Just In





IPL 2025:శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పుడు అయ్యగారనే నంబర్ వన్
Virat Kohli New Record: ఐపీఎల్ 2025లో విరాట్ కోహ్లీ తన రెండో మ్యాచ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు శిఖర్ ధావన్ పేరుపై ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

Virat Kohli New Record: చెన్నైతో మ్యాచ్‌లో మరోసారి విరాట్ కొహ్లీ తన మార్క్ ఆట చూపించలేకపోయినా 30 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో కొన్ని పరుగులు చేసిన తర్వాత విరాట్ కోహ్లీ కొత్త రికార్డు సృష్టించాడు. శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టి చరిత్ర సృష్టించాడు. సీఎస్‌కేపై ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు.
శిఖర్ ధావన్‌ను వెనక్కి నెట్టిన విరాట్ కోహ్లీ
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్‌పై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ ఇప్పటి వరకు శిఖర్ ధావన్ ఉన్నాడు. అతను CSK పై 34 మ్యాచ్‌లు ఆడి 1054 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ జట్టుపై అతని సగటు దాదాపు 44, అతను 131 స్ట్రైక్ రేట్‌తో ఈ పరుగులు చేశాడు.
ఆ రికార్డును బ్రేక్ చేశాడు కోహ్లీ. విరాట్ ఇప్పటివరకు CSK తో 34 మ్యాచ్‌లు ఆడాడు.1057 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు CSKపై సెంచరీ చేయలేదు. 90 పరుగులతో పెద్ద ఇన్నింగ్స్ ఒకసారి ఆడాడుర. ఈ జట్టుపై 9 అర్ధ సెంచరీలు చేశాడు. అతను 37.96 సగటుతో 125.35 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించాడు.
ఈ జాబితాలో మూడో స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. అతను CSKపై 35 మ్యాచ్‌ల్లో 896 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ఆయన బాగా ఆడితే మాత్రం వెయ్యి పరుగులు పూర్తి చేయగలడు.
చెన్నైపై విజయం కోసం ఎదురు చూస్తున్న RCB
చెన్నై సూపర్ కింగ్స్, RCB మధ్య ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతోంది. గత 17 సంవత్సరాలుగా చెన్నైలో ఈ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 2008లో తొలిసారి ఐపీఎల్ ఆడినప్పుడు, ఆర్‌సిబి చెన్నైలో సిఎస్‌కెను ఓడించింది, అప్పటి నుంచి విజయం కోసం ఎదురు చూస్తోంది.
30 పరుగులు చేసిన కోహ్లీ
ఇవాళ్టి మ్యాచ్‌లో మాత్రం కోహ్లీ మొదట్లో కాస్త ఇబ్బంది పడ్డట్టు అనిపించింది. కానీ సాల్ట్ అవుట్ అయిన తర్వాత గేర్ మార్చాడు. వేగంగా ఆడుతున్న టైంలో నూర్‌అహ్మద్ బౌలింగ్‌లో రచిన్ రవీంద్రకు క్యాచ్ ఇచ్చి డగౌట్‌కు చేరుకున్నాడు. తన ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు ఒక సిక్స్ ఉంది.