MS Dhoni Stumping: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో ధోని తన మార్క్ మ్యాజిక్ మరోసారి చూపించాడు. మెరపు వేగంతో చేసిన ఈ స్టంపింగ్‌తో పీడీ సాల్ట్‌ను అవుట్ చేశాడు. చెన్నైతో మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేస్తున్న ఆర్సీబీ మొదటి బంతి నుంచే వీరబాదుడుకే మొగ్గు చూపించింది. బెంగళూరు ఇన్నింగ్స్ ప్రారంభించిన సాల్ట్‌, కోహ్లీ ధాటిగా ఆడటం స్టార్ట్ చేశారు. ఓవైపు కోహ్లీ నెమ్మదిగా ఆడుతుంటే సాల్ట్ మాత్రం బంతులను బౌండరీలకు తరలించడమే పనిగా పెట్టుకున్నాడు. కోహ్లీకి స్ట్రైకింగ్ ఇవ్వకుండానే మొదటి పది బంతులు ఆడాడు. ప్రమాదకరంగా మారుతున్న సాల్ట్‌పై నూర్‌ అహ్మద్‌కు బంతి ఇచ్చాడు చెన్నై కెప్టెన్ రుతురాజ్‌గైక్వాడ్.

నూర్ బౌలింగ్‌లో కూడా భారీ షాట్లకు యత్నించిన సాల్ట్‌ విఫలమయ్యాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టాడు. ఆరో బంతికి రెండు మూడు ఇంచ్‌ల బయటకు వెళ్లి కొట్టే ప్రయత్నం చేశాడు. అక్కడే ధోని తన మార్క్ స్టంపింగ్‌తో సాల్ట్‌కు షాక్ ఇచ్చాడు. మెరుపు వేగం కంటే ఫాస్ట్ స్టంపింగ్ చేశాడు. థర్డ్ అంపైర్ దాన్ని అవుట్‌గా చూపించాడు. దీంతో 45 పరుగుల వద్ద బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. 16 బంతులకే 32 పరుగులు చేసిన సాల్ట్‌ డగౌట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఆయన స్కోర్‌లో ఐదు ఫోర్లు ఉంటే ఒక సిక్స్ ఉంది. 

ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా ధోనీ ఇలాంటి మ్యాజిక్ చేశాడు. సూర్యకుమార్‌ అలా క్రీజ్‌ నుంచి బయటకు వెళ్లాడో లేదో స్టంప్స్ గిరాటు వేశాడు. గత ఆదివారం చెన్నై వేదికగానే ఈ మ్యాచ్‌కు కూడా జరిగింది. కేవలం 0.12 సెకన్లలో ధోనీ వికెట్లు కొట్టేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ షాక్ అయ్యాడు. 

MS Dhoni స్టంపింగ్ ఎప్పుడూ స్పెషలే. ఇక్కడ ఆర్సీబీ కీలక భాగస్వామ్యం బిల్డ్ అవుతున్న టైంలో సాల్ట్‌ ప్రమాదకరంగా మారుతున్న వేళ ఈ స్టంపింగ్ చేశాడు. ముంబైతో మ్యాచ్‌లో కూడా కీలకమైన టైంలో ధోనీ మెరుపు స్టంపింగ్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ రెండు స్టంపింగ్స్ కూా స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్‌లోనే చేయడం విశేషం.