Pat Cummins  and  Mitchell Starc: ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ అందుకు తగ్గట్లుగా ప్రదర్శన చేయడంలో విఫలమవడం ఆనవాయితీగా వస్తుంది.  ఐపీఎల్ చ‌రిత్రలో అత్యధిక ధ‌ర‌కు అమ్ముడు పోయిన ఆస్ట్రేలియా పేస‌ర్‌, కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ పేసర్‌... మిచెల్‌ స్టార్క్‌(Mitchell Starc) ప్రదర్శన... క్రికెట్‌ అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. ఐపీఎల్ వేలంలో కోల్‌కత్తా జట్టు మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కమిన్స్  రూ. 20.5 కోట్లకు అమ్ముడు పోయారు. ఈ ఇద్దరు ప్లేయర్లు కోల్‌కత్తా-హైదరాబాద్‌లో మ్యాచ్‌లో తలపడ్డారు. కానీ వీరిద్దరూ ఆశించిన స్థాయిలో వీరిద్దరూ రాణించక పోవటంతో ఆయా జట్ల అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. 


కమిన్స్‌ పేలవ ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో తొలుత  బ్యాటింగ్‌ చేసిన కోల్‌కత్తా 208 పరుగుల భారీ స్కోర్ సాధించింది. హైదరాబాద్‌ కెప్టెన్‌గా ఉన్న కమిన్స్‌(Pat Cummins) కోల్‌కత్తా భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడంలో విఫలమయ్యాడు. కోల్‌కత్తా బ్యాటర్లను కట్టడి చేయడంలో కమిన్స్‌ వ్యూహాలు ఏ మాత్రం పనిచేయలేదు. కమిన్స్ నాలుగు ఓవర్లు వేశాడు.. కేవలం ఒక వికెట్ మాత్రమే పడగొట్టి 32 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు.. చివరి బంతికి ఐదు పరుగులు కొట్టాల్సిన స్థితిలో షాట్ ఆడడంలో కమిన్స్ విఫలమయ్యాడు. కమిన్స్ చివరి బంతిని సిక్స్ కొట్టిఉంటే హైదరాబాద్‌ గెలిచేది. ఫోర్‌ కొట్టిన మ్యాచ్ డ్రా అయ్యి ఉండేది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ కమిన్స్ విఫలం కావటంతో హైదరాబాద్‌ జట్టు ఓటమికి కారణమైంది. 


స్టార్క్‌ది అదే కథ...
ఐపీఎల్ వేలంలో కోల్‌కత్తా జట్టు మిచెల్ స్టార్క్ రూ. 24.75 కోట్లకు కొనుగోలు చేసింది. స్టార్క్‌ కూడా దారుణంగా విఫలమయ్యాడు. హైదరాబాద్‌ ఇన్నింగ్స్ 19 ఓవ‌ర్ వేసిన స్టార్క్ ఏకంగా 26 ప‌రుగులు స‌మ‌ర్పించకున్నాడు. ఆ ఓవ‌ర్‌లో మొత్తం నాలుగు సిక్స్‌లు బాదారు. అందులో క్లాసెన్ 3 సిక్స్‌లు కొట్టగా.. షబాజ్ అహ్మద్ ఓ సిక్స్ బాదాడు. ఈ మ్యాచ్‌లో స్టార్క్ త‌న నాలుగు ఓవ‌ర్ల కోటాలో వికెట్ ఏమీ తీయ‌కుండా ఏకంగా 53 ప‌రుగులు స‌మ‌ర్పించుకున్నాడు. దారుణ ప్రదర్శన కనబరిచిన స్టార్క్‌ను నెటిజన్లు దారుణంగా విఫలమవుతున్నారు. స్టార్క్‌ కంటే హర్షిత్ రానా ఎంతో బెటర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరు అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు విఫలం కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మిమ్స్ తో కామెంట్లు చేస్తున్నారు. 


హర్షిత్‌ రానాకు షాక్‌
ఐపీఎల్‌-2024లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బాల్ వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరి బాల్ లో సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ బంతిని బౌండరీకి తరలించే క్రమంలో విఫలం కావడంతో కోల్‌కత్తా నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కత్తా సీమర్‌ హర్షిత్ రానా ఓవరాక్షన్ చేశాడు. సన్‌రైజర్స్‌ ఓపెనర్‌ మయాంక్ అగర్వాల్‌ను ఔట్ చేసిన అనంతరం రానా సెలబ్రేషన్స్ శృతిమించాయి. దీంతో హర్షిత్ రాణాకు ఐపీఎల్ మేనేజ్‌మెంట్‌ బిగ్‌ షాక్‌ ఇచ్చింది. రాణా మ్యాచ్ ఫీజులో 60శాతం జరిమానా విధించారు. కేకేఆర్ విజయంలో బ్యాటింగ్ లో రసూల్, బౌలింగ్ లో హర్షిత్ రాణా కీలక భూమిక పోషించారు.