Raj Kundra Legal Action Against Manoj Badale:  రాజస్థాన్ రాయల్స్ (RR) మాజీ కో-ఓనర్, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా బిగ్ లీగల్ వార్ స్టార్ట్ చేశారు. ప్రెజెంట్ ఆర్ఆర్ కో-ఓనర్ మనోజ్ బదాలేకి చెందిన ఎమర్జింగ్ మీడియా వెంచర్స్ (EMV) పై అణచివేత, దుర్వినియోగం ఆరోపణలు చేస్తూ ఎన్‌సిఎల్‌టి (NCLT) ముంబైలో పిటిషన్ ఫైల్ చేశారు. తన షేర్ల ఒరిజినల్ వ్యాల్యూ ను తక్కువ చేసి చూపి తనకు దక్కాల్సిన అసలైన మనీ ఇవ్వకుండా మోసం చేశారని కుంద్రా ఆరోపించారు. ఈ ఇష్యూపై సైలెంట్ గా ఉన్న తాను ఇప్పుడు సత్యం బయటకు తీసేందుకు BCCI కి ఆఫీషియల్ ప్రూఫ్స్, డాక్యుమెంట్లు అందించినట్లు ఒక ప్రకటనలో కుంద్రా స్పష్టం చేశారు.

Continues below advertisement

Continues below advertisement

యూకే కోర్టు తీర్పు.. ఎన్‌సిఎల్‌టి ని ఆశ్రయించిన రాజ్ కుంద్రాగతంలో 2009 లో రాజస్థాన్ రాయల్స్ లో 11.7 పర్సెంట్ స్టేక్ కొనుగోలు చేసిన కుంద్రా, 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ వివాదం తర్వాత 2015 లో లైఫ్ బాన్ ఫేస్ చేసి ఆర్ఆర్ ఓనర్ షిప్ నుంచి ఎగ్జిట్ అయ్యారు. రీసెంట్ గా ఇంగ్లాండ్ హైకోర్టు కుంద్రాకు 4.94 మిలియన్ యూఎస్ డాలర్లు రిపే చేయాలని ఆర్డర్ పాస్ చేసినప్పటికీ, అతను ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో మనోజ్ బదాలే పై లీగల్ కేస్ వేశారు. "నా షేర్లు అమ్మిన ఒరిజినల్ ప్రైస్ ని నా నుంచి దాచారు. నా కేసులో నిజం ఉంది, కోర్టులో తేల్చుకుంటా. సీ యు ఇన్ కోర్ట్ మనోజ్ బదాలే" అని కుంద్రా ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు.

Read Also: Gambhir - Dravid System Comparison: గంభీర్ కోచింగ్ స్టైల్ పై  అశ్విన్ విమర్శలు.. ద్రవిడ్ వ్యూహాలతో పోలుస్తూ కీలక వ్యాఖ్యలు!

బిసిసిఐ కి పవర్ ఫుల్ ప్రూఫ్స్.. ఒరిజినల్ ఆర్ఆర్ బిడ్ లో అవకతవకలురాజస్థాన్ రాయల్స్ ఒరిజినల్ బిడ్డింగ్ తో పాటు ఎమర్జింగ్ మీడియా ఇన్వెస్ట్‌మెంట్లలో జరిగిన ఇల్లీగల్ లావాదేవీలకు సంబంధించిన క్లియర్ డాక్యుమెంట్లను బిసిసిఐ, ఇన్వెస్టిగేషన్ అథారిటీలకు సబ్మిట్ చేసినట్లు కుంద్రా చెప్పారు. విశ్వసనీయతకు బ్రాండ్ అంబాసిడర్లుగా పోజులిచ్చే వాళ్ల అసలు రంగు బయటపెడతానని వార్నింగ్ ఇచ్చారు. తనతో ట్రస్ట్ బ్రీచ్ కి పాల్పడిన మనోజ్ బదాలే లీగల్ ఫైట్ ను ఫేస్ చేయక తప్పదని హెచ్చరించారు.

1.65 బిలియన్ డాలర్లకు బిగ్ డీల్.. చేతులు మారిన రాజస్థాన్ రాయల్స్ మేజర్ స్టేక్ఈ ఇష్యూ నడుస్తుండగానే, ఆర్ఆర్ మెజారిటీ స్టేక్ హోల్డర్ అయిన మనోజ్ బదాలే తన షేర్లను బిజినెస్ దిగ్గజాలు లక్ష్మీ ఎన్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, ఆదార్ పూనావాలాలకు ఏకంగా 1.65 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,600 కోట్లు) సేల్ చేశారు. ఈ మెగా ట్రాన్సాక్షన్ లో మెన్స్ ఐపీఎల్ టీమ్ తో పాటు పార్ల్ రాయల్స్, బార్బడోస్ రాయల్స్ ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.