IPL 2026 Most Sixes Conceded By Bowlers: దాదాపు రెండున్నర నెలలపాటు సాగిన ఐపీఎల్ చాలా మందికి మాజాను పంచింది. అనేక రికార్డులను కొల్లగొడుతూ, ఈ సీజన్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇక ఈ సీజన్ లో ఎంతో మంది ప్రతిభావంతులు తమకు లభించిన అవకాశాలను గ్రాబ్ చేసుకున్నారు. మరికొంతమంది మాత్రం కొన్ని విషయాల్లో జట్టుకు భారంగా మారిపోయారు. ఇక కొంతమంది బౌలర్లు మంచినీళ్లు తాగినంత సులభంగా సిక్సర్లు సమర్పించుకున్నారు. అత్యధిక సిక్సర్లు సమర్పించుకున్న అన్‌వాంటెడ్ లిస్ట్ లో ఐదో స్థానంలో ఉన్న మహ్మద్ సిరాజ్ 2022 సీజన్ లో ఆర్‌సీబీ తరఫున ఆడుతూ 31 సిక్సర్లు ఇచ్చాడు. ఆ సీజన్ లో 15 మ్యాచ్ లలో కేవలం 9 వికెట్లే పడగొట్టి 10.07 ఎకానమీతో పరుగులు సమర్పించుకున్నాడు. ఆ సమయంలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లలో ఎక్కువ పరుగులు సమర్పించుకోవడంతోపాటు, సిక్సర్లను కూడా ఇచ్చాడు. ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. ఇక గుజరాత్ టైటాన్స్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 2025 సీజన్ లో 33 సిక్సర్లు సమర్పించుకుని, ఈ లిస్ట్ లో నాలుగో స్థానంలో నిలిచాడు. ఆ సీజన్ లో 15 మ్యాచ్ లాడిన రషీద్ కేవలం 9 వికెట్లు మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు.
కంబోజ్ ఊదరగొట్టినా తప్పని బాదుడు..చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్షుల్ కంబోజ్ ఐపీఎల్ 2026 సీజన్ లో సీఎస్‌కే తరఫున అత్యధికంగా 21 వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే 10.52 ఎకానమీతో పరుగులు ఇస్తూనే ఏకంగా 34 సిక్సర్లు సమర్పించుకుని ఈ జాబితాలో మూడో స్థానం లో నిలిచాడు. గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఐపీఎల్ 2026 సీజన్ లో 21 వికెట్లతో ఇంప్రూవ్ అయినప్పటికీ, బ్యాటర్లు అతని బౌలింగ్ లో ఏకంగా 36 సిక్సర్లు బాదారు. దీంతో ఐపీఎల్ హిస్టరీలోనే ఒకే సీజన్ లో ఎక్కువ సిక్సర్లు ఇచ్చిన రెండో బౌలర్ గా రషీద్ నిలిచాడు.
పర్పుల్ క్యాప్ తో పాటు చెత్త రికార్డుగుజరాత్ టైటాన్స్ పేసర్ కాగిసో రబడా ఐపీఎల్ 2026 సీజన్ లో 29 వికెట్ల తో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. కెరీర్ లో రెండోసారి లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచిన రబడా, అదే టైమ్ లో ఒక అన్‌వాంటెడ్ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ సీజన్ లో బ్యాటర్లు అతని లైన్ అండ్ లెంగ్త్ ను టార్గెట్ చేస్తూ ఏకంగా 40 సిక్సర్లు బాదారు. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే సీజన్ లో అత్యధిక సిక్సర్లు ఇచ్చిన బౌలర్ గా రబడా టాప్ ప్లేస్ లో నిలిచాడు. బ్యాటర్ల డామినేషన్ లో బౌలర్లు ఎలా నలిగిపోయారో ఈ గణాంకాలు స్పష్టం చేశాయి.
