దిక్ పాండ్యా 10 ఇన్నింగ్స్ లో 206 రన్స్ చేయడంతో పాటు బౌలింగ్ లో 11.42 ఎకానమీతో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు.

Read Also: Gujarat Titans Bus Caught on Fire: ఐపీఎల్ ఫైనల్ తరువాత జీటీ బస్సులో మంటలు.. ప్లేయర్లకు తప్పిన ప్రమాదం, గంటసేపు రోడ్డుపైనే.. 

 గ్రీన్ దారుణ ఫెయిల్యూర్.. అక్షర్ తడబాటు

ఐపీఎల్ 2026 వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఏకంగా రూ. 25.20 కోట్ల రికార్డ్ ప్రైస్ పెట్టి కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ ఈ సీజన్ లో బిగ్గెస్ట్ డిసపాయింట్‌మెంట్ గా నిలిచాడు. అతడు 14 ఇన్నింగ్స్ లో 322 రన్స్ చేసి, బౌలింగ్ లో 10 కంటే ఎక్కువ ఎకానమీతో కేవలం 7 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా తన టీమ్ లాగే ఘోరంగా ఇబ్బంది పడ్డాడు. అతడు 13 ఇన్నింగ్స్ లో 32.72 యావరేజ్ తో 11 వికెట్లు తీసి, బ్యాటింగ్ లో 11 ఇన్నింగ్స్ లో కేవలం 173 రన్స్ మాత్రమే చేయగలిగాడు.

లిస్టులో జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్.. ఇంపాక్ట్ ప్లేయర్లుగా రోహిత్ శర్మ

ఈ ఫ్లాప్ టీమ్ లో ముంబై ఇండియన్స్ లెజెండరీ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఉండటం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. బుమ్రా 13 మ్యాచుల్లో 102.50 దారుణమైన యావరేజ్ తో కేవలం 4 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. ముంబైకే చెందిన మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ 5 మ్యాచుల్లో 2 వికెట్లు తీసి 11.62 ఎకానమీతో భారీగా రన్స్ ఇచ్చాడు. లక్నో లెగ్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠి 10 మ్యాచుల్లో 5 వికెట్లు తీసి రిథమ్ కోల్పోయాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ల ఆప్షన్స్ లో రోహిత్ శర్మ (283 రన్స్), జితేష్ శర్మ (116 రన్స్), డెవాల్డ్ బ్రెవిస్ (151 రన్స్), హర్షల్ పటేల్ (0 వికెట్లు), కుల్దీప్ యాదవ్ (10 వికెట్లు) నిలిచారు.