IPL 2022, MI team analysis: తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి. జట్టంటే ముంబయి ఇండియన్స్‌లా (Mumbai Indians) ఉండాలి! ఇప్పటి వరకు 14 ఐపీఎల్ సీజన్లు జరిగితే 5 సార్లు ట్రోఫీ గెలిచింది హిట్‌మ్యాన్ సేన! అందుకే దానిని 'మైటీ ముంబయి' అంటారు. మొన్నటి వరకు దుర్భేద్యంగా కనిపించిన ఆ జట్టు ఇప్పుడెలా ఉంది? కోర్‌టీమ్‌ను (MI core team) దక్కించుకోగలిగిందా? జట్టు కూర్పు కుదురుతుందా? సరైన దేశవాళీ ఆటగాళ్లు ఉన్నారా? 2022లో రోహిత్ సేన అవకాశాలేంటి?
అన్నింట్లో అద్భుతం
ఇండియన్ ప్రీమియర్ లీగులో (Indian premier leauge) ముంబయి ఇండియన్స్ అంటే తిరుగులేని జట్టు! టాప్ ఆర్డర్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్‌లో తిరుగులేని బ్యాటర్లు ఉంటారు. ఇక పేస్ బౌలర్లు, స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లకు కొదవలేదు. అందుకే ఐదు సార్లు కప్పులు గెలిచింది. ఎంఎస్ ధోనీలాగే (MS Dhoni) ఆటగాళ్లపై విపరీతంగా నమ్మకం ఉంచే కెప్టెన్ రోహిత్ శర్మే (Rohit sharma) వారి బలం. అతను ఆడకపోయినా మిగతా వాళ్లు ఆకట్టుకుంటారు. తక్కువ స్కోర్లను డిఫెండ్ చేసే బౌలర్లూ ఉంటారు. ఇక ముంబయి కోచింగ్ స్టాఫ్ అయితే అంతర్జాతీయ జట్టు కన్నా బెటర్‌గా ఉంటుంది. అయితే ఆలస్యంగా పుంజుకోవడం, ఆఖర్లో అవకాశాలను కోల్పోవడంతో ఓ బలహీనత. వేలంలో కోరుకున్న కొందరు ఆటగాళ్లను ఆ జట్టు దక్కించుకోలేకపోయింది. అయితే ముంబయి, మహారాష్ట్రలోనే మ్యాచులు జరుగుతుండటం వల్ల ప్లేఆఫ్స్ అయితే గ్యారంటీ!
కోర్ టీమ్ పరిస్థితి ఏంటి?
ముంబయి ఇండియన్స్ తన పాత కోర్ టీమ్‌ను (MI core team) దాదాపుగా దక్కించుకుంది. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (Ishan Kishan), సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav), కీరన్ పొలార్డ్ (Pollard), జస్ప్రీత్ బుమ్రా (Jasprit bumrah)ను సొంతం చేసుకుంది. కానీ విధ్వంసకరంగా ఆడే క్వింటన్ డికాక్, హార్దిక్, కృనాల్ పాండ్య సోదరులను వదిలేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు డేనియెల్ సామ్స్, ఫాబియన్ అలెన్, జయదేవ్ ఉనద్కత్ ఇందులో చేరతారు. అయితే మిడిలార్డర్లో ముంబయికి ఒకప్పటి బలం కనిపించడం లేదు. టాప్-4 విఫలమైతే భారమంతా కీరన్ పొలార్డ్ పైనే పడుతుంది. మ్యాచ్ ఫినిషర్ల రోల్స్‌పై స్పష్టత లేదు. అలాగే జస్ప్రీత్ బుమ్రాకు తోడుగా అదే స్థాయిలో రాణించే ఇండియన్ బౌలర్లు లేరు. బాసిల్ థంపి, జయదేవ్ ఉనద్కత్ ఏ మేరకు రాణిస్తారో తెలియదు. ఏదేమైనా కాంబినేషన్లు, సమతూకం విషయంలో మెరుగుదల అవసరం.
తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తారు. వీరిద్దరిదీ డిస్ట్రక్టివ్ పెయిర్. కానీ ఇద్దరికీ బలహీనతలు ఉన్నాయి. అత్యధిక ధర పలికిన ఒత్తిడి ఇషాన్‌పై ఉంటుంది. వన్‌డౌన్లో సూర్యకుమార్ వస్తాడు. నాలుగో స్థానంలో కుర్రాడు తిలక్ వర్మకు ఛాన్స్ ఉంటుంది. ఈ దేశవాళీ కుర్రాడు 143 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేస్తాడు. అవసరమైతే బౌలింగ్ చేయగలడు. ఆ తర్వాత టిమ్‌డేవిడ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలన్ ఉంటారు. ఈ ముగ్గురూ బ్యాటింగ్, బౌలింగ్ చేస్తారు. ఇక బౌలింగ్‌లో జయదేవ్ ఉనద్కత్, తైమల్ మిల్స్, మయాంక్ మర్కండే, జస్ప్రీత్ బుమ్రా ఉంటారు. ముంబయి ఈ సారి స్వదేశీయుల కన్నా విదేశీయుల మీదే ఎక్కువ ఆధారపడాల్సి వస్తోంది.
ముంబయి ఇండియన్స్ షెడ్యూలు - Mumbai Indians IPL 2022 Schedule
Date | Fixture | Time (In IST) | Venue |
March 27 | Mumbai Indians vs Delhi Capitals | 7:30 PM | Brabourne – CCI |
April 2 | Mumbai Indians vs Rajasthan Royals | 3:30 PM | DY Patil Stadium |
April 6 | Kolkata Knight Riders vs Mumbai Indians | 7:30 PM | MCA Stadium – Pune |
April 9 | Royal Challengers Bangalore vs Mumbai Indians | 7:30 PM | MCA Stadium – Pune |
April 13 | Mumbai Indians vs Punjab Kings | 7:30 PM | MCA Stadium – Pune |
April 16 | Mumbai Indians vs Lucknow Super Giants | 7:30 PM | Brabourne – CCI |
April 21 | Mumbai Indians vs Chennai Super Kings | 7:30 PM | DY Patil Stadium |
April 24 | Lucknow Super Giants vs Mumbai Indians | 7:30 PM | Wankhede Stadium |
April 30 | Rajasthan Royals vs Mumbai Indians | 7:30 PM | DY Patil Stadium |
May 6 | Gujarat Titans vs Mumbai Indians | 7:30 PM | Brabourne – CCI |
May 9 | Mumbai Indians vs Kolkata Knight Riders | 7:30 PM | DY Patil Stadium |
May 12 | Chennai Super Kings vs Mumbai Indians | 7:30 PM | Wankhede Stadium |
May 17 | Mumbai Indians vs Sunrisers Hyderabad | 7:30 PM | Wankhede Stadium |
May 21 | Mumbai Indians vs Delhi Capitals | 7:30 PM | Wankhede Stadium |