IPL 2024: లఖ్‌నవూ సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ జట్లు శుక్రవారం మరో కీలక మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ముంబై లోని వాంఖడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక కానుంది. ముంబయి ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి బయటకి వెళ్లగా.. తమకున్న చిన్న అవకాశాన్ని గట్టిగా పట్టుకోవాలని రాహుల్ సేన ఆరాటపడుతోంది.


లఖ్‌నవూకు కష్టమే.. 


ఇటీవల వరుసగా మూడు ఓటములతో.. ఎల్ ఎస్ జీ ప్లే ఆఫ్ అవకాశాలను చేజేతులా సంక్లిష్టం చేసుకుంది. దాదాపు ప్లే ఆఫ్ రేసుకు దూరమైంది. ఒక వేళ లఖ్‌నవూ ఈ మ్యాచ్ లో ముంబై పై విజయం సాధించినా ప్లే ఆఫ్ బెర్తు కోెసం ఇతర టీములపై ఆధార పడాలి. చెన్నై, బెంగుళూరు, దిల్లీ జట్లను దాటుకుని ప్లే ఆఫ్స్ కి చేరాలంటే.. ప్రస్తుతం లఖ్‌నవూ ముందు ఉన్న లక్ష్యం భారీ తేడాతో ముంబైపై నెగ్గడం. అలా అయితేనే కొద్దో గొప్పో ప్లే ఆఫ్ రేసులో సజీవంగా ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈ టీమ్ రన్ రేట్ (-0.787 )చాలా తక్కువగా ఉంది. 13 మ్యాచుల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు 1 3 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలతో ముంబై పాయింట్ల టేబుల్ లో అట్టడుగున ఉంది. కనీసం ఈ విజయంతో నైనా కొంత గౌరవ ప్రదంగా ఇంటికెళ్లేందుకు ముంబై చూస్తోంది. 


ముంబై - లఖ్‌నవూ హెడ్ టు హెడ్


ఇంత వరకూ ఈ రెండు టీమ్ లు అయిదు సార్లు తలపడగా నాలుగు సార్లు ముంబై ఇండియన్స్ మీద  లఖ్‌నవూ సూపర్ జైంట్స్ గెలిచి తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. ఈ సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా లఖ్‌నవూనే నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్‌లో  తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై  7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేయగా లఖ్‌నవూ 19.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో ఎల్ ఎస్ జీ ఆటగాడు స్టాయినీస్ 62 పరుగులు చేయడంతో పాటు ఓ కీలక వికెట్ తీసి జట్టుని విజయపథంలో నడిపించాడు. 


పిచ్ రిపోర్ట్


వాంఖడే స్టేడియం బౌలర్లకే అనుకూలిస్తుంది. కానీ సరిగ్గా వినియోగించుకుంటే బ్యాట్స్‌మెన్ కూడా మంచి స్కోర్లు సాధించొచ్చు. ఇప్పటి వరకు ఇక్కడ 115 మ్యాచ్‌లు జరగ్గా తొలుత బౌలింగ్ చేసిన జట్లు 62 సార్లు గెలిచాయి. గత పది మ్యాచ్‌లలోనూ ఇదే ట్రెండు కొనసాగింది.  ఏడు మ్యాచుల్లో ముందు బౌలింగ్ చేసిన జట్లే గెలిచాయి. 


ముంబై బ్యాటింగ్ చేయాల్సొస్తే టీమ్ ఇలా. 


ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ , తిలక్ వర్మ, హార్థిక్ పాండ్య, నెహాల్ వదేరా, టిమ్ డేవిడ్, నమన్ ధీర్, అన్షుల్ కంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా


ముంబై బౌలింగ్ చేయాల్సొస్తే టీమ్ ఇలా. 


ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్ , తిలక్ వర్మ, హార్థిక్ పాండ్య, నెహాల్ వదేరా, టిమ్ డేవిడ్, నమన్ ధీర్, అన్షుల్ కంబోజ్, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రా


లఖ్‌నవూ బ్యాటింగ్ చేయాల్సొస్తే..  టీమ్ ఇలా ఉండే అవకాశం


క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్,కృనాల్ పాండ్యా, ఆయుష్ బదోనీ,  అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, యద్వీర్ సింగ్,  నవీనుల్ హక్


లఖ్‌నవూ బౌలింగ్ చేయాల్సొస్తే..  టీమ్ ఇలా ఉండే అవకాశం


క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్, మార్కస్ స్టాయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్,కృనాల్ పాండ్యా, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, యద్వీర్ సింగ్,  నవీనుల్ హక్, మోసిన్ ఖాన్