IPL 2025: చెపాక్‌లో RCBపై బౌలింగ్‌ను ఎంచుకున్న CSK, చెరో మార్పుతో ప్లే 11 సిద్ధం చేసిన ఇరు జట్లు

CSK Vs RCB: చెపాక్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ CSK ఎంచుకుంది. చెన్నై, బెంగళూరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగుతున్నాయి.

Continues below advertisement

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించింది. గాయం కారణంగా గత మ్యాచ్‌కు దూరమైన భవనశ్వర్‌ ఇవాళ RCB టీంలోకి వచ్చేశాడు. చెన్నై జట్టులోకి మథీషా పతిరాణ ఎంట్రీ ఇచ్చాడు. గాయం కారణంగా ఈ ప్లేయర్ కూడా మొదటి మ్యాచ్‌ ఆడలేకపోయాడు. 

Continues below advertisement

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ 11 

విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), లియాం లివింగ్ స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజెల్వుడ్, యశ్ దయాల్

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11

రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), దీపక్ హుడా, సామ్ కురెన్, రవీంద్ర జడేజా, ఎం.ఎస్. ధోని (వికెట్ కీపర్), ఆర్. అశ్విన్, నూర్ అహ్మద్, మథీషా పతిరాణ, ఖలీల్ అహ్మద్

టాస్ తర్వాత కెప్టెన్స్‌ ఏమన్నారు?
రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్):
"మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాము. సర్ఫేస్‌ చాలా బాగుంది. గత పిచ్‌ కంటే ఇది మెరుగ్గా కనిపిస్తోంది. కాబట్టి, వారు ఇచ్చిన టార్గెట్ ఏదైనా ఛేజ్ చేయాలని చూస్తున్నాము. ఇప్పటివరకు, మంచు పడలేదు. మంచు ఎప్పుడు పడుతుందో తెలియదు. అది మా నియంత్రణలో లేదు. మంచు పడితే ఏం చేయాలో ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌ను పక్కాగా అమలు చేయాలని చూస్తున్నాము "

"మెరుగుపరచాల్సిన విషయాలు ఉన్నాయి. మైదానంలో స్లోగా ఉన్నాం. మరింత దూకుడుగా ఉండాలని అనుకుంటున్నాము. బ్యాటింగ్ విభాగంలో కొంచెం క్లినికల్‌గా ఉండవచ్చు. ఈసారి ఒకే ఒక మార్పు ఉంది. నాథన్ ఎల్లిస్ స్థానంలో మథీషా పతిరానా జట్టులోకి వచ్చాడు."

రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్):

"మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ అది వీలు పడలేదు. అది పెద్దగా ప్రభావం చూపుతుందని అనుకోవడం లేదు. సర్‌పేస్‌ రఫ్‌గా కనిపిస్తోంది. మేము మంచి స్కోరు సాధించి వారిని ఒత్తిడిలోకి నెట్టే ప్రయత్నం చేస్తాం. గత మ్యాచ్‌లో మా టీం బాగా రాణించారు. ముఖ్యంగా ఈ రకమైన లీగ్‌లో ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఉండటం ముఖ్యం."

"గత మ్యాచ్‌లో, బౌలింగ్ యూనిట్, 13 ఓవర్ల తర్వాత, తమ ప్రతిభను ప్రదర్శించి ధైర్యం చూపించిన విధానం ఆశ్చర్యం కలిగించింది. బ్యాటింగ్ కూడా, ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ, గొప్పగా ఆడారు. ఇది లీగ్‌లోని ఉత్తమ మ్యాచ్‌లలో ఒకటి. మా టీంలో రసిఖ్ స్థానంలో భువి వచ్చాడు."

Continues below advertisement