Punjab Kings vs Rajasthan Royals: ఐపీఎల్‌ 2023 సీజన్ 66వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌ (RR) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట పంజాబ్ కింగ్స్ (PBKS) మొదట బ్యాటింగ్ చేయనుంది.


పాయింట్ల పట్టికలో రాజస్తాన్ రాయల్స్ ఆరో స్థానంలోనూ, పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలోనూ ఉన్నాయి. కనీసం 14 పాయింట్లతో రేసులో నిలబడాలన్నా రెండు జట్లకూ ఈ మ్యాచ్‌లో విజయం కీలకం. నెట్ రన్‌రేట్ కూడా ముఖ్యమే కాబట్టి గెలిచే జట్టు భారీ తేడాతో గెలవాల్సి ఉంది.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, అథర్వ తైదే, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కుర్రాన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్


పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
నాథన్ ఎల్లిస్, సికందర్ రజా, రిషి ధావన్, మోహిత్ రాథీ, మాథ్యూ షార్ట్.


రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శామ్సన్ (కెప్టెన్, వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, ఆడమ్ జంపా, ట్రెంట్ బౌల్ట్, నవదీప్ సైనీ, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్


రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, ఆకాష్ వశిష్ట్, కుల్దీప్ సేన్, మురుగన్ అశ్విన్.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ తాజా సీజన్లో రాజస్థాన్‌ రాయల్స్‌ను (Rajasthan Royals) చూస్తే జాలేస్తోంది! ఆరంభంలో అమేజింగ్ విక్టరీస్‌తో దూసుకెళ్లిన సంజూ సేన.. సెకండాఫ్‌లో అట్టర్‌ ఫ్లాఫ్‌ అయింది! గెలిచే మ్యాచుల్ని చేజేతులా వదిలేసింది. నిర్ణయాలు, వ్యూహాల్లో లోపాలు ఇబ్బంది పెట్టాయి. ఆటగాళ్లంతా ఫిట్‌నెస్‌తో ఉన్నా సరిగ్గా ఉపయోగించుకోకపోవడం చేటు చేసింది. యశస్వీ జైశ్వాల్‌ ఓపెనింగ్‌లో అదరగొడుతున్నాడు. జోస్‌ బట్లర్‌ నుంచి మెరుపుల్లేవ్‌. సంజూ శాంసన్‌ కీలక ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. దేవదత్‌ పడిక్కల్, హెట్‌మైయిర్‌, ధ్రువ్‌ జోరెల్‌ నిలబడటం లేదు. జేసన్‌ హోల్డర్‌ బ్యాటింగ్‌ స్కిల్స్‌ను అస్సలు వాడుకోలేదు. లెక్క తప్పి ఆర్సీబీ చేతిలో ఘోరంగా ఓడిపోయారు! బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌ ఫర్వాలేదు. ట్రెంట్‌బౌల్ట్‌ అందుబాటులో ఉన్నాడు. సందీప్‌ శర్మ, ఒబెడ్‌ మెకాయ్‌ అతడికి అండగా ఉంటారు. యూజీ, యాష్‌ స్పిన్‌ గురించి తెలిసిందే. ఈ మ్యాచులో భారీ తేడాతో గెలిస్తే ముంబయి, ఆర్సీబీ తర్వాతి మ్యాచుల్లో ఓడితే.. రాయల్స్‌కు ప్లేఆఫ్‌ ఛాన్స్‌ ఉంటుంది.


పంజాబ్‌ కింగ్స్‌ (Punjab Kings) కథ ఎప్పట్లాగే ముగిసింది! కొన్ని మ్యాచుల్లో మెరుపులు మినహాయిస్తే ఓటముల పరంపర ఆగలేదు. చివరి మ్యాచులో గెలిచే అవకాశాన్ని గబ్బర్‌ సేన చేజేతులా వదిలేసింది. సీమ్‌ను అనుకూలించే పిచ్‌పై స్పిన్నర్లతో అటాక్‌ చేయడం కొంప ముంచింది! ప్రభుసిమ్రన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. గబ్బర్‌ నుంచి మెరుపులేం రావడం లేదు. లియామ్‌ లివింగ్‌స్టోన్‌ మాత్రం రెచ్చిపోతున్నాడు. పేసర్ల బౌలింగ్‌లో 200 స్ట్రైక్‌రేట్‌తో అటాక్‌ చేస్తున్నాడు. స్పిన్నర్లు రాగానే చతికిల పడుతున్నాడు. జితేశ్‌ శర్మ తనదైన ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. షారుక్‌ ఖాన్‌ను ప్రతిసారీ ప్రెజర్లోనే పంపిస్తున్నారు. అతడేం చేయలేకపోతున్నాడు. షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడుతున్నా అథర్వను కంటిన్యూ చేస్తున్నారు. హర్‌ప్రీత్‌ బౌలింగ్‌లో తేలిపోయాడు. అర్షదీప్‌లో కసి కనిపించడం లేదు. ఎలిస్‌ ఫర్వాలేదు. సామ్‌ కరన్‌ స్కిల్స్‌ ఏమయ్యాయో తెలియడం లేదు. రజా, రబాడా జస్ట్‌ ఓకే!