Punjab Kings vs Delhi Capitals: ఐపీఎల్‌ 2023 సీజన్ 62వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మొదట బ్యాటింగ్ చేయనుంది.


పంజాబ్ కింగ్స్ తన తుదిజట్టులో రెండు మార్పులు చేసింది. అధర్వ తైడే, కగిసో రబడ తిరిగి తుది జట్టులోకి వచ్చాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆన్రిచ్ నోర్జే తిరిగి జట్టులోకి వచ్చాడు. మిషెల్ మార్ష్ గాయపడటంతో నోర్జేకు స్థానం దక్కింది


పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ పదో స్థానంలోనూ, పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలోనూ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను ఓడిస్తే తమతో పాటు ఇంటికి తీసుకువెళ్లే అవకాశం ఉంది.


పంజాబ్ కింగ్స్ తుది జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), అథర్వ టైడే, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సామ్ కుర్రాన్, షారుఖ్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, కగిసో రబాడ, నాథన్ ఎల్లిస్, అర్ష్‌దీప్ సింగ్


పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సికందర్ రజా, మాథ్యూ షార్ట్, రిషి ధావన్, మోహిత్ రాథీ


ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టు
డేవిడ్ వార్నర్ (కెప్టెన్), పృథ్వీ షా, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రిలీ రోసోవ్, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, యష్ ధుల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్


ఢిల్లీ క్యాపిటల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
ముఖేష్ కుమార్, అభిషేక్ పోరెల్, రిపాల్ పటేల్, ప్రవీణ్ దూబే, సర్ఫరాజ్ ఖాన్


అదృష్టమో.. దురదృష్టమో.. కొన్నేళ్లుగా పంజాబ్‌ కింగ్స్‌కు (Punjab Kings) అచ్చిరావడం లేదు. 2013లో చివరిసారిగా ప్లేఆఫ్ చేరుకుంది. అప్పట్నుంచి కష్టపడుతూనే ఉంది. ఈ సీజన్లో గబ్బర్‌ నాయకత్వంలో కాస్త ఆశలు రేపుతోంది. ఇప్పటికే 12 మ్యాచుల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించింది. మరో 4 పాయింట్లు వస్తే నాకౌట్‌ దశకు చేరుకోవచ్చు. ఇందుకోసం మొదట ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించాలి. టార్గెట్‌ మిస్సైందా! ఇక ఎలిమినేట్‌ అవ్వాల్సిందే! పంజాబ్‌లో విదేశీయులతో పోలిస్తే దేశవాళీ క్రికెటర్లు రాణిస్తున్నారు. ప్రభుసిమ్రన్‌ మొన్నే సెంచరీ కొట్టాడు. జితేశ్‌ శర్మ వికెట్‌కీపింగ్‌, మ్యాచ్ ఫినిషింగ్‌ టాలెంట్‌ అద్భుతం! వీరిద్దరినీ ఎంకరేజ్‌ చేయడం ముఖ్యం. లియామ్‌ లివింగ్‌స్టోన్‌కు ఢిల్లీ బౌలర్లపై మంచి రికార్డు లేదు. బౌలింగ్‌ పరంగా కింగ్స్‌ ఫర్వాలేదు. అయితే మూమెంట్స్‌ను ఒడిసిపట్టడం ముఖ్యం. అర్షదీప్‌, ఎలిస్‌, చాహర్‌, రిషి మంచి బౌలింగ్‌ చేయాలి.


ఐపీఎల్‌ 2023లో అందరి కన్నా ముందుగా ఎలిమినేట్‌ అయిన టీమ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals)! ఎన్నో ఆశలతో అడుగుపెట్టినా.. ఆటగాళ్ల గాయాలు, ఫామ్‌ లేమి వీరిని ఇబ్బంది పెట్టింది. ఆరంభంలోనే తడబడటంతో మూమెంటమ్‌ అందుకోలేకపోయింది. అందుకే చివరి రెండు మ్యాచుల్లో గెలిచి పరువు నిలుపుకోవాలని పట్టుదలతో ఉంది. మంచి బ్యాటర్లు ఉన్నప్పటికీ ఎందుకో జట్టు కూర్పు కుదర్లేదు. అయితే పంజాబ్‌ కింగ్స్‌ అందరి బౌలింగ్‌లోనూ డేవిడ్‌ వార్నర్‌కు సూపర్‌ రికార్డు ఉంది. ఒక్కసారీ ఔటవ్వలేదు. ఫిల్‌సాల్ట్‌ నెమ్మదించాడు. మిచెల్‌ మార్ష్‌, రిలీ రొసో తమ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. మనీశ్‌ పాండే మరో సీజన్లోనూ నిరాశపరిచాడు. అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. ఖలీల్‌ అహ్మద్‌, ఇషాంత్‌ శర్మ, ముకేశ్‌, కుల్‌దీప్‌ బౌలింగ్‌ ఫర్వాలేదు. ఈ మ్యాచులో ఢిల్లీ గెలిచిందంటే పంజాబ్‌ ప్లేఆఫ్ రేసు నుంచి ఎలిమినేట్‌ అవుతుంది.