Kwena Maphaka as replacement for Dilshan Madushanka: అండర్‌ 19 ప్రపంచకప్‌(U19 World Cup)లో తన పేస్‌ బౌలింగ్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన దక్షిణాఫ్రికా బౌలర్ క్వేన్‌ మపాకా(Kwena Maphaka) గుర్తున్నాడా... వరుసగా మూడుసార్లు అయిదు వికెట్ల ప్రదర్శన చేసి సరికొత్త రికార్డు సృష్టించిన ఈ ప్రొటీస్‌ పేసర్‌... ఐపీఎల్‌ బరిలో దిగనున్నాడు. ప్రతిభగల ఆటగాళ్లను వలవేసి పట్టడంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్‌.. ఈ స్టార్‌ బౌలర్‌ను జట్టులోకి తీసుకుంది. అండర్‌ 19 ప్రపంచకప్‌లో సత్తా చాటిన మసాకా ఐపీఎల్‌లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. అండర్‌-19 వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించిన 17 ఏళ్ల మఫాకా.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఎలా రాణిస్తాడో చూడాల్సి ఉంది. అండర్‌  19 వరల్డ్‌ కప్‌లో 21 వికెట్లు పడగొట్టిన మఫాక.. క్రికెట్‌ సౌతాఫ్రికా టీ 20 చాలెంజ్‌లో భాగంగా లయన్స్‌ తరఫున ఆడి రాణించాడు. సౌతాఫ్రికా తరఫున భవిష్యత్తు రబాడాగా ప్రశంసలు దక్కించుకుంటున్న మఫాక.. ముంబైకి ఆడనున్నాడు. రబాడా చొరవతో ముంబై.. మఫకను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యువ పేసర్‌ను నెట్‌ బౌలర్‌గా వాడుతారా..? లేక నేరుగా మ్యాచ్‌లలో ఆడిస్తారా..? అనేది మాత్రం తేలాల్సి ఉంది. 


అండర్‌ 19లో సత్తా చాటి... 
అండర్‌ 19 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బౌలర్‌ మఫాకా సరికొత్త చరిత్ర లిఖించాడు. అండర్‌ 19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకూ ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని రికార్డును సౌతాఫ్రికా పేస్‌ బౌలర్ క్వేనా మపాకా(Kwena Maphaka) నెలకొల్పాడు. శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో మసాకా ఆరు వికెట్లు నేలకూల్చి ఈ ఘనత సాధించాడు. ఈ ప్రపంచకప్‌లో మసాకాకు ఇది మూడోసారి అయిదు వికెట్ల ప్రదర్శన. అండర్‌-19 ప్రపంచకప్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ బౌలర్‌ సింగిల్‌ ఎడిషన్‌లో మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు చేయలేదు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసిన మసాకా... వెస్టిండీస్‌పై 38 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన మపాకా 18 వికెట్లు తీసి లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా కొనసాగుతున్నాడు. 17 ఏళ్ల లెఫ్ట్‌ ఆర్మ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ అయిన మపాకా బుల్లెట్‌ వేగంతో నిప్పులు చెరిగే బంతులు సంధిస్తూ ప్రత్యర్ధి బ్యాటర్లను నిశ్రేష్ఠులను చేస్తున్నాడు. ఇటీవలే జస్ప్రీత్‌ బుమ్రా కంటే వేగంగా యార్కర్లు సంధిస్తానని మసాకా సవాల్‌ కూడా చేశాడు.


షమీ స్థానంలో వారియర్...
అండర్‌ – 19 వరల్డ్‌ కప్‌లో 21 వికెట్లు పడగొట్టిన మఫక.. క్రికెట్‌ సౌతాఫ్రికా (సీఎస్‌ఎ) టీ 20 చాలెంజ్‌లో భాగంగా లయన్స్‌ తరఫున ఆడాడు. ఆ టోర్నీలో కూడా రాణించాడు. సౌతాఫ్రికా తరఫున భావి రబాడాగా ప్రశంసలు దక్కించుకుంటున్న మఫక.. ముంబైకి ఆడనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ అయిన ఎస్‌ఎ20లో ఎంఐ కేప్‌టౌన్‌ తరఫున ఆడే రబాడా చొరవతో ముంబై.. మఫకను సంప్రదించినట్టు తెలుస్తోంది. అయితే ఈ యువ పేసర్‌ను నెట్‌ బౌలర్‌గా వాడుతారా..? లేక నేరుగా మ్యాచ్‌లలో ఆడిస్తారా..? అనేది మాత్రం తేలాల్సి ఉంది.


Also Read: మూడు నెలలు ఆడకపోయినా, నెంబర్‌ వన్‌ సూర్యా భాయ్‌