CSK Vs RCB: చెపాక్‌లో చెన్నై ఫ్యాన్స్ సైలెంట్- ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆర్సీబీ
CSK Vs RCB: బెంగళూరు ప్లేయర్స్ సీఎస్‌కే ఫ్యాన్స్‌ను సైలెంట్ చేశారు. 17 ఏళ్ల తర్వాత చెన్నై గడ్డపై విజయం సాధించారు. అల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. బెంగళూరు 50 పరుగుల తేడాతో విజయం సాధించింది

CSK Vs RCB:లెక్కలన్నీ చెన్నైకు అనుకూలమని అన్నారు. పిచ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తుందని విశ్లేషణలు చేశారు. అనుకున్నట్టుగానే బెంగళూరు టాస్ ఓడిపోయింది. మొదట బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ ఓవర్ పడిన తర్వాత కానీ చెన్నై ఫ్యాన్స్‌కు అర్థం కాలేదు. ఇవాళ బెంగళూరుకు కలిసి వస్తుందని. వేసి మొదటి బంతి నుంచి బెంగళూరు బ్యాటర్లు చివరి వరకు బాదుతూనే ఉన్నారు. ఆర్సీబీ ఇన్నింగ్స్ స్లోగా ఆడింది ఎవరైనా ఉన్నారంటే అది క్లోహీ యే.
చెన్నైలో సీఎస్‌కేపై బెంగళూరు గెలిచి 17 ఏళ్లు అయింది. 2008 ఒకసారి గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయం సాధించలేదు. దీంతో ఇవాళ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. ఇరు జట్లు కూడా వ్యూహంతో ఫీల్డ్‌లోకి దిగారు. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరుకు సాల్ట్ మంచి ఓపెనింగ్ ఇచ్చాడు. ఉన్నంత సేపు కూడా చెన్నైలకు చుక్కలు చూపించాడు. తన ఇన్నింగ్స్‌లో ఒక సిక్స్ ఐదు ఫోర్లతో 16 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు. తర్వాత ధోని అద్భుతమైన స్టంపింగ్‌తో సాల్ట్‌ను అవుట్ చేశాడు.
తర్వాత వచ్చిన దేవదత్త పడికల్ కూడా మెరుపులు మెరిపించాడు. రెండు సిక్స్‌లు రెండు ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. 14 బంతుల్లో 27 పరుగులు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన రజత్ పాటిదార్ అద్భుతమైన కెప్టెన్ ఇన్నింగ్స ఆడాడు. 32 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఎక్కడా రన్‌రేట్ తగ్గకుండా సీఎస్కే బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్‌లు బాదాడు.
ఇంత కీలకమైన మ్యాచ్‌లో కోహ్లీ మాత్రం నిరాశ పరిచాడు. 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. ఇందులో ఒక సిక్స్ రెండే ఫోర్లు ఉన్నాయి. ఇన్నింగ్స్ మొదటి నుంచి కూడా ఇబ్బంది పడుతూనే ఆడాడు.
ఆఖరిలో వచ్చిన టీమ్ డేవిడ్ మాత్రం బౌలర్లను భయపెట్టాడు. మూడు సిక్స్‌లు, ఒక ఫోర్ సహాయంతో కేవలం 8 బంతుల్లోనే 22 పరుగులు చేశాడు. 197 పరుగుల లక్ష్యం చెన్నైకు ఇవ్వడంతో డేవిడ్‌ది కీలకమైన పాత్రగా చెప్పుకోవచ్చు. చెపాక్ స్టేడియంలో యావరేజ్ స్కోరు 170 పరుగులే. అంత టఫ్ పిచ్‌లో కూడా బెంగళూరు 196 చేసింది అంటే ఎంత ప్లానింగ్‌తో విరుచుకుపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
197 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నైకు ఆదిలోనే పెద్ద దబ్బ తగిలింది. రెండోఓవర్‌లోనే రెండు వికెట్లు కోల్పోయింది. రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్‌ను రెండు బంతుల వ్వవధిలో జోష్ హాజెల్‌వుడ్ అవుట్ చేశాడు. అలా మొదలైన చెన్నై పతనం ఎక్కడా కోలుకోలేదు. రన్ రేట్ పెరిగిపోతూ వచ్చింది. కాసేపు శివమ్ దూబే పోరాడినా ప్రయోజనం లేకపోయింది.
బ్యాటింగ్‌తో అదరగొట్టిన ధోనీ
ఓడిపోతున్నామన్న నిరాశలో ఉన్న చెన్నై ఫ్యాన్స్ రెండు సిక్స్‌లతో అలరించాడు. వెళ్లిపోతున్న క్రౌడ్ ఒక్కసారిగా ఆగిపోయారు. 16 బంతుల్లో 30 పరుగులు చేశాడు. చెన్నైలో ధోనియే అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేశాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు ఫోర్లు రెండు సిక్స్‌లు ఉన్నాయి. చివరకు 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146పరులుగు మాత్రమే చేసింది. దీంతో బెంగళూరు 50 రన్స్‌తో విజయం సాధించింది.
ఆది నుంచి బెంగళూరు దూకుడు
బెంగళూరు ఈ మ్యాచ్‌ను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఏ ఛాన్స్‌ను వదులుకోకుండా విజయం దిశగా పయనిస్తే... చెన్న ప్లేయర్లు మాత్రం చాలా తప్పిదాలు చేశారు. వాళ్లు వదిలేసిన క్యాచ్‌లే మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. బెంగళూరు ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించిన పాటిదార్‌కు చాలా లైఫ్‌లు ఇచ్చారు. కోహ్లీ రన్ అవుట్ మిస్ చేశారు. విరాట్ క్యాచ్‌ను కూడా మిస్ చేశారు. ఇన్నింగ్స్ మొత్తంలో నాలుగైదు క్యాచ్‌లు డ్రాప్ చేసింది చెన్నై.
ఎక్కడైనా చెన్నై ఆడుతుంది అంటే ఫ్యాన్స్ సందడి మామూలుగా ఉండదు. ఇవాల్టి మ్యాచ్‌లో మాత్రం ఆ సందడికి కనిపించలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో గోల గోల చేసిన సీఎస్కే ఫ్యాన్స్ తర్వాత సైలెంట్ అయిపోయారు. వాళ్లు సైలెంట్ అయిపోయారని అనడం కంటే... బెంంగళూరు ఆటగాళ్లు సైలెంట్ చేశారని చెప్పవచ్చు. మొదటి నుంచి చైన్నైపై డామినేట్ చేసి 17 ఏళ్ల తర్వాత అద్భుత విజయాన్ని అందుకున్నారు.