Priyansh Arya House: ఇండియన్ ప్రీమియర్ లీగ్.... చాలా మంది గల్లీ క్రికెటర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. ప్రతి సీజన్‌లో కూడా కొత్త కుర్రాళ్లను వెలుగులోకి తీసుకొస్తోంది. ఇప్పుడు నడుస్తున్న 18వ సీజన్‌లో కూడా ప్రతిభావంతులైన ఆటగాళ్లు మరికొందరు అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటి ఆటగాళ్లు చాలామంది మారుమూల ప్రాంతాలకు చెందిన వారే. పంజాబ్‌కు చెందిన ప్రియాంశ్ ఆర్య కూడా అలాంటి వ్యక్తే.
ఐపీఎల్ చాలా చిన్న స్థాయి క్రికెటర్లను ఒక్కరోజులోనే కోటీశ్వరులను చేసింది. గత కొన్ని రోజులుగా IPL 2025లో ప్రియాంశ్ ఆర్య పేరు చర్చనీయాంశంగా మారింది, అతను గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున 47 పరుగుల విధ్వంసకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ప్రియాంశ్‌ను పంజాబ్ ఫ్రాంచైజీ 3.8 కోట్ల రూపాయలకు ఆక్షన్‌లో కొనుగోలు చేసిందని తెలిసిందే. ఈ ఒప్పందం కారణంగా ప్రియాంశ్ తన తండ్రి కోసం ఖరీదైన ఇల్లు కట్టించబోతున్నాడు.
IPL డీల్‌తో కొత్త ఇల్లుప్రస్తుతం ప్రియాంశ్ ఆర్య కుటుంబం అద్దె ఇంట్లో ఉంటోంది. ఈ 23 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, వారి కుటుంబం ఇప్పటివరకు ఇల్లు కొనుగోలు చేయలేదు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్‌తో 3.8 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకోవడంతో ఆర్థికంగా కాస్త స్థిరత్వం వచ్చింది. దీంతో ప్రియాంశ్ చాలా త్వరలో కొత్త ఇల్లు కొనుగోలు చేయవచ్చునని తెలిసింది. ప్రియాంశ్ ఒకే IPL డీల్‌తో తన కుటుంబంలోని పేదరికాన్ని తొలగించబోతున్నాడు.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రియాంశ్ 47 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. IPL 2025 అతనికి కొత్త గుర్తింపును ఇచ్చింది. కానీ ప్రియాంశ్ అంతకుముందు భారతీయ డొమెస్టిక్ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో సౌత్ ఢిల్లీ జట్టు తరఫున ఆడుతూ అద్భుతమైన శతకం సాధించాడు. అదేవిధంగా నార్త్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతను మనన్ భార్గవ్ వేసిన 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శన తర్వాత అతనికి మెగా వేలంలోకి వచ్చాడు. అతన్ని పంజాబ్ కింగ్స్ 3.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
ప్రియాంశ్ ఆర్య డొమెస్టిక్ కెరీర్ప్రియాంశ్ ఆర్య డొమెస్టిక్ కెరీర్ గురించి మాట్లాడితే, అతను ఇప్పటివరకు తన కెరీర్‌లో 19 T20 మ్యాచ్‌లు ఆడాడు, వాటిలో 620 పరుగులు చేశాడు. ప్రియాంశ్ తన T20 కెరీర్‌లో ఒక శతకం, 3 అర్ధశతకాలు కూడా చేశాడు. అంతేకాకుండా 7 లిస్ట్-A మ్యాచ్‌లలో అతని పేరుకు ఇప్పటివరకు కేవలం 77 పరుగులు మాత్రమే ఉన్నాయి.